పైరసీని అరికట్టడం ఎలా?
Publish Date:Jul 4, 2025
Advertisement
శత కోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలున్నాయి. కానీ పైరసీకి మాత్రం ఒక్కటంటే ఒక్క ఉపాయం కూడా కనుగొనలేక పోవడం విచారకరం. పైరసీని అరికట్టడం ఎలా ఉన్నదే ప్రస్తుతం టాలీవుడ్ జనాలను వేధిస్తోన్న ప్రశ్న. ఒకే ఒక్కడు.. చిన్నపాటి సెల్ ఫోన్ కెమెరా వాడి హెచ్ డీ ప్రింట్ తలదన్నేలా సినిమాలకు సినిమాలను పైరసీ చేస్తుంటే.. టాలీవుడ్ ఇంత టెక్నాలజీ సాయం ఉండి కూడా ఏమీ చేయలేక పోవడం విడ్డూరం. విచారకరం. విచిత్రమేంటంటే సినిమాను బట్టి నలభై నుంచి ఎనభై వేల మధ్య వరకూ ఇతడు వసూలు చేయడమే కాకుండా ఇప్పటి వరకూ సుమారు 65 సినిమాలను మూవీ రూల్స్, ఐ బొమ్మ వంటి సైట్స్ కి అమ్మి సొమ్ము చేసుకుంటుంటే చూస్తూ ఊరుకోవడం తప్ప మరే చేయలేకపోవడం ఏమిటి? ఈ పైరసీ మూవీ సైట్స్ ని ఎందుకు ఆపలేక పోతున్నాం.. ఒక సాధారణ టెక్నీషియన్ కి తెలిసినంత కూడా ఇక్కడి సినీ జనానికి తెలియకపోవడం ఏమిటి? పైరసీకి విరుగుడు ఎందుకు కనిపెట్టలేక పోతున్నారు? 019 నుంచి ఇప్పటి వరకూ టాలీవుడ్ కి ఈ ఒక్క పైరసీకారుడి ద్వారా ఏర్పడ్డ నష్టం ఏకంగా 3500 కోట్ల రూపాయలు అని తెలుస్తోంది. ఒకే ఒక్కడు ఎందరో 24 క్రాప్ట్స్ కి చెందిన కళాకారుల కళారూపాలను వారి ఆశలూ ఆశయాలను ఛిద్రం చేస్తుంటే చోద్యం చూస్తూ ఊరుకోవడమేంటన్నది అంతుపట్టని, సమాధానం దొరకని ప్రశ్నగా మిగిలిపోతోంది. తమపై వ్యక్తిగతంగా తప్పుడు కథనాలు వచ్చినపుడు సినిమా స్టార్లు సైబర్ క్రైమ్ కి కంప్లయింట్ చేస్తుంటారు. అదే తమ సినిమాలకు సంబంధించి ఎలాంటి కంప్లయింట్లు చేయరు. అదీ తొలి రోజు తొలి ఆట పడీ పడక ముందే మూవీ రూల్స్ వంటి సైట్లలో ఆయా సినిమాలు ప్రత్యక్షమవుతుంటే.. ఆ సినిమాకు పని చేసిన వారు కూడా థియేటర్ కి వెళ్లకుండా ఈ పైరేట్ సైట్లలో చూస్తుంటారు. సినీ జనాల్లో అత్యధికులు తమ ప్రత్యర్ధి హీరోల, దర్శక నిర్మాతల సినిమాలు ఎలా ఉంటాయో చూసేది ఈ విధానం ద్వారానే అంటారు. ఆ మాటకొస్తే పైరసీ అనేది వెలుగు చూసిందే వీరి వల్లనంటారు. అదలా పాకి పాకి.. నేడు ఇండస్ట్రీకే అతి పెద్ద నష్టదాయకంగా మారిందని చెప్పుకొస్తారు కొందరు. సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఎన్నో సినిమాలు.. నేడిలా నష్టాల బారిన పడుతున్నాయంటే అందుకు కారణం ఈ పైరసీ సైట్లే కాబట్టి.. వీటి నుంచి విముక్తి కోసం మార్గాలను అన్వేషించాలి. ఉదాహరణకు ఈ సైట్లలో సినిమా చూస్తే వాటి ద్వారా ఒక వైరస్ పాకి.. ఆయా ఫోన్లు, టీవీ సెట్లు చెడిపోయేలాంటి కొన్ని ఏర్పాట్లు చేయవచ్చు. ఈ మధ్య కాలంలో టెక్నాలజీ బాగా పెరిగింది. ఎథికల్ హ్యాకింగ్ వంటి కార్యకలాపాలు పెరిగాయి.. వీటి ద్వారా కూడా కట్టడి చేయవచ్చు. ఇలాంటి ఎన్నో అవకాశాలున్నా.. సినిమా వాళ్లు ఇవేవీ వాడుకోవాలనుకోకపోవడానికి కారణమేంటి? ఇప్పటికైనా మించి పోయింది లేదు.. యాంటీ పైరసీ సెల్ కి చెందిన మణీంద్ర అనే ఇతడు చేసిన ఈ ప్రయత్నం వల్ల కిరణ్ అనే ఒక పైరసీగాడు దొరికాడు. ఇతడి ద్వారా ఆ మొత్తం పైరసీ వ్యవహారం గుట్టు అయ్యింది. వీళ్లు క్రిఫ్టో కరెన్సీ రూపంలో ఎలాంటి నగదు లావాదేవీలు జరుపుతారో గుర్తించి.. తద్వారా ఈ మొత్తం పైరసీ ముఠా గుట్టు రట్టు చేయాలని కోరుకుందాం. సేవ్ టాలీవుడ్- సే నోటు పైరసీ అని నినదిద్దాం.
http://www.teluguone.com/news/content/how-to-stop-piracy-cinema-39-201242.html





