నార్సిసిస్టులు.. వీళ్లను గుర్తించడానికి ఇవే సరైన మార్గాలు..!

Publish Date:Dec 30, 2025

Advertisement

ప్రతి వ్యక్తి ఒక ప్రత్యేక వ్యక్తిత్వం కలిగి ఉంటారు.  వారి వ్యక్తిత్వానికి తగినట్టు వారు మాట్లాడుతుంటారు.  నచ్చినట్టే ఏ పని అయినా చేస్తుంటారు. అయితే సైకాలజీ ప్రకారం మనుషులను వివిధ వర్గాలుగా విభజిస్తారు.  వారిలో నార్సిసిస్టులు కూడా ముఖ్యమైనవారు.  నార్సిసిస్టులు చాలా ప్రమాదకరమైన వ్యక్తులు. బయటకు మేధావులలా కనిపిస్తుంటారు.  వారు తమ మాటలతో ఇతరులు తప్పు అని నిరూపిస్తుంటారు. వాటికి తగిన కారణాలను కూడా చెబుతూ ఉంటారు.  దీని వల్ల వారు గొప్ప వారు అని చాలా మంది అనుకుంటారు. కానీ నిజం ఏమిటంటే.. నార్సిసిస్టులు తమ తప్పు ఎప్పటికీ ఒప్పుకోరు.  తమ తప్పును ఒప్పుకోకూడదు కాబట్టి,  తాము చేసింది కరెక్ట్ అని నిరూపించేందుకు ప్రయత్నం చేస్తుంటారు. ఇందుకోసం ఎవ్వరినైనా దోషులుగా నిలబెట్టడానికి వెనుకాడరు. ఈ నార్సిసిస్టులు మన చుట్టూనే ఉంటారు.  కానీ వీరిని అంత సులువుగా గుర్తించలేం.  మనం నార్సిసిస్టులతో మాట్లాడుతున్నాం అని తెలుసుకోవడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి.  అవేంటో తెలుసుకుంటే..

తప్పుల తిరస్కారం..  

నార్సిసిస్టులు తమ తప్పులను ఎప్పుడూ ఒప్పుకోరు.  వారిని ఏదైనా విషయంలో గట్టిగా అరిచినట్లయితే, వారు వెంటనే ఎందుకంత రియాక్ట్ అవుతున్నావ్ ఇదేమంత పెద్ద విషయమని అంటారు, లేదంటే నేను అలా ప్రవర్తించలేదు, నాకు అలాంటి హ్యాబిట్ లేదు అని అంటారు. తమ తప్పులు బయట పడకుండా ఉండటం కోసం ఎదుటివారిని  తప్పుదారి పట్టించడానికి ప్రయత్నిస్తారు. నిజంగా  జరిగిన సంఘటనలను కూడా తిరస్కరిస్తారు. టోటల్ గా  గందరగోళానికి గురిచేసి ఎదుటి వ్యక్తి తమ మీద తాము అనుమానించుకునే స్థాయికి తెస్తారు.

ఎదుటి వ్యక్తిని కించపరచడం..

నార్సిసిస్టులు వారి తప్పులు లేదా వారి నిజాలు బయటపడినప్పుడు తమ తప్పు దాచుకోవడానికి  అవతలి వ్యక్తిపై దాడి చేస్తారు. తెలివి  లేని వ్యక్తులు గానూ,  డ్రామా ఆడే వారిగానూ ఎదుటి వ్యక్తులను నిందిస్తారు.  వారి వ్యక్తిత్వాన్నే కించపరిచి,  వారిని తక్కువ చేసి మాట్లాడతారు. సింపుల్ గా ఎదుటివారి  ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయడం ద్వారా  తమను తాము రక్షించుకోవడానికి ట్రై చేస్తారు. కేవలం ఇది మాత్రమే కాదు.. గతంలో జరిగిన తప్పులను ప్రస్తావిస్తూ అన్నింటిని కలిపి ఎదుటి వారిని తక్కువ చేయడానికి ప్రయత్నిస్తారు.

తామే బాధితులుగా..

నార్సిసిస్టులు తరచుగా తమను తాము బాధితులుగా చిత్రీకరించుకుని  వారు చేసిన తప్పుల నుండి అందరినీ దృష్టి మళ్లించడానికి ప్రయత్నిస్తారు. వారిని తప్పుగా అర్థం చేసుకున్నారని లేదా  వారి గురించి ఎదుటి వారే చెడుగా ప్రవర్తిస్తున్నారని  ఆరోపిస్తారు. దీని వల్ల వారి తప్పుల గురించి మాట్లాడటం మాని తాము తప్పు వ్యక్తులం కాదని నిరూపించుకోవడానికే ఎదుటి వ్యక్తులు ట్రై చేస్తారు. దీని వల్ల నార్సిసిస్టులు ఎదుటివారిని తప్పు చేసిన వ్యక్తులుగా నిలబెట్టి తాము తప్పించుకుంటారు.

తక్కువ చేసి మాట్లాడటం..

ఎదుటి వ్యక్తులు  విచారం లేదా కోపాన్ని నార్సిసిస్టుల ముందు వ్యక్తం చేస్తే వారు దాన్ని చాలా తక్కువ చేసి మాట్లాడతారు. చాలా ఓవర్ చేస్తున్నావ్ అనడం లేదా చాలా సెన్సిటివ్ అని చెప్పడం, ఇంత చిన్న  విషయానికి గొడవ చేయడం ఏంటి అని అనడం చేస్తారు. చివరికి తాము నిజంగా దైర్యం లేని వారిమేమో అని ఆలోచించే స్థాయికి వారు తీసుకొస్తారు. చివరికి తప్పు నాదేనేమో అని ఎదుటివారు అనుకునేలా చేస్తారు.

తప్పులు వారివి.. నిందలు ఎదుటివారికి..

నార్సిసిస్టులు  తమ తప్పులకు ఎదుటివారిని బాధ్యులుగా  చేస్తారు. తాము సొంతంగా చేసే తప్పులు, పనులకు ఎదుటివారిని నిందిస్తారు.  వారు అబద్ధం  చెప్పి ఎదుటివారిని  అబద్ధాలకోరు అని అంటారు. వారు మోసం చేస్తూ  ఎదుటి వారిని అనుమానిస్తారు.

ఎదుటి వారి బాధలు.. నార్సిసిస్టులకు జోకులు..

కొన్నిసార్లు ఎదుటివారికి బాధ  కలిగించే విషయాలను జోక్ లాగా మాట్లాడుతుంటారు. వారు మాట్లాడిన మాటలను ఎవరైనా ఖండిస్తే.. నేను జోక్ చేశాను దానికి కూడా ఇంత సీరియస్ అవ్వాలా అని తప్పించుకుంటారు.  

పైన చెప్పుకున్న లక్షణాలన్నీ నార్సిసిస్టులలో ఉంటాయి. నార్సిసిస్ట్‌తో వాదించడానికి ప్రయ త్నించడం తరచుగా వ్యర్థం.  ఎందుకంటే వారు ఏమి చేసినా తమను తాము సరైనవారని నిరూపించుకుంటారు. కాబట్టి అలాంటి వారితో బోర్డర్ లైన్ పెట్టుకోవాలి. వారితో ఎక్కువ డిస్కస్ చేయకూడదు.  వారిలో ఏ విషయాలలో విబేదించకూడదు.  ఏదైనా ఇబ్బంది లేదా సమస్య అనిపిస్తే మెల్లిగా తప్పించుకుని వారికి దూరం వెళ్లాలి. అంతేకానీ వారితో గెలవాలని అనుకుంటే  మానసికంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది.

By
en-us Political News

  
ప్రేమించిన వారిని వదిలి వేరొకరిని పెళ్లి చేసుకుంటున్నారా? మీ జీవితం మరియు మీ భాగస్వామి భవిష్యత్తు కోసం ఈ విషయాలు తప్పక తెలుసుకోండి...
ఈ రోజుల్లో చాలా మంది ఎదుర్కొంటున్న అతి పెద్ద ఆరోగ్య సమస్య హార్మోన్ల అసమతుల్యత (Hormonal Imbalance). మనం ఎంత ప్రయత్నించినా బరువు తగ్గకపోవడం, ఎప్పుడూ అలసటగా అనిపించడం, మానసిక ఒత్తిడి.. ఇవన్నీ మీ హార్మోన్లు పంపే సంకేతాలు కావచ్చు...
పుట్టిన తర్వాత పిల్లలు పెద్దగా అయినా.. వారు చదువులు పూర్తయ్యి,  పెళ్ళి చేసుకుని, వారు కూడా పిల్లలను కన్నా సరే.. తల్లిదండ్రులకు మాత్రం తమ పిల్లలు ఎంతవాళ్లైనా ఇంకా చిన్న పిల్లలు గానే అనిపిస్తూ ఉంటుంది...
జీవితంలో విజయం సాధించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ విజయం కొందరే సాధిస్తారు. దీనికి కారణాలు చాలా ఉంటాయి...
భారతీయుల ఇళ్లలో చాలా వరకు కరివేపాకు మొక్క పెంచుతూ ఉంటారు. ఇంటి బయట ఏ మాత్రం కాస్త స్థలం ఉన్నా సరే.. మొదటగా కరివేపాకు మొక్కనే పెంచుతూ ఉంటారు. కరివేపాకు మొక్క ఎదుగుదలకు కూడా భారతీయ...
వేసవి కాలం వచ్చిందంటే ప్రతి ఇంట్లో కూలర్ల దుమ్ము దులిపి వాడటానికి సిద్దం చేస్తుంటారు.  అయితే చాలా మంది ఇబ్బంది పడే సమస్య కూలర్ నుండి దుర్వాసన రావడం.  కూలర్ ను శుభ్రం చేసి వాడటానికి సిద్దం చేసినా సరే..
భారతీయుల ఆహారంలో బెల్లం ప్రధాన పదార్థం. తీపి పదార్థాల తయారీ నుండి కూరలలో కూడా రుచి కోసం బెల్లం వాడుతూ ఉంటారు.  అయితే వేసవి కాలంలో బెల్లం విషయంలో పెద్ద సమస్య ఎదురవుతుంది....
ఒక్కసారి ఆలోచించండి.. ఉదయం నిద్రలేవగానే మీరు చూసే మొదటి ముఖం ఎవరిది? మీ భాగస్వామిదా లేక మీ మొబైల్ ఫోన్ స్క్రీనా? ఒకప్పుడు పక్కపక్కనే కూర్చుని మనసు విప్పి మాట్లాడుకునే వాళ్ళం..
నేటి కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యలలో ‘ఫ్రోజెన్ షోల్డర్’ (Frozen Shoulder) ఒకటి. వైద్య పరిభాషలో ‘అడెసివ్ క్యాప్సులైటిస్’ అని పిలిచే ఈ సమస్య వల్ల భుజం కీలు బిగుసుకుపోయి
ప్రేమ ఒక అందమైన భావన, కానీ చాలా మందికి ఇది పదే పదే బాధ కలిగిస్తూ ఉంటుంది. ప్రేమ మొదట్లో అద్బుతంగా ఉంటుంది..
వేసవి కాలం వచ్చిందంటే చాలు..  ప్రతి ఇంట్లో చల్లదనం కోసం ఫ్యాన్లతో పాటు కూలర్ల వాడకం  పెరుగుతుంది. ఉష్ణోగ్రతలు పెరిగేకొద్దీ, కూలర్లు  తప్పనిసరి అవుతాయి.  రోజంతా కూలర్లు పనిచేస్తూనే ఉంటాయి...
వేసవి కాలం వచ్చిందంచే సాధారణ టేబుల్ ఫ్యాన్ లు,  సీలింగ్ ఫ్యాన్ లు సరిపోవు.  వీటి నుండి వచ్చే గాలి వేసవి వేడిని కంట్రోల్ చేయలేవు. పైగా వేసవి వేడి గాలిని తిప్పి, తిప్పి గది మొత్తం వేడిగా మార్చేస్తాయి...
పెళ్లి... ఎన్నో రొమాంటిక్ ఆలోచనలను గుర్తుకు తెచ్చే ఒక అందమైన పదం. బయటకు వెళ్లడం, లాంగ్ డ్రైవ్‌లకు వెళ్లడం..
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.