వేసవిలో కరివేపాకు మొక్క వాడిపోతోందా? ఈ ఒక్కటి వేస్తే చాలు.. మొక్క ఏపుగా పెరుగుతుంది..!
Publish Date:May 4, 2026
Advertisement
మజ్జిగ.. భారతీయుల చాలా ఇళ్లలో కరివేపాకు మొక్క ఉన్నట్టే.. వేసవి కాలంలో ప్రతి ఇంట్లో పెరుగు, మజ్జిగ ఖచ్చితంగా ఉంటుంది. కలివేపాకు మొక్కకు మజ్జిగను ఉపయోగించడం వల్ల వాడిన మొక్క తిరిగి తాజాగా మారడమే కాకుండా మొక్క ఆరోగ్యంగా కూడా పెరుగుతుంది. మజ్జిగ ఎందుకు సహాయపడుతుంది? కరివేపాకు మొక్కల పెరుగుదలకు ఆమ్ల నేల అవసరం. మజ్జిగలో ఆమ్లం ఉంటుంది. కరివేపాకు మొక్క పాదులో మజ్జిగను పోసినప్పుడు నేల pH స్థాయి సమతుల్యంగా ఉంటుంది, ఇది మొక్క నేల నుండి పోషకాలను గ్రహించడానికి వీలు కల్పిస్తుంది. నత్రజని ఇస్తుంది.. కరివేపాకు పచ్చగా, దట్టంగా ఉండటానికి నత్రజని చాలా అవసరం. మజ్జిగలో కూడా నత్రజని ఉంటుంది, ఇది మొక్కల పెరుగుదలకు ఎంతో మేలు చేస్తుంది. మజ్జిగలోని పోషకాలు ఆకులను మరింత ముదురుగా, పచ్చగా మారడానికి సహాయపడతాయి. మజ్జిగను వాడటం కొత్త చిగుళ్ల పెరుగుదలను ప్రేరేపిస్తుంది. కీటకాల నుండి రక్షణ.. కరివేపాకు మొక్కలకు తరచుగా తెల్లటి బూజు లేదా కీటకాలు పడతాయి. మజ్జిగ ఒక సహజ శిలీంధ్రనాశకం. దానిలో ఉండే లాక్టిక్ ఆమ్లం ఈ బ్యాక్టీరియా , శిలీంధ్రాలను చంపి, మొక్క పెరగడానికి సహాయపడుతుంది. పోషకాలు.. మజ్జిగలో కాల్షియం మాత్రమే కాకుండా ఫాస్ఫరస్ , ప్రోబయోటిక్ బ్యాక్టీరియా కూడా ఉంటాయి. ఈ బ్యాక్టీరియా నేలను సారవంతం చేస్తుంది. కరివేపాకు మొక్కలు బాగా ఏపుగా పెరగడానికి మజ్జిగను ఉపయోగించవచ్చు. *రూపశ్రీ.
భారతీయుల ఇళ్లలో చాలా వరకు కరివేపాకు మొక్క పెంచుతూ ఉంటారు. ఇంటి బయట ఏ మాత్రం కాస్త స్థలం ఉన్నా సరే.. మొదటగా కరివేపాకు మొక్కనే పెంచుతూ ఉంటారు. కరివేపాకు మొక్క ఎదుగుదలకు కూడా భారతీయ వాతావరణం చాలా చక్కగా సహకరిస్తుంది. అయితే వేసవి కాలం మాత్రం కరివేపాకు మొక్కలకు కష్టకాలం అని చెప్పవచ్చు. వేసవిలో ఉండే తీవ్రమైన ఎండ కారణంగా కరివేపాకు మొక్క బాగా వాడిపోవడం, ఎదుగుదల మందగించడం జరుగుతుంది. అయితే మొక్క తిరిగి తాజాగా మారాలన్నా, ఆరోగ్యంగా పెరగాలన్నా కేవలం నీరు పోస్తే సరిపోదు. ఇందుకోసం ఇంట్లోనే ఉండే ఒక పానీయం చక్కగా సహాయపడుతుంది. అదేంటో తెలుసుకుంటే..
http://www.teluguone.com/news/content/how-to-keep-curry-leaf-plant-fresh-in-summer-35-218933.html




