లవ్ బ్రేకప్ తర్వాత బాధ నుండి బయటపడే మార్గాలు తెలుసుకోండి..!

Publish Date:Oct 3, 2025

Advertisement

 

ప్రేమ.. రెండక్షరాల పదం.. రెండు మనసుల కలయిక.  అయితే మనసులు కలిసినట్టు మనుషులు ఉండలేరు. మనుషుల పంథా వేరు.. మనసుల పంథా వేరు.. మనసు కావాలని అడిగింది మనిషికి కష్టంగా అనిపించవచ్చు. మనసు బాగుందని చెప్పింది.. మనిషికి బాలేదు అనిపించవచ్చు.  ముఖ్యంగా ఇద్దరు వేర్వేరు మనుషులు ప్రేమ మొదలైనప్పుడు అన్నింటిని పక్కన పెట్టేస్తారు.. కానీ ఇద్దరూ ఒకరికొకరు అలవాటు అయిపోయాక.. ఇద్దరిలో తప్పులు,  లోపాలు,  సమస్యలు అన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తాయి. ఈ కారణాల వల్ల జరిగేదే బ్రేకప్..

 లవ్ బ్రేకప్ ఈ కాలంలో చాలా సాధారణం అయిపోయింది. కానీ అది ప్రతి మనిషికి చెప్పలేనంత బాధను పరిచయం చేస్తుంది. ప్రేమలో మోసపోవడం లేదా ప్రేమ వైఫల్యం.. వీటి వల్ల మనసు అనుభవించే నరకం అంతా ఇంతా కాదు.. కొందరైతే రోజులు, నెలలు, ఏళ్లకేళ్లుగా బాధలో మునిగిపోయి జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉంటారు. భవిష్యత్తు అంటూ ఏమీ లేకుండా చేసుకుంటారు.  ప్రేమలో వైఫల్యం ఎదురైనా,  ప్రేమలో మోసపోయినా దాన్నుండి బయటకు రావాలి.  అప్పుడే భవిష్యత్తు ఆశాజనకంగా కనిపిస్తుంది. ఇందుకోసం ఏం చేయాలో తెలుసుకుంటే..

అంగీకారం..

ప్రేమలో మోసపోయినప్పుడు లేదా ప్రేమలో వైఫల్యం ఎదురైనప్పుడు కోపం , విచారం,నిరాశ వంటి భావోద్వేగాలు సహజం. వాటిని అణచివేయడానికి ప్రయత్నించే బదులు, వాటిని అంగీకరించడం నేర్చుకోవాలి.  ఏడుపు వస్తే  ఏడవడం, మనసులో ఏం అనిపిస్తే అది రాసుకోవడం లేదా నమ్మకమైన స్నేహితులతో మాట్లాడటం వల్ల  తేలికగా అనిపించవచ్చు. మనసులోని బరువు తగ్గడం వల్ల ప్రేమ చేసిన గాయం నుండి కోలుకోవడం కాస్త సులువు అవుతుంది.

సమయం..

ప్రేమలో వైఫల్యం ఎదురవడం లేదా మోసపోవడం వంటివి జరిగినప్పుడు దాన్నుండి బయట పడటానికి సమయం పడుతుంది.  అంతేకాదు.. దీన్నుండి బయట పడాలంటే తమకు తాము సమయం కేటాయించుకోవాలి. సెల్ఫ్ కేర్ తీసుకోవాలి. జరిగిన బాధాకర సంఘటన నుండి బయట పడటానికి చాలామంది కొత్త స్నేహం, కొత్త పరిచయం, కొత్త ప్రేమ ఎంచుకుంటారు. అయితే ఇది చాలా తప్పు. లవ్ బ్రేకప్ నుండి కలిగే బాధను అధిగమించడానకి తన మీద తాను దృష్టి పెట్టి తనను తాను డవలప్ చేసుకోవడం చాలా మంచి మార్గం.  అనుకున్న లక్ష్యాలు,  కన్న కలలు,  అభిరుచులు, ఆసక్తులు.. ఇలా.. అన్నింటిని నిజం చేసుకునే దిశగా ప్రయత్నాలు చేయాలి. దీని వల్ల రెండు లాభాలు ఉంటాయి.  ఒకటి ప్రేమ గాయాన్ని మరచిపోవచ్చు.. రెండవది అనుకున్న లక్ష్యాలు,  కలలు నేరవేర్చుకోవడం వల్ల  మనోధైర్యం పెరుగుతుంది.  జీవితంలో ఏదైనా సాధించగలం అనే నమ్మకం పోగవుతుంది.

సోషల్ మీడియాకు దూరం..

సోషల్ మీడియా చాలా వరకు దూరమైన ప్రియురాలిని లేదా ప్రియుడిని గుర్తు చేస్తూ ఉంటుంది. లవ్ బ్రేకప్ నుండి బయట పడాలంటే దానికి  సోషల్ మీడియా నుండి కొంతకాలం విరామం తీసుకోవడం మంచి మార్గం. డిజిటల్ మీడియాకు ఎంత దూరం ఉంటే అంత మంచిది.  ఇది  మనస్సును క్లియర్ చేసుకోవడానికి , మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవడానికి మీకు అవకాశాన్ని ఇస్తుంది.

సెల్ఫ్ లవ్..

ప్రేమలో  మోసపోయినప్పుడు చాలామంది చేసే పని తమను తాము  నిందించుకోవడం.  కానీ వేరొకరి తప్పుడు నిర్ణయం వల్ల జరిగిన సంఘటనకు తమ విలువను తాము ఎప్పుడూ తగ్గించుకోకూడదు.  ఎదుటి వారు చేసిన తప్పు వల్ల తమ విలువ తగ్గదని కూడా గుర్తుంచుకోవాలి.  తనను తాను ప్రేమించుకోవడం, తన బలాలను గుర్తించడం, తనను తాను
మెచ్చుకోవడం, తన గెలుపులను గుర్తు చేసుకోవడం.. ఇవన్నీ కూడా తన మీద తనకు ప్రేమ పెరిగేలా చేస్తాయి.

కొత్త ప్రారంభాలు..

పైన చెప్పుకున్నట్టు అన్నీ పాటిస్తూ ఉంటే.. కాలక్రమేణా బాధ తగ్గడం ప్రారంభమవుతుంది. ఎప్పుడైతే బాధ తగ్గుతుందో.. అప్పుడు కొత్తగా జీవితాన్ని ప్రారంభించాలి.  ఆ ప్రారంభానికి సిద్ధం కావాలి.కొత్త స్నేహితులను ఎంచుకోవడం, కొత్త కార్యకలాపాల్లో పాల్గొనడం. జీవితంలోని చిన్న చిన్న ఆనందాలను ఎంజాయ్ చేయడం,  జీవితంలో మరింత ఎదగడానకి ప్రణాళికలు వేసుకోవడం, ఎప్పుడూ నేర్చుకోవడానికి ప్రయత్నించడం.. ఇవన్నీ ఉంటే..  కొత్త ప్రారంభాలు  కొత్త అనుభవాలను , ఆనందాన్ని తెస్తాయి.

                            *రూపశ్రీ.

By
en-us Political News

  
కొత్త వస్తువులు కొంటేనే చాలామంది చాలా సంతోషంగా ఉంటారు.  ఇక మహిళలు అయితే వంటింటి వస్తువుల నుండి వారు కొనుగోలు చేసే వస్తువు పట్ల చాలా ఇష్టంతో ఉంటారు.  కానీ కొత్త వస్తువుల లుక్ పాడు చేసే వాటిలో వాటి మీద ఉండే స్టిక్కర్లు ప్రధానంగా ఉంటాయి...
పవిత్ర రంజాన్ మాసం ప్రారంభానికి గుర్తుగా బుధవారం దేశంలో రంజాన్ చంద్రుడు కనిపించాడు. అంతకుముందు సౌదీ అరేబియాలో ఫిబ్రవరి 17న చంద్రుడు కనిపించాడు.  ఫిబ్రవరి 18న అక్కడ రంజాన్ ఉపవాసం ప్రారంభానికి గుర్తుగా చంద్రుడు కనిపించాడు...
ప్రతి వ్యక్తి జీవితం గురించి చాలా ఆలోచిస్తారు.  తమ జీవితం ఎలా ఉండాలో,  ఎలా ఉంటే బాగుంటుందో అని చాలా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు.  సరిగ్గా గమనిస్తే.. కొందరు నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది అని అంటూ ఉంటారు...
తల్లిదండ్రులు పిల్లలు ఎంత పెద్దైనా వారు చిన్నవారిగానే కనిపిస్తారు అని  అంటుంటారు.  కానీ ఈ రోజుల్లో తల్లిదండ్రులు,  పిల్లల మధ్య గొడవలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. దీనికి   అతిపెద్ద కారణం  చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు..
ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు  అన్ని ఆనందాలను పొందాలని,  జీవితంలో విజయం సాధించాలని కోరుకుంటారు. తమ పిల్లలు తమలాగా కష్టాలను పడకూడదని అనుకుంటారు.  అందుకే నేటికాలంలో మేము కష్టాలు...
డబ్బు మనిషి జీవితానికి చాలా అవసరం.  డబ్బు లేని జీవనం దుర్బరంగా ఉంటుంది. ముఖ్యంగా డబ్బు విషయంలో పేద వారు మరీ అంత ఇబ్బందులలో ఉండరు...
వాలెంటైన్స్ డే ప్రతి ఏడాది ఫిబ్రవరి 14వ తేదీన జరుపుకుంటారని అందకీ తెలిసిందే. అయితే ఫిబ్రవరి 14కు ముందు వారం రోజుల నుండే వాలెంటైన్  హడావిడి మొదలవుతుంది.  వారం రోజుల పాటు ఒక్కొక్క రోజు ఒక ప్రత్యేక దినంగా పరిగణిస్తూ..
నేటికాలంలో మనిషి కష్టపడి డబ్బు సంపాదించేది ధనవంతుడు కావడానికే. ఎందుకంటే ధనవంతుడిగా ఉంటే చాలా రకాల సమస్యలు దూరం అవుతాయి.  కానీ చాలామంది ఆర్థికంగా ఎదగలేరు...
రవాణా ప్రజల జీవితాలలో ఎంతో ముఖ్యమైనది. రోడ్డు రవాణా చాలా సహజంగా అందరికీ తెలిసేది,  కనిపించేది. కానీ  వాయు రవాణా, జల రవాణా ప్రజల నివాసాలకు దూరంగా జరుగుతుంది. మరీ ముఖ్యంగా వేల సంవత్సరాల..
ఏదైనా సంబంధానికి పునాది నిజాయితీపై ఆధారపడి ఉంటుందని చాలామంది చెబుతారు.  భాగస్వామి నుండి ఏదీ దాచకుండా ఉండటం, ప్రతిదీ పారదర్శకంగా ఉండాలి అని అనడం చూస్తుంటాం.  భాగస్వామితో ప్రతి చిన్న విషయాన్ని..
ఫిబ్రవరి అంటేనే వాలెంటైన్స్ డే గుర్తుకు వస్తుంది. మనసులోనే తమ ప్రేమను దాచుకున్న ఎందరో ప్రేమికులు తమ మనసు విప్పే సమయమిది.  అయితే చాలా మంది తమ ప్రేమను వ్యక్తం చేయడానికి ఏదో ఒక బహుమతి కొని ఆ బహుమతి...
స్వాతంత్య్రానికి పూర్వం బ్రిటీషు పాలనలో భారతీయుల పరిస్థితి ఎంతో ధీనంగా ఉండేది. భారత పౌరులు అందరూ బ్రిటీషర్లకు బానిసలుగా మారారు.  కానీ భారతదేశంలో ఎందరో వీరులు ఈ బానిసత్వం నుండి దేశానికి విముక్తి కలిగించాలని...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.