ఈ చిట్కాలతో చాలా ఈజీగా గట్ ను శుభ్రం చేసుకోవచ్చు..!
Publish Date:Sep 18, 2025
Advertisement
ఆరోగ్యకరమైన స్నాక్స్ తింటే ఏమవుతుంది.. ఆరోగ్యం క్షీణించడానికి అతిపెద్ద కారణం అనారోగ్యకరమైన చిరుతిళ్లు. ఆకలిని తీర్చుకోవడానికి వాటిని తింటాము . ప్యాక్డ్ ఫుడ్, మార్కెట్ స్నాక్స్‌లో కేలరీలు, ప్రిజర్వేటివ్‌లు, కృత్రిమ రంగులు ఉంటాయి. ఇవి పోషకాహార పరంగా సున్నా. అవి జీర్ణక్రియను, ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా సంఖ్యను తగ్గిస్తాయి. పేగు ఆరోగ్యాన్నిమెరుగుపరిచే స్నాక్స్ గురించి తెలుసుకుంటే.. వేయించిన శనగలు.. గ్రీకు పెరుగు + బెర్రీలు.. వేయించిన మఖానా.. ఆపిల్ + పీనట్ బటర్ .. మిక్స్డ్ సీడ్స్ + గుమ్మడికాయ గింజలు కూరగాయలు.. ఉండికించినవి.. పచ్చిగా తినదగినవి. డార్క్ చాక్లెట్ (70%+).. మొలకెత్తిన పెసలు. మజ్జిగ.. ముఖ్యంగా మూడు ఆహారాలు పేగు ఆరోగ్యానికి చాలా దృఢంగా ఉంచుతాయి. మజ్జిగ.. పెరుగు నుండి వెన్నను తొలగించడం ద్వారా మజ్జిగ తయారు చేస్తారు. ఇది జీర్ణం కావడానికి తేలికగా ఉంటుంది. ప్రోబయోటిక్స్‌తో నిండి ఉంటుంది. ప్రతి రోజూ తాజా మజ్జిగను తీసుకోవడం వల్ల ఆరోగ్యకరమైన బాక్టీరియా పెరుగుతుంది. డార్క్ చాక్లెట్.. డార్క్ చాక్లెట్ తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థకు మేలు జరుగుతుంది. చాలా పరిశోధనలు దీనిని తినడం వల్ల మానసిక స్థితి మెరుగుపడుతుందని, ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుందని చెబుతున్నాయి. రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది. పోషకాలు గ్రహించబడతాయి. వేయించిన శనగలు.. వేయించిన శనగలు తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి . అన్నింటిలో మొదటిది.. ప్రోటీన్, ఫైబర్, ఐరన్ లభిస్తాయి. ఫైబర్ గట్ బాక్టీరియాను మెరుగుపరుస్తుంది. ప్రోటీన్ ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంచుతుంది. *రూపశ్రీ.
ఆయుర్వేదం నుండి ఆధునిక శాస్త్రం వరకు పేగు ఆరోగ్యం చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. మనిషి శరీరంలో వచ్చే చాలా వ్యాధులకు మార్గం ఇక్కడే మొదలవుతుంది. పేగు మురికిగా ఉంటే.. క్రమంగా కొవ్వు, చక్కెర, విషపదార్థాలు పెరుగుతాయి. ఇది వందలాది వ్యాధులకు కారణమవుతుంది. పేగు ఆరోగ్యానికి ఉత్తమమైన 10 ఆహారాలు ఉన్నాయి. వీటిని స్నాక్‌గా తినవచ్చు. ఇవి కడుపు, ప్రేగులను సరిగ్గా శుభ్రపరచడంలో, ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాను పెంచడంలో, జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి.
http://www.teluguone.com/news/content/how-to-clean-your-stomach-and-intestines-naturally-34-206387.html





