Publish Date:Dec 30, 2024
ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో కేటీఆర్ కు ఉచ్చు బిగిసింది. ఆయన అరెస్టు కావడం అనివార్యంగా కనిపిస్తోంది. కేటీఆర్ అరెస్టైతే పరిస్ధితి ఏమిటి? అందరూ అనుకుంటున్నట్లుగా హరీష్ ఇక పార్టీపై పూర్తి పెత్తనం తీసుకుంటారా? లేక దాదాపు రాజకీయ సన్యాసం తీసుకున్నట్లుగా కనిపిస్తున్న పార్టీ అధినేత కేసీఆర్ మళ్లీ యాక్టివ్ అవుతారా? లేక.. ఇటీవలి కాలంలో కొద్దిగా చురుకుగా కనిపిస్తున్న కవిత పార్టీపై పట్టు సాధిస్తారా? అన్న ప్రశ్నలు తెలంగాణ రాజకీయాలలో గట్టిగా వినిపిస్తున్నాయి.
అయితే దానిని పక్కన పెడితే ఆర్‌బిఐ నిబంధనలను ఉల్లంఘించి ఫార్ములా-ఇ రేసింగ్ కోసం చెల్లింపులు జరిపిన కేసులో విచారణకు హాజరు కావాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) మాజీ మంత్రి కె. తారక రామారావుకు సమన్లు జారీ చేసింది. బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జనవరి 7న విచారణకు హాజరుకావాల్సి ఉంటుంది. ఇంతలో, కెటిఆర్ క్వాష్ పిటిషన్ హైకోర్టులో పెండింగ్‌లో ఉంది. దాని కంటే ముందు అంటే మంగళవారం (డిసెంబర్ 31)తో కేటీఆర్ కు కోర్టు ఇచ్చిన అరెస్టు నుంచి మినహాయింపు ముగుస్తుంది. కోర్టు కేటీఆర్ పై కేసును క్వాష్ చేయకుంటే ఏసీబీ ఆయనను అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయి. అదే జరిగితే రాష్ట్రం అట్టుడికిపోతుందా? ఆందోళనలు మిన్నంటే అవకాశం ఉందా? క్వాష్ కేసులో చంద్రబాబును అప్పటి జగన్ సర్కార్ అక్రమంగా అరెస్టు చేసినప్పుడు ఉవ్వెత్తున ఎగసిన ప్రజాగ్రహంలా కేటీఆర్ ను అరెస్టు చేస్తే కూడా ప్రజలు స్పందిస్తారా? అన్న ప్రశ్నలు గట్టిగా వినిపిస్తున్నాయి. కెటిఆర్ విషయంలో ప్రజల నుంచి ఆ స్థాయిలో స్పందన వచ్చే అవకాశం లేదన్న భావనే పరిశీలకుల నుంచి వ్యక్తం అవుతోంది.
కేటీఆర్ ఈ ఫార్ములా రేస్ విషయంలో సొమ్ముల బదలాయింపుతో తనకు సంబంధం లేదని టెక్నికల్ అంశాలను తెరపైకి తీసుకువచ్చి అధికారులను బలిపశువులను చేసైనా తాను బయటపడాలని భావిస్తున్నారు. అంతే తప్ప అక్రమంగా సొమ్ముల బదలాయింపు జరగలేదని చెప్పడం లేదు. అన్నిటికీ మించి తాను అరెస్టు కావడం ఖాయమన్న భావనలో ఆయన ఉన్నట్లు ఆయన మాటలను బట్టి అవగతమౌతున్నది. దీంతో ఆయన ప్రజల సానుభూతి కోసం వెంపర్లాడుతున్నారు. అయితే చంద్రబాబు విషయంలో జరిగింది వేరు. ఆయనను అన్ని నిబంధనలనూ తుంగలోకి తొక్కి కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా అర్థరాత్రి అరెస్టు చేశారు. అరెస్టుకు కారణాలు కూడా చూపలేదు. అరెస్టు చేసిన తరువాత స్కిల్ కేసులో ఆయన పేరు చార్జిషీట్ లో పెట్టారు. అన్నిటికీ మించి చంద్రబాబు స్కిల్ విషయంలో ఎలాంటి తప్పూ జరగలేదన్న వాదనకే నిలబడ్డారు. అయితే కేసీఆర్ తప్పు జరగలేదని గట్టిగా చెప్పడం లేదు. తప్పు జరిగిందనీ, అయితే ఆ తప్పుకు తాను బాధ్యుడిని కాననీ చెప్పుకుంటున్నారు.
ఇక్కడ గతంలో కవితను ఈడీ అరెస్టు చేసినప్పుడు కూడా ప్రజల నుంచే కాదు, పార్టీ కార్యకర్తల నుంచి కూడా పెద్దగా స్పందన రాలేదన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి. ఆమె అరెస్టు కూడా అనూహ్యంగా ప్రాపర్ విచారణ లేకుండా జరగలేదు. నోటీసులు ఇచ్చారు. పలు మార్లు విచారించారు. ఇప్పుడు కేటీఆర్ విషయంలో కూడా అదే జరుగుతోంది. ఏసీబీ, ఈడీలు ఆయనకు నోటీసులు ఇచ్చాయి. సోమ్ము అక్రమ తరలింపునకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయి. దీంతో ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో అవకతవకలు జరిగాయన్న భావన ప్రజలలో వ్యక్తం అవుతున్నది. దీంతో కేటీఆర్ అరెస్టు విషయంలో నిరసనలు వ్యక్తమైనా అవి శాంతి భద్రతలకు విఘాతం కలిగించేంత స్థాయిలో ఉండే అవకాశం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/how-telangana-react-if-ktr-arrest-25-190510.html
టీవీకే అధినేత విజయ్‌కు కాంగ్రెస్ మద్దతు తెలపడంపై ఆగ్రహంగా ఉన్న డీఎంకే.. కాంగ్రెస్‌కు కటీఫ్ చెప్పేసింది. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, లోక్‌సభలో తమ పార్టీ సభ్యులకు కాంగ్రెస్ ఎంపీలతో కాకుండా విడిగా సీటింగ్ కేటాయించాలని డీఎంకే ఎంపీ కనిమొళి స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
తాజా సమాచారం ప్రకారం.. విజయ్ తన పార్టీకి ఉన్న బలానికి తోడుగా మరో మూడు పార్టీల మద్దతును కూడగట్టుకున్నారు. ఆ పార్టీల మద్దతుతో అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118ని ఆయన సాధించారు.
తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవ్వగా.. మెజారిటీ నిరూపణ విషయంలో రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కచ్చితమైన నిబంధనలు పాటించాలని పట్టుబడుతున్నారు. విజయ్ కు తన పార్టీ ఎమ్మెల్యేలు 107 మందికి అదనంగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది.
పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనకు ముందే తెలుసని, నాయకత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు. అయితే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి.. క్షేత్రస్థాయిలో కేడర్‌ను కాపాడుకుంటూ వచ్చిన తనకు ఈ పరిణామం మనస్తాపానికి గురిచేసిందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు.
బాబు కూటమిని ఎందుకంత విలువైనదిగా భావిస్తున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూటమి ఎప్పుడెప్పుడు చీలిపోతుందాని కాచుకుని కూర్చుని ఉంది. ఏ అవకాశం వచ్చినా వారు వదిలిపెట్టినట్టే కనిపించదు. మొన్న కోట వినుత ఘటన, నిన్న అరవ శ్రీధర్ వ్యవహారం, ఇవాళ వర్మ ఇష్యూ.. ఇలా సమయం దొరికినపుడల్లా ఆయా అంశాలను బాగా హైలెట్ చేసి.. కూటమిలో ఏదో ఒక చిచ్చు రాజేయాలని చూస్తోంది వైసీపీ అధినాయకత్వం.
అతి కొద్ది మంది నేతలు జగన్ ప్రకటనను సమర్దిస్తూ.. అనుకూల ప్రకటనలు చేస్తుండగా.. మెజారిటీ లీడర్, క్యాడర్ మాత్రం జగన్ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
టీవీకే అధినేత విజయ్‌తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్‌కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్రబాబు ఫొటోలేదని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వర్మ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జనసేన నేత, మాజీ ఎమ్మెల్యే దొరబాబు జోక్యం చేసుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వర్మ దురుసు వ్యాఖ్యలపై పార్టీలో అంతర్గతంగా చర్చించిన అధిష్టానం.. వర్మ వ్యవహారాన్ని తప్పుబట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్‌కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్‌తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్‌కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.