ఇంతకీ పవన్, బీజేపీల బంధం బలమైనదేనా?

Publish Date:Jul 22, 2022

Advertisement

పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీతో బీజేపీ మైత్రి లవ్ అండ్ హేట్ చందంగా కొనసాగుతోంది. ప్రసిద్ధ కథా రచయత శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్ర కథ యావజ్జీవం హోష్యామీలో నిత్యం గొడవపడుతూ కలిసి జీవించే దంపతుల్లా జనసేన, బీజేపీ మైత్రి కొనసాగుతోంది. ఏపీలో ఎన్నికల హీట్ పెరుగుతున్న కొద్దీ ఈ రెండు పార్టీల మధ్యా మైత్రి రంగులు మార్చుకుంటోంది. తగవులు పడుతోంది.. కలిసి సాగుదాం అంటోంది. ముఖ్యమంత్రి అభ్యర్థిగా తనను అంగీకరించాలని బీజేపీతో మైత్రికి జనసేనాని షరతు పెడితే.. మా పార్టీ ఎవరినీ భుజాన మోయదని బీజేపీ బెట్టు చేస్తున్నది.

ప్రధాని నరేంద్రమోడీ హాజరైన భీమవరం సభకు జనసేనానిని నువ్వు రావద్దుసుమా అని నోటితో చెబుతూ సభకు రావాలంటూ ఓ ఆహ్వానం పడేసింది బీజేపీ.. అలిగిన జనసేనాని ఆ సభకు దూరంగా ఉండిపోయారు.  ఆ తరువాత మేం ఆహ్వానించాం మీరే రాలేదంటూ బీజేపీ సన్నాయి నొక్కులు నొక్కితే.. వద్దామనే అనుకున్నా, కానీ స్థానిక ఎంపీని ఆహ్వానించకుండా నన్న ఆహ్వానించడం, నేను రావడం మర్యాద కాదని దూరంగా ఉన్నానని జనసేనాని వివరణ ఇచ్చారు. సరే అది ముగిసిన కథ.. ఇప్పుడు మళ్లీ ఈ ఆహ్వానం కథే మరో చోట మరోలా ఆరంభమైంది.  ఆ కథేమిటంటే  పదవీ విరమణ చేయనున్న రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు శుక్రవారం (జులై 23) కేంద్రం పవన్ కల్యాణ్ ను ప్రత్యేకంగా ఆహ్వానించింది. వాస్తవానికి ఈ కార్యక్రమానికి ప్రొటో కాల్ ప్రకారం పవన్ ను ఆహ్వానించాల్సిన అవసరం లేదు. ఉప రాష్ట్రపతి, సుప్రీం కోర్టు న్యాయమూర్తులు, కేంద్ర మంత్రులు, రాష్ట్రాల సీఎంలు మాత్రమే ఆహ్వానితుల జాబితాలో ఉంటారు. అయినా కూడా పెద్ద మనసు చేసుకుని ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు జనసేనాని పవన్ కల్యాణ్ కు ప్రత్యేకంగా ఆహ్వానించి తప్పని సరిగా రావాలని కోరారు.

దీనిని బట్టి పవన్ ను బీజేపీ దూరం పెట్టే ప్రశక్తే లేదనీ, వచ్చే ఎన్నికలలో రెండు పార్టీలూ కలిసే పోటీ చేస్తాయని విశ్లేషణలు వెల్లువెత్తాయి. అయితే తనకు ఆహ్వానం వచ్చిందని ధృవీకరించిన పవన్ కల్యాణ్ ఆ ఆహ్వానాన్ని అనివార్య కారణాల వల్ల మన్నించలేకపోతున్నానని చెప్పేశారు. ఆరోగ్యం బాలేదనీ, అందుకే వెళ్లడం లేదనీ చెబుతూ, పనిలో పనిగా రామ్ నాథ్ కోవింద్ రాష్ట్రపతిగా తన పదవీ కాలంలో క్రియాశీలంగా వ్యవహరించారనీ, పదవికి వన్నెతెచ్చారని ప్రశంసించేశారు. అయితే ఇంతకీ మోడీ స్వయంగా ఆహ్వానించినా పవన్ ఎందుకు స్పందించడం లేదు అన్న సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. వాస్తవానికి బీజేపీ, జనసేన మధ్య మూడేళ్లుగా మైత్రి కొనసాగుతున్నా.. ఈ మూడేళ్లలో కేవలం ఒక్కటంటే ఒక్క సారి మాత్రమే పవన్ కల్యాణ్ మోడీతో భేటీ అయ్యారు.

ఈ మధ్య కాలంలో పలు మార్లు మోడీతో భేటీ అవకాశం కలిగినా, స్వయంగా మోడీయే పిలిచినా పవన్ కల్యాణ్ ఆయనను కలిసే యత్నం చేయలేదు.   విశాఖ స్టీలు ప్లాంట్ ఇష్యూలో పవన్ నేరుగా హోం మంత్రి అమిత్ షానే కలిశారు. స్టీల్ ప్లాంట్ స్థితిగతులపై చర్చించారు. పలు సందర్భాల్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాను కూడా కలిశారు. కానీ ఇంతవరకూ ప్రధాని మోదీని మాత్రం కలవలేదు.  ఏపీలో టీడీపీ, జనసేన మధ్య పొత్తులు చిగురిస్తున్నట్టు వస్తున్న వార్తల వేళ.. పవన్ రామ్ నాథ్ కోవింద్ వీడ్కోలు సభకు గైర్హాజర్ కావాలని తీసుకున్న నిర్ణయం పలు సందేహాలకు తావిస్తున్నది. ఒక వైపు బీజేపీ  2024 ఎన్నికల్లో జనసేనతో కలిసి పోటీచేస్తామని   గంటా పథంగా చెబుతూ వస్తోంది.

అయితే పవన్ మాత్రం మరో ఉద్దేశంలో ఉన్నట్లు తన మాటలు, చేతల ద్వారా స్పష్ఠంగానే తెలియజేస్తున్నారు.   గత రెండు సార్లు తాను తగ్గానని.. ఇక   తనకు ఈసారి అవకాశాన్ని వదిలేయాలని ఆయన సూటిగా కాకపోయినా పరోక్షంగానైనా బీజేపీకి తెలియజేశారు. అదే సమయంలో తెలుగుదేశానికి అన్యాపదేశంగా అదే సూచన చేశారు. దీంతో జనసేనతో పొత్తు అన్న విషయంలో తెలుగుదేశం ఆచి తూచి అడుగేస్తోంది. పొత్తు ఉంటుందని కానీ ఉండదని కానీ చెప్పడం లేదు. అయినా  మహానాడు తరువాత ఆ పార్టీలో స్పష్టమైన మార్పు కనిపించింది. పవన్ ప్రస్తావనే లేకుండా తన పని తాను చేసుకుని పోతోంది.  బీజేపీ కూడా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా పర్యటన సందర్భంగా పవన్ ను ముఖ్యమంత్రి చేయాలని జనసేన శ్రేణుల నుంచి డిమాండ్ ను పట్టించకోకపోవడం అటుంచి, ఆయన పర్యటన మొత్తంలో కనీసం జనసేన పేరును కానీ, పవన్ కల్యాణ్ ఊసు కానీ రానీయ లేదు.  అయితే ప్రస్తుతం రాష్ట్రంలో కనిపిస్తున్న ప్రభుత్వ వ్యతిరేకత నేపథ్యంలో బీజేపీ పునరాలోచనలో పడి జనసేనకు అదే సమయంలో తెలుగుదేశం పార్టీకి చేరువయ్యే ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. అందుకే జనసేనానికి ఆహ్వానాలు, తెలుగుదేశం పార్టీతో వేదిక పంచుకోవడాలు అని పరిశీలకులు అంటున్నారు. 

By
en-us Political News

  
రాబోయే రోజుల్లో ఏ ప్రాంతీయ పార్టీని దగ్గరకు చేర్చుకొనే అవకాశం లేదని ఆయన కుండబద్దలు కొట్టారు. ఎన్డీయే ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చి బుధవారంతో 12 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో మంగళవారం (జూన్ 9) ఢిల్లీలో ఆయన విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ ఈ సోలో ఎజెండా ప్రకటించారు.
మొత్తంగా తెలుగు రాష్ట్రాలలో బీజేపీ వ్యూహం ఏమిటన్న విషయాన్ని అమిత్ షా తేటతెల్లం చేసేశారు. దేశవ్యాప్తంగా కూటమి రాజకీయాలు నడుస్తున్న తరుణంలో.. కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా తెలంగాణ రాజకీయాలపై చేసిన వ్యాఖ్యలు జనసేనకు ఒకింత ఇబ్బందికలిగేలా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
పార్టీ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న కీలక నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడి బయటకు వచ్చేస్తున్నారు. తాజాగా టీఎంసీకి చెందిన రాజ్యసభ ఎంపీ సుస్మితా దేవ్ తన పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. వారం రోజుల వ్యవధిలో టీఎంసీకి గుడ్ బై చెప్పిన రెండో రాజ్యసభ సభ్యురాలు సుస్మితాదేవ్.
కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ నామినేషన్‌ తిరస్కరనకు గురి కావడం దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. మీనాక్షీ నటరాజన్ రాజ్యసభ నామినేషన్ ను ఎన్నికల సంఘం తిరస్కరించడంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. మీనాక్షి నటరాజన్‌పై తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని స్పష్టం చేశారు.
పునర్విభజన ప్రక్రియ వల్ల ఏ ఒక్క రాష్ట్రానికి గానీ, ఎవరికీ గానీ ఎలాంటి అన్యాయం జరగదని పునరుద్ఘాటించారు. డీలిమిటేషన్ బిల్లుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న విమర్శలను అమిత్ షా కొట్టిపారేశారు. రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యల్లో సీరియస్‌నెస్ లేదని, వాటిని పట్టించుకోవలసిన అవసరం లేదనీ అన్నారు.
మోదీ ప్రధాని పీఠంపై విజయవంతంగా 12 ఏళ్ల సుదీర్ఘ పదవీకాలాన్ని పూర్తి చేసుకున్నారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే 4,399 రోజుల పాటు ఆయన నిరంతరాయంగా ప్రధాని పదవిలో ఉన్నారు. 1952లో భారతదేశంలో మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగిన తర్వాత.. జవహర్‌లాల్ నెహ్రూ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికై 4,398 రోజుల పాటు నిరవధికంగా ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు.
ఒక్క తెలంగాణ అని కాదు, ఏ రాష్ట్రంలోనైనా ఒంటరిగానే బరిలోకి దిగుతామని చెప్పారు. ఆ దిశగా ముందు.. తెలంగాణ, పంజాబ్ రాష్ట్రాల్లో వచ్చే ఎన్నికలలో ఒంటరి పోరుకు సిద్ధమౌతున్నట్లు చెప్పారు.
ఈ ఎన్నికలకు సంబంధించి దాఖలైన నాలుగు నామినేషన్ పత్రాలు పూర్తిగా సక్రమంగా ఉన్నాయని రిటర్నింగ్ అధికారి, అసెంబ్లీ సంయుక్త కార్యదర్శి ఆర్. వణితా రాణి ప్రకటించారు. శాసనసభ భవనంలోని తన చాంబర్‌లో అభ్యర్థుల సమక్షంలో జరిగిన ఈ స్కృటినీ ప్రక్రియలో ఎలాంటి సాంకేతిక లోపాలు లేవని తేలడంతో కూటమి శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో 2027 సంవత్సరం ఒక సరికొత్త సంచలనానికి వేదిక కాబోతోందా? అంటే రాజకీయ పరిశీలకులు ఔననే ఉంటున్నారు. 2024లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న జగన్, అలాగే 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పరాజయాన్ని చవిచూసిన కేసీఆర్ ఇద్దరూ 2027 సంవత్సరంలో మళ్లీ ప్రజలతో మమేకమై పూర్వ వైభవాన్ని అందిపుచ్చుకోవాలన్నవ్యూహరచనలో ఉన్నారు.
సాక్షాత్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగి ఆదేశాలు జారీ చేసినప్పటికీ.. క్షేత్రస్థాయిలో అధికారులు ఆ ఫైళ్లను పక్కన పెట్టేయడం రాజకీయ, అధికార వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
మహారాష్ట్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన 20 అడుగుల ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ వేడుకలో వివాదం తలెత్తింది. ఈ భారీ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి అయిన ఏక్‌నాథ్ షిండేకు కనీసం ఆహ్వానంఅందలేదు.
దేశరాజకీయాల్లో ప్రతిపక్ష ఇండియా కూటమి అత్యంత కీలకమైన అడుగులు వేస్తోంది.
రాజ్యసభ ఎంపీ అభ్యర్థులుగా తెలుగు దేశం పార్టీ తరుపున సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ లు నామినేషన్ లు దాఖలు చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.