మళ్లీ యుద్ధరంగంగా మారిన హెర్మూజ్.!

Publish Date:Jul 7, 2026

Advertisement

ప్రపంచ వాణిజ్యానికి  అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి మరో సారి యుద్ధరంగంగా మారింది. అంతర్జాతీయ చమురు సరఫరాకు అత్యంత కీలకమైన ఈ జల మార్గంలో ఉద్రిక్తతలు మళ్లీ పీక్స్ కు చేరాయి. నౌకలపై దాడులను నిలిపివేసేలా అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఇటీవల కుదిరిన శాంతి ఒప్పందం ముక్కలైంది. ఆ ఒప్పందాన్ని బేఖాతరు చేస్తూ..  ఇరాన్ దళాలు   క్షిపణులతో విరుచుకుపడ్డాయి. ఈ పరిణామం మళ్లీ ఒక్కసారిగా శాంతి ఆశలను ఆవిరి చేసేసింది. ఒమన్ తీరానికి సమీపంలో ఇరాన్‌  రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ రెండు వాణిజ్య నౌకలను లక్ష్యంగా  క్షిపణి దాడులకు తెగబడింది.

ఈ  దాడుల కారణంగా ఆ రెండు వాణిజ్య నౌకలు పాక్షికంగా ధ్వంసమయ్యాయి.   అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన శాంతి ఒప్పందం ఇంత స్వల్ప వ్యవధిలో అంటే రోజుల వ్యవధిలోనే పటాపంచలైంది.  ఒప్పందాన్ని తుంగలో తొక్కుతూ ఇరాన్ దూకుడుకు కారణమేంటన్నది వెంటనే తెలియరాలేదు. అయితే ఇరాన్ జరిపిన ఈ క్షిపణి దాడులపై అమెరికా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.  ఈ ప్రాంతంలో శాంతి భద్రతలను పునరుద్ధరించడానికి, వాణిజ్య నౌకలకు రక్షణ కల్పించడానికి అమెరికా తదుపరి ఎలాంటి కఠిన అడుగులు వేయబోతుందనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది.

Strait of Hormuz, Iran missile attack, IRGC attacks ships, US Iran agreement violated, Gulf maritime tension

By
en-us Political News

  
పశ్చిమ బెంగాల్ దుర్గాపూజ పండళ్ల లోపల మాంసాహారం నిషేధించాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేసింది. 5 రోజుల ఉత్సవాల్లో సనాతన సంప్రదాయాలు పాటించాలని 600 పూజా కమిటీలకు వీహెచ్‌పీ చేసిన ప్రతిపాదనల వివరాలు.
రక్షాబంధన్ రోజున రాఖీ దారం తెగిపోవడం అశుభమా కాదా అనే సందేహాలకు వేద పండితుల సమాధానం తెలుసుకోండి. తెగిపోయిన రాఖీ వల్ల కలిగే ప్రయోజనాలు, పాటించాల్సిన నియమాలు మరియు 2026 రాఖీ శుభ ముహూర్తాల వివరాలు.
తిరుమలలో పౌర్ణమి మరియు గరుడ సేవ సందర్భంగా భక్తులు పోటెత్తారు. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుండగా, ఒక్కరోజే 66,437 మంది దర్శించుకోగా రూ. 4.45 కోట్ల హుండీ ఆదాయం లభించింది.
తిరుపతి ఫారెస్ట్ డివిజన్ అధికారులు అత్యంత అరుదైన 3 రోజ్-రింగ్డ్ ప్యారాకీట్స్ (రామచిలుకలను) సమర్థవంతంగా రక్షించారు. ప్రాథమిక చికిత్స అనంతరం వాటిని తిరిగి అడవిలోకి విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పూర్తి వివరాలు చదవండి.
శ్రావణ పౌర్ణమి నాడు జరుపుకునే హయగ్రీవ జయంతి విశిష్టత, శ్రీమహావిష్ణువు హయగ్రీవ అవతారం ఎత్తడానికి గల ఆధ్యాత్మిక కథ మరియు విద్యార్థులకు జ్ఞానాన్ని ప్రసాదించే హయగ్రీవ పూజా విధానం గురించి వివరంగా తెలుసుకోండి.
చంద్ర గ్రహణ సమయంలో ఆధ్యాత్మిక రక్షణ మరియు మానసిక ప్రశాంతత పొందేందుకు పాటించాల్సిన సూతక కాల నియమాలు, మంత్ర జపం, గర్భవతుల జాగ్రత్తలు మరియు గ్రహణానంతర శుద్ధి, దానాల విశిష్టతలను వివరంగా తెలుసుకోండి.
2026 రక్షాబంధన్ సందర్భంగా సోదరుడి ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం మరియు దీర్ఘాయువు కోసం సోదరీమణులు చేయాల్సిన పవిత్ర దానాల విశిష్టతలను తెలుసుకోండి. ఆహార ధాన్యాలు, బెల్లం, వస్త్రాలు మరియు నల్ల నువ్వుల దానం వల్ల కలిగే ఆధ్యాత్మిక, జ్యోతిష్య ప్రయోజనాలు ఇవే!
పెద్దపల్లి జిల్లాలోని ప్రసిద్ధ ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి ఆలయాన్ని ₹15 కోట్లతో దశలవారీగా పునర్నిర్మించనున్నారు. పర్యాటక శాఖ నుండి మరో ₹8 కోట్లు, భక్తుల కోసం 22 నూతన వసతి గదుల నిర్మాణానికి భూమిపూజ చేశారు. పూర్తి వివరాలు చదవండి.
కేరళ తీరం నుండి కార్గిల్ మంచు ఎడారుల వరకు భారతీయ పర్యావరణం, అడవులు మరియు నీటి వనరుల సంరక్షణలో ఇస్లామిక్ ఆధ్యాత్మిక సంప్రదాయాలు మరియు సూఫీ సంస్కృతి పోషించిన అరుదైన చారిత్రక పాత్రను సమగ్రంగా తెలుసుకోండి
ఉద్యోగాలు, ఉపాధి కోసం నగరంలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి, శివారు ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు ప్రతిరోజూ ప్రయాణించే వారికి రాత్రివేళ ప్రజా రవాణా కొరత ఇబ్బందిగా మారుతోంది.
ఫార్ములా ఈ-కార్ రేస్‌ కేసులో నాంపల్లి ఏసీబీ ప్రత్యేక కోర్టులో మంగళవారం విచారణ జరిగింది.
ఎల్‌ఐసీ ఆన్‌లైన్ పోర్టల్‌లో క్రెడిట్ కార్డ్ ద్వారా ప్రీమియం చెల్లింపుల సదుపాయాన్ని హఠాత్తుగా నిలిపివేశారు. పేమెంట్ గేట్‌వే ఛార్జీల వివాదమే దీనికి కారణమా పూర్తి వివరాలు, ప్రత్యామ్నాయ చెల్లింపు మార్గాలు ఇక్కడ తెలుసుకోండి.
సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదిత అమెరికా పర్యటనకు కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ పొలిటికల్ క్లియరెన్స్ నిరాకరించడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.