కొత్త బడ్జెట్ పై కోటి ఆశలు .. శతకోటి సందేహాలు!

Publish Date:Jan 18, 2023

Advertisement

బడ్జెట్ అనగానే, అందరికీ కామన్ గా ఉండే కోర్కెలు కొన్నుంటాయి. మరో వంక ఎవరి లెక్కలు వారి కుంటాయి.  ఎంత కాదనుకున్నా  ఎవరికివారు నాకేంటి? అని ప్రశ్నించు కుంటారు. అయితే, ఎవరి కోర్కెలు ఎలా ఉన్న సర్కార్ వారి ప్రాధాన్యతలు సర్కార్ వారి కుంటాయి.  చివరకు  మన తెలుగింటి కోడలు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలమ్మ బడ్జెట్ ను ఎంత రుచిగా, శుచిగా సిద్దం చేస్తారో...  ఎంత చక్కగా వండి వార్చి వడ్డిస్తారో... చూడవలసిందే.  తినబోతూ రుచులేందుకు అనుకోవలసిందే.

కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్, ఫిబ్రవరి 1న వరసగా ఐదవ సారి, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం, 2023- 2024 వార్షిక బడ్జెట్ ను పార్లమెంట్ కు సమర్పించనున్నారు.  గత మూడేళ్ళుగా కొవిడ్ మహమ్మారి కారణంగా దెబ్బ తిన్న దేశ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడిప్పుడే పట్టాలెక్కుతోంది. అలాగే  పైపైకి పరుగులు తీసిన ద్రవ్యల్బణం కూడా గడచిన రెండు మూడు నెలలుగా మెల్ల మెల్లగా ఒక్కో మెట్టూ దిగి వస్తోంది. 
నిజానిక ,కొవిడ్ అనంతర కాలంలో ఆర్థిక మంత్రి, ఆర్థిక శాఖ అధికారులకు బడ్జెట్    కసరత్తులో ఎంత  ఒత్తిడి ఎదుర్కున్నారో వేరే చెప్పనక్కరలేదు. అయుతే ఈసారి ఆ ఒత్తిడి కాసింత తగ్గింది. నిధుల కేటాయింపు విషయంలో కొంత మేరకు  వెసులు బాటు కలిగిందని అనుకోవచ్చునని ఆర్థిక నిపుణులు అంటున్నారు. అయితే అదే సమయంలోప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ కునారిల్లుతున్న నేపథ్యంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం ఎంత మాత్రం అభిలషనీయం కాదని,   ఆర్ధిక నిపుణులు హెచ్చరిస్తునారు కూడా.  

అదలా ఉంటే వచ్చేది ఎన్నికల సీజన్ ...  2023లో తొమ్మిది రాష్ట్రాల శాసన సభ ఎన్నికలతో పాటుగా, 2024 లోక్ సభ ఎన్నికలకు కూడా ఈ బడ్జెట్టే దిక్సూచి.  వచ్చే సంవత్సరం 2024 ఏప్రిల్, మే నెలలలో లోక్ సభ ఎన్నికలు ఉంటాయి కాబట్టి, ఎన్నికలకు ముందు ప్రస్తుత మోడీ ప్రభుత్వం ప్రవేశ పెట్టే పూర్తి స్థాయి బడ్జెట్  ఇదే కావడంతో ఈ బడ్జెట్  పై అంచనాలు  అధికగానే ఉన్నాయి. అయితే, చివరకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్  ఎవరి అంచనాలను ఏ మేరకు నెరవేరుస్తారన్నది .. ఫిబ్రవరి 1న గానీ తెలియదు. కానీ, ఎంత కాదన్నా  ఎన్నికల సంవత్సరంలో ప్రజాకర్షక పథకాల విషయంలో ఆర్థిక మంత్రి కట్టుబాట్లను కొంత మేర సడలించుకోక  తప్పదని రాజకీయ, ఆర్థిక విశ్లేషకులు అంటున్నారు.   

అయినా ఎప్పటిలానే వడ్డింపులు ఉంటాయా? తాయిలాలు ప్రకటిస్తారా? మధ్య తరగతి ముచ్చట తీరుస్తారా? వేతన జీవులకు పన్నుపోటు నుంచి మరి కొంత ఉపశమనం కల్పిస్తారా? అనే చర్చ అయితే జోరుగానే సాగుతోంది. ముఖ్యంగా మధ్యతరగతి వేతన జీవుల ఈసారి బడ్జెట్‌లో పన్ను స్లాబ్‌లలో మరింత సడలింపును ఆశిస్తున్నారు. కొత్త పన్నులు వద్దమ్మా .. అని నిర్మలమ్మను కోరుకుంటున్నారు. కోవిడ్ కాలంలో  ఉద్యోగాలు కోల్పోవడం వల్ల ఇబ్బంది పడుతున్న కార్మికవర్గం ఈసారి మోడీ ప్రభుత్వం పన్ను శ్లాబులలో మినహాయింపు ఇవ్వగలదని ఆశతో ఉన్నారు. కొత్తగా పన్నుల వడ్డన ఉండదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సూచన ప్రాయంగానే అయినా స్పష్టమైన సంకేతమే ఇచ్చారు.  కానీ, శ్లాబులపై ఇంకా స్పష్టత రాలేదు.  రాజకీయంగా ఒత్తిళ్ళు పెరుగతున్న నేపథ్యంలో మోడీ ప్రభుత్వం , ప్రస్తుత బడ్జెట్  ఎన్నికల బడ్జెట్  గానే  వండి వారుస్తుందనే ఆశలు మాత్రం మధ్యతరగతి ప్రజల్లో మెండుగా ఉన్నాయి. అందుకే మధ్యతరగతి  ఫిబ్రవరి 1 కోసం ఎదురుచుస్తున్నది.

అలాగే, నిరుద్యోగ యువత కొత్త బడ్జెట్‌లో ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం ఆశగా ఎదురు చూస్తున్నది. కేంద్ర బడ్జెట్‌లో ఉపాధి కల్పన కోసం చేపట్టబోయే కార్యక్రమాలపై ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కరోనా కాలంలో లక్షల మంది ఉపాధి కోల్పోయారు. ఈ నేపధ్యంలో మధ్య తరగతి ప్రజల జీవనోపాధి అవకాశాలు కల్పనకు బడ్జెట్ దారి చూపుతుందని ఆశిస్తున్నారు. కరోనా మహమ్మారి తర్వాత, ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య బీమా రంగం పుంజుకుంది. అయితే ఆరోగ్య బీమా విషయంలో ప్రభుత్వం నుంచి నిబంధనలలో కొంత సడలింపు ఉంటుందని అన్నివర్గాల ప్రజలు ఆశిస్తున్నారు. ఆరోగ్య బీమా, జీవిత బీమాలను జీఎస్టీ పరిధి నుంచి మినహాయించాలని కోరుతున్నారు. ఇలా మధ్య తరగతి కోర్కెల చిట్టా చాలానే వుంది. అయితే నిర్మలమ్మ  ఏమంటారో..  ఎవరిని ఏ మేరకు మెప్పిస్తారో చూడాలి మరి ..

By
en-us Political News

  
విపత్కర సమయంలో తెలుగు రాష్ట్రాల ఐక్యత.. ఏపీకి సాయం.!
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని శ్రీ కృష్ణ సదర్ సమ్మేళనం ఉత్సవ కమిటీ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఒక్కోసారి చిన్న ప్రయత్నం కూడా ఊహించని విధంగా జీవితాన్ని మార్చేస్తుందనడానికి నిదర్శనంగా నిలిచింది ఒక ఉదంతం.
ఆంధ్రప్రదేశ్‌ను వణికించిన అర్నబ్ తుఫాను ప్రభావంతో పంటలు, ఇళ్లు, రహదారులు, విద్యుత్ వ్యవస్థలకు నష్టం వాటిల్లింది.
ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన క్లిష్ట పరిస్థితుల్లోనూ ఏ మాత్రం వెనకడుగు వేయకుండా, ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విద్యుత్ శాఖ సిబ్బంది సేవలందిస్తున్న తీరు ఎంతో స్ఫూర్తిదాయకమని
స్థానిక  సన్నాహాలపై తెలుగుదేశం కూటమికి చెందిన దాదాపు 45 వేల మంది ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు,  కార్యకర్తలతో  సీఎం చంద్రబాబు ఈ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీపై చంద్ర నిప్పులు చెరిగారు.
కేరళలోని కొచ్చిలో సంచలనం సృష్టించిన మెర్సిడెస్ బెంజ్ కారు ప్రమాదం కేసు పోలీసు శాఖలో కలకలం రేపుతోంది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది.
మహా న‌గ‌రం హైద‌రాబాద్‌లో ఎట్టి పరిస్థితుల్లోనూ తాగు నీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో 4-0తో ఎన్డీఏ క్లీన్ స్వీప్.!
ప్రభుత్వ కార్యాలయాల గోడలపై ఎక్కడ చూసినా ఒకే నినాదం కనిపిస్తుంది.. లంచం ఇవ్వడం, తీసుకోవడం నేరం
జగన్‌ తాను మళ్లీ  అధికారంలోకి వస్తానంటూ జగన్ 2.o అంటూ చేసిన వ్యాఖ్యలకు పవన్ కల్యాణ్ మేం 10x చూపిస్తామంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.  తెలుగుదేశం కూటమి ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ జగన్ చేసిన హెచ్చరికలకు పవన్ కల్యాణ్  దీటుగా ఇచ్చిన స్ట్రాంగ్ కౌంటర్ పొలిటికల్ సర్కిల్స్ లోనూ, సోషల్ మీడియాలోనూ కూడా పెద్ద ఎత్తున చర్చకు తెరలేపింది.  
రాష్ట్రంలో అర్నబ్ తుపాను ప్రభావంతో పరిస్థితులు తీవ్రంగా మారుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.