ఫైల్స్ సమస్య మూడు రోజుల్లోనే నయం కావాలంటే ఈ పవర్ఫుల్ చిట్కా ఫాలో అవ్వాల్సిందే..!

Publish Date:Dec 12, 2024

Advertisement

 

మలబద్ధకం సమస్య దీర్ఘకాలం కొనసాగినప్పుడు, పైల్స్ ఏర్పడతాయి. ఇది తీవ్రమైన సమస్య.   పైల్స్  ఫిస్టులా వంటి ప్రమాదకరమైన పరిస్థితులకు దారితీస్తుంది. ఫైల్స్ వచ్చినవారు  దాని నివారణకు పైల్స్ తొలగించడం కోసం  శస్త్రచికిత్స,  ఇంజెక్షన్ సహాయం తీసుకుంటారు. కానీ చాలా సార్లు ఈ చికిత్స ప్రభావవంతంగా ఉండదు. ఎందుకంటే మలబద్దకం సమస్యను నివారించకపోతే పైల్స్ సమస్య మళ్లీ మళ్లీ వచ్చే అవకాశం ఉంది.  దీని వల్ల చాలా దుష్ప్రభావాలను  ఎదుర్కోవలసి రావచ్చు. యోగా గురువు బాబా రామ్‌దేవ్ రెండు వేల సంవత్సరాల నాటి పద్దతులను అనుసరించడం ద్వారా కేవలం 3 రోజుల్లోనే ఈ సమస్య నయమవుతుందని పేర్కొన్నారు. అసలు పైల్స్ సమస్య లక్షణాలేంటి? పైల్స్ తగ్గించే పద్దతులు ఏంటి? పైల్స్ రాకుండా తీసుకోవాల్సిన చర్యలు ఏంటి?  తెలుసుకుంటే..

పైల్స్ లక్షణాలు..

మలంతో పాటు ఎర్రటి రక్తం రావడం.

మలద్వారం వద్ద దురద రావడం.

మూత్ర విసర్జన చేసిన వెంటనే మలం ఒత్తిడి.

మలద్వారం వద్ద గడ్డలాగా ఏర్పడటం.

మలద్వారం వద్ద నొప్పిగా ఉండటం.

పైల్స్ కు బాబా రాందేవ్ చెప్పిన చిట్కాలు..

పాలు, నిమ్మకాయ..

బాబా రామ్ దేవ్ చెప్పిన టిప్స్ లో పాలు, నిమ్మకాయ టిప్ చాలా బాగా పనిచేస్తుంది.  ఒక కప్పు చల్లని పాలలో ఒక నిమ్మకాయ పిండాలి.   తరువాత ఈ నిమ్మకాయ పిండిన పాలను వెంటనే తాగేయాలి.  ఈ పాలను ఎక్కువసేపు ఉంచిదే పాలు పగిలిపోతాయి. కాబట్టి పాలలో నిమ్మరసం పిండగానే తాగెయ్యాలి.  దీన్ని మూడు రోజుల పాటు తీసుకోవాలి. అయితే ఇందుకోసం గేదె పాలు తీసుకోకూడదు.  దానికి  బదులుగా ఆవు పాలను మాత్రమే వినియోగించాలి.

అరటి, కర్పూరం..

పైల్స్ నివారణ  కోసం అరటి,  కర్పూరం  కూడా ఉపయోగించవచ్చు. పండిన అరటిపండులో పావు వంతు తీసుకుని దాన్ని చీల్చాలి. దానిలో గ్రాముకు సమానమైన కర్పూరాన్ని ఉంచి ఆపై దానిని మింగాలట. ఇలా మూడు రోజులు తింటే పైల్స్ సమస్య కంట్రోల్ అవుతుందని అంటున్నారు. అయితే ఈ చిట్కా ఫాలో అయ్యేవారు  భీమసేని కర్పూరం వాడాలి.

పైల్స్ రాకుండా ఏ జాగ్రత్తలు తీసుకోవాలంటే..

పుష్కలంగా నీరు త్రాగాలి. మలద్వారం వద్ద  దురద,  నొప్పిని తగ్గించడానికి గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. రోజూ వ్యాయామం చేయాలి. పైబర్ ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. లిక్విడ్ ఫుడ్స్ తీసుకోవాలి. ఘన ఆహారం,  ఎక్కువ సేపు జీర్ణం అయ్యే ఆహారాలకు దూరం ఉండాలి. పైన చెప్పుకున్న చిట్కాలు  పైల్స్ సమస్యను  తగ్గిస్తాయని చెప్పారు తప్ప..  వైద్యులు ఇచ్చే ఔషధాలు,  వైద్యులు చేసే ట్రీట్‌మెంట్ కు ఇవి  ప్రత్యామ్నాయం కాదు. పైల్స్ సమస్య వల్ల ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటే వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం.

                                          *రూపశ్రీ.
 

By
en-us Political News

  
ఆరోగ్యకరమైన శరీరానికి జింక్ చాలా అవసరం. జింక్ కణజాలాలను బాగుచేస్తుందని చెబుతారు. జింక్ ఒక యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తూ, కణాలను దెబ్బతినకుండా కాపాడటానికి సహాయపడుతుంది. చర్మం..
ఇనుప పాత్రలో వంట చేయడం ఆరోగ్యానికి మేలు చేస్తుందని చెబుతారు. ఎందుకంటే ఇనుప పాత్రలో వంట చేయడం వల్ల ఆ ఆహారాన్ని ఐరన్ ఖనిజం చేరుతుంది.  దీని వల్ల శరీరానికి ఐరన్ ఎలాంటి సప్లిమెంట్ ..
ఈ రోజుల్లో పిల్లల నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరు   ఎక్కువ సమయాన్ని మొబైల్, ల్యాప్‌టాప్ లేదా టాబ్లెట్ స్క్రీన్‌ల ముందు గడుపుతున్నారు. దీని ఫలితంగా, కంటి అలసట , చికాకు సర్వసాధారణమైపోయాయి...
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో సరైన నిద్ర లేకపోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి...
AI..ప్రపంచం అంతా వాడుతున్న కృత్రిమ మేధస్సు ఇది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఈ కృత్రిమ మేధస్సు వాడకం చాలా పెరిగింది.  ఏ చిన్న సందేహం వచ్చినా ఏఐ ని వాడటం, దాన్ని సలహాలు, సూచలు అడగడం..
నేటి కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్య మోకాళ్ళ నొప్పులు. జీవనశైలిలో మార్పులు, శారీరక శ్రమ తగ్గడం మరియు సరైన పోషకాహారం..
వేసవి మొదలవ్వగానే తీవ్రమైన ఎండ , పెరుగుతున్న ఉష్ణోగ్రతలు మన రోజువారీ  కార్యకలాపాలు , ఆరోగ్యంపై ప్రభావం చూపడం మొదలవుతుంది. ఈ రోజుల్లో బయట కొద్దిసేపు ఉన్నా కూడా శరీరం అలసిపోయేంత వేడిగా ఉంటుంది...
పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి.  ముఖ్యంగా వేసవి కాలంలో నీటిశాతం అధికంగా ఉన్న పండ్లను ఎంత తీసుకుంటే అంత మంచిదని చెబుతూ ఉంటారు. కానీ చాలామంది వేసవి కాలంలో పండ్ల జ్యూసులు..
నేటి కాలంలో వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అందరినీ వేధిస్తున్న ప్రధాన ఆరోగ్య సమస్య కిడ్నీ వ్యాధులు...
తిండి కలిగితే కండ కలదోయ్ అని అంటుంటారు. అలాగే కొందరు ఎంత కారంగా ఉన్న ఆహారం తింటే.. శరీరం అంత దృఢంగా ఉంటుందని కూడా అంటుంటారు.  ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ప్రజలు బాగా కారంగా...
నేటి కాలంలో మారుతున్న జీవనశైలి, ఒత్తిడి మరియు ఆహారపు అలవాట్ల వల్ల వయసుతో సంబంధం లేకుండా చాలా మంది గుండెపోటు (Heart Attack) బారిన పడుతున్నారు. అయితే, గుండెపోటు అకస్మాత్తుగా వచ్చే ప్రమాదమే అయినప్పటికీ, మన శరీరం కొన్ని రోజుల ముందే కొన్ని లక్షణాల ద్వారా మనల్ని హెచ్చరిస్తుంది. ఆ సంకేతాలను సరైన సమయంలో గుర్తిస్తే ప్రాణాపాయం నుండి తప్పించుకోవచ్చు.
భారతీయుల ఆహారంలో పాలు, పాల ఉత్పత్తులకు చాలా ప్రత్యేక స్థానం ఉంటుంది.  పాలు, పెరుగు, వెన్న, నెయ్యి లేకుండా రోజు అస్సలు గడవదు.  ఇక ఇప్పట్లో చాలా మంది పనీర్ కుడా బాగా వినియోగిస్తున్నారు....
మన వంటింట్లో ఉండే వెల్లుల్లి కేవలం రుచికే కాదు, అద్భుతమైన ఔషధ గుణాలకు కూడా మారుపేరు. ముఖ్యంగా గుండె సంబంధిత సమస్యలు, అధిక బరువు మరియు మధుమేహంతో బాధపడేవారికి వెల్లుల్లి ఒక వరప్రసాదం లాంటిది. ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మ గారు ఈ వీడియోలో వెల్లుల్లిని ఎలా వాడాలి మరియు దానివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి సవివరంగా వివరించారు...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.