పిఠాపురం పర్యటనలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనితను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కూటమి పార్టీల్లోనూ, ప్రభుత్వంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించాయి. కేబినెట్ లో సహచర మంత్రిపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు తెలుగుదేశం కూటమి సర్కార్ కు ఇబ్బందికరంగా పరిణమించాయనడంలో సందేహం లేదు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితికి రాష్ట్ర హోంమంత్రిగా అనిత బాధ్యత వహించాలంటూ చేసిన వ్యాఖ్యలు, రాష్ట్రంలో హత్యలు, అత్యాచారాలు జరుగుతుంటే మీరు ఏం చేస్తున్నారు? అంటూ సంధించిన ప్రశ్నలూ ఒక అనితనే కాక మొత్తం తెలుగుదేశం కూటమి ప్రభుత్వ పని తీరును ప్రశ్నించడంగానే భావించాల్సి ఉంటుంది. ఆ ప్రభుత్వంలో పవన్ కల్యాణ్ కూడా భాగమే. అటువంటి పవన్ కల్యాణ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో అవసరమైతే తాను హోంమంత్రి బాధ్యతలు చేపడుతానని హెచ్చరించడం సీఎం చంద్రబాబు తీరును కూడా ఎత్తి చూపినట్లుగానే పరిశీలకులు భావిస్తున్నారు.
పవన్ కల్యాణ్ వ్యాఖ్యల కారణంగా కూటమి ప్రభుత్వానికి ఏర్పడిన ఇబ్బందిని అధిగమించడానికి చంద్రబాబు రంగంలోనికి దిగుతారు. ఆయన పరిణితి, విభేదాల పరిష్కారం నేర్పు తెలియంది కాదు.
అయితే ఇక్కడ చెప్పుకోవలసింది పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించిన తీరును. ఎంతో పరిణితితో, అంతకు మించిన హుందా తనంతో ఆమె పవన్ వ్యాఖ్యలను స్వీకరించారు.
వంగలపూడి అనిత ఎంత ఫైర్ బ్రాండ్ లీడరో అందరికీ తెలిసిందే. జగన్ అరాచక పాలనను వ్యతిరేకంగా ఆమె ఎంత గట్టిగా పోరాడారో తెలియంది కాదు. అటువంటి వంగలపూడి అనిత పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను ఎంతో పాజిటివ్ గా తీసుకున్నారు. ఆయన మాట్లాడిన మాటలన్నీ వాస్తవాలేనని తనకు తెలుసునన్నారు. పవన్ కల్యాణ్ దేని గురించి మాట్లాడుతున్నారో తనకు తెలుసున్నారు. వాటిపై తాము చర్చించామన్నారు. ముఖ్యమంత్రితో రాష్ట్రంలో పరిస్థితుల గురించి తాను జరిపిన చర్చలలో పవన్ కల్యాణ్ కూడా ఉన్నారని చెప్పిన అనిత.. రాష్ట్రంలో పరిస్థితులను చక్కదిద్దడానికి అవసరమైన అన్ని చర్యలూ త్వరలోనే తీసుకుంటామని చెబుతూనే తప్పు చేసిన ఎవరినీ వదిలే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. పవన్ కల్యాణ్ మాటల్లో రాజకీయాలు లేవని చెప్పడం ద్వారా అనిత తన పరిణితిని చాటుకున్నారు. పవన్ కల్యాణ్ అవేశంతో అనాలోచితంగా అంతర్గతంగా చర్చించుకోవలసిన అంశాలపై బహిరంగంగా వ్యాఖ్యలు చేస్తే.. ఎంతో పరిణితితో అనిత వాటిని పాజిటివ్ గా తీసుకుని చర్యలు తీసుకుంటానని చెప్పారు.
అయితే.. పవన్ వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్నిలేపాయనడంలో సందేహం లేదు. ఆయన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమంలో వైరల్ అయ్యాయి. తెలుగుదేశం, జనసేన సఖ్యత చెడిందా అన్న అనుమానాలూ వ్యక్తమయ్యాయి. అయితే పవన్ కల్యాణ్ మాట్లాడిన మాటలలో తప్పేముందని మంత్రి నారాయణ ప్రశ్నించారు. రాష్ట్రంలో ఏదైనా శాఖ సరిగా పని చేయడం లేదని అనిపిస్తే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి స్పందిస్తారని అందులో తప్పేముందని ప్రశ్నించారు. వారి స్పందన వల్ల ఆ శాఖలు అలర్ట్ అవుతాయని అన్నారు. రాష్ట్రంలో ఇటీవల మహిళలు, బాలికలపై జరిగిన అఘాయి త్యాలపై పవన్ కల్యాణ్ స్పందించారనీ, కొన్ని సంఘటనలలో పోలీసులు వేగంగా స్పందించలేదని ఆయన అన్నారు. ఆయన హెచ్చరికలతో పోలీసు శాఖ అప్రమత్తమౌతుందని నారాయణ వివరించారు. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు ఎంత మాత్రం వివాదాస్పదం కావని స్పష్టం చేశారు. అలాగే కూటమి పార్టీలలో ఎలాంటి విభేదాలూ లేవని క్లారిటీ ఇచ్చారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/home-minister-anita-responded-with-maturity-39-187881.html
తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఏబీ వెంకటేశ్వరరావు తమిళనాడులో ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలను.. ముఖ్యంగా విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ సాధించిన విజయాలను ఏబీ వెంకటేశ్వరరావు ఆసక్తికరంగా విశ్లేషించారు. ఎవరూ ఊహించని మార్పులు రాజకీయాల్లో సంభవిస్తాయని, ప్రజలు మార్పును కోరుకున్నప్పుడు అసాధ్యం సుసాధ్యం అవుతుందని అన్నారు.
టీవీకే నేత ఆదవ అర్జునకు, వీసీకే అధినేత తిరుమావళవన్ స్వయంగా మద్దతు లేఖను అందజేశారు. ఈ కీలక పరిణామంతో అసెంబ్లీలో టీవీకే కూటమి సంఖ్యా బలం ఇప్పుడు 118కి చేరింది.
అధికారులు సచివాలయంలోని ఏసీ గదులలో కూర్చుని పని చేసే విధానానికి స్వస్థి చెప్పారు. అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో ప్రసంగిస్తూ.. పౌరుల ఫిర్యాదులను నేరుగా క్షేత్రస్థాయిలో పరిష్కరించడానికి అధికారులు తమ కార్యాలయాలను విడిచిపెట్టి ప్రజల వద్దకు వెళ్లాలని ఆదేశించారు.
సువేందు అధికారి రాజకీయ నేపథ్యాన్ని పరిశీలిస్తే.. కాంగ్రెస్ సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన సువేందు, రాజకీయ ఓనమాలు అక్కడే నేర్చుకున్నారు. ఆయన తాత కెనరామ్ అధికారి స్వాతంత్ర్య సమరయోధుడు కాగా, తండ్రి శిశిర్ అధికారి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా రాణించారు. సువేందు అధికారి మమతా బెనర్జీ స్థాపించిన తృణమూల్ కాంగ్రెస్‌లో చేరి ఆ పార్టీలో కీలక నేతగా ఎదిగారు.
కరీంనగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై జరిగిన దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకత్వం బంద్ పిలుపునిచ్చిన నేపథ్యంలో . శనివారం ( మే 9) ఉదయం నుండే నగరంలోని ప్రధాన కూడళ్లలో పోలీసులు భారీగా మోహరించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నిరసనలో పాల్గొనకుండా పోలీసులు ఆయన ఇంటి వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీనిపై బీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ముఖ్యంగా పార్టీలో అభిషేక్ బెనర్జీ పెత్తనం పెరగడం వల్లే సువేందు అధికారి వంటి బలమైన నేతలు టీఎంసీని వీడారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పట్టున్న నాయకులను కాదని, కార్పొరేట్ తరహా రాజకీయాలకు అభిషేక్ బెనర్జీ ప్రాధాన్యత ఇవ్వడం తృణమూల్‌కు ప్రతికూలంగా మారిందంటున్నారు.
ఆంధ్రోళ్లను తిట్టి ఓట్లు దండుకున్న బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రాజెక్టుల పేరుతో దోపిడీకి పాల్పడిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుత ఎన్నికల ఫలితాలు కేరళలో పెను మార్పులకు నాంది పలికాయి. యూడీఎఫ్ స్పష్టమైన మెజారిటీ సాధించడంతో.. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై కసరత్తు జరుగుతోంది. కేసీ వేణుగోపాల్ అనుభవం, రాహుల్ గాంధీతో ఉన్న సాన్నిహిత్యం ఆయనకు ప్రధాన బలంగా మారాయి.
టీవీకే అధినేత విజయ్‌కు కాంగ్రెస్ మద్దతు తెలపడంపై ఆగ్రహంగా ఉన్న డీఎంకే.. కాంగ్రెస్‌కు కటీఫ్ చెప్పేసింది. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, లోక్‌సభలో తమ పార్టీ సభ్యులకు కాంగ్రెస్ ఎంపీలతో కాకుండా విడిగా సీటింగ్ కేటాయించాలని డీఎంకే ఎంపీ కనిమొళి స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
తాజా సమాచారం ప్రకారం.. విజయ్ తన పార్టీకి ఉన్న బలానికి తోడుగా మరో మూడు పార్టీల మద్దతును కూడగట్టుకున్నారు. ఆ పార్టీల మద్దతుతో అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118ని ఆయన సాధించారు.
తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవ్వగా.. మెజారిటీ నిరూపణ విషయంలో రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కచ్చితమైన నిబంధనలు పాటించాలని పట్టుబడుతున్నారు. విజయ్ కు తన పార్టీ ఎమ్మెల్యేలు 107 మందికి అదనంగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది.
పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనకు ముందే తెలుసని, నాయకత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు. అయితే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి.. క్షేత్రస్థాయిలో కేడర్‌ను కాపాడుకుంటూ వచ్చిన తనకు ఈ పరిణామం మనస్తాపానికి గురిచేసిందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు.
బాబు కూటమిని ఎందుకంత విలువైనదిగా భావిస్తున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూటమి ఎప్పుడెప్పుడు చీలిపోతుందాని కాచుకుని కూర్చుని ఉంది. ఏ అవకాశం వచ్చినా వారు వదిలిపెట్టినట్టే కనిపించదు. మొన్న కోట వినుత ఘటన, నిన్న అరవ శ్రీధర్ వ్యవహారం, ఇవాళ వర్మ ఇష్యూ.. ఇలా సమయం దొరికినపుడల్లా ఆయా అంశాలను బాగా హైలెట్ చేసి.. కూటమిలో ఏదో ఒక చిచ్చు రాజేయాలని చూస్తోంది వైసీపీ అధినాయకత్వం.