అస‌లేంటీ 'హిజ‌బ్‌'? ఇంత‌టి ర‌చ్చ‌కు కార‌ణం ఏంటి? ఫుల్ డీటైల్స్..

Publish Date:Feb 9, 2022

Advertisement

'హిజబ్'.. 'హిజబ్'.. కర్ణాటక రాష్ట్రాన్ని కుదిపేస్తున్న వివాదం ఇది. కర్ణాటక రాష్ట్రం ఉడిపి కళాశాలలో రెండు వర్గాల విద్యార్థుల పోటా పోటీ నినాదాలు.. దాడులు, రాళ్లదాడులు.. విద్యార్థికి కత్తిపోట్లు.. లాఠీచార్జి, బాష్పవాయు ప్రయోగం.. మూడు రోజులు కర్ణాటక వ్యాప్తంగా కళాశాలలు సహా విద్యా సంస్థల మూసివేతకు దారి తీసిన వివాదం హిజబ్! ఇప్పుడు దేశ వ్యాప్తంగా కూడా ప్రకంపనలు పుట్టిస్తోంది. 

హిజబ్ ధరించడం అంటే ముఖాన్ని వస్త్రంతో కప్పుకోవడం. కర్ణాటకలో హిజబ్ ధారణ వివాదం తీవ్రరూపం దాల్చింది. ఆపైన రాజకీయ రంగు కూడా పులుముకుంది. ఒక పక్కన ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ హిజబ్ కు అనుకూలంగా స్పందించారు. తమ మతం విద్యార్థినులు హిజబ్ ధరించి కళాశాలకు వస్తే తప్పేంటంటూ సమర్థించారు. ఇంకో పక్కన హిజబ్ వివాదంపై ప్రముఖ సినీ నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్ స్పందించారు. చదువుకునే విద్యార్థుల మధ్య మత విద్వేషాలు రెచ్చగొడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. కర్ణాటకలోని హిజబ్ వివాడం పొరుగు రాష్ట్రాల వరకు రాకూడదని, తమిళనాడు సహా అందరూ మరింత జాగ్రత్తగా ఉండాలని అన్నారు.

హిజబ్ వివాదం నెల రోజుల క్రితం క‌ర్ణాట‌క రాష్ట్రంలోని ఉడిపిలో ఉన్న‌ పీయూ కాలేజిలో మొదలైంది. హిజబ్ ధరించి కాలేజికి వచ్చిన ఆరుగురు విద్యార్థినులను క్లాసులోకి అనుమతించలేదు. అప్పటి నుంచి వారు కాలేజికి వచ్చి సాయంత్రం వరకు అక్కడే ఉండి తిరిగి వెళ్లిపోతున్నారు. హిజబ్ తీసేస్తేనే కాలేజిలోకి అనుమతిస్తామని ఆ ఆరుగురు విద్యార్థినులకు పాలకమండలి సభ్యుదు, ఎమ్మెల్యే రఘుపతి భట్ చెప్పారు. ఆయన నిర్ణయాన్ని వ్యతిరేకించిన ఆ విద్యార్థినులు హైకోర్టును ఆశ్రయించారు. ఆ తర్వాత హిజబ్ ధరించే విద్యార్థినుల సంఖ్య వేలల్లోకి చేరింది. గతంలో హిజబ్ ధరించని వారు కూడా కొత్త సంప్రదాయానికి తెరలేపారు. బైందూరులో హిజబ్ ధరించి కాలేజికి వచ్చిన విద్యార్థినులను ప్రిన్సిపాల్ లోకిని అనుమతించకుండా అడ్డుకుని, గేటు కూడా మూసివేశారు. దీంతో హిజబ్ వివాదం మరింతగా ముదిరి పాకాన పడింది. 

హిందూ సంఘాలు పోటీగా రంగంలోకి దిగడంతో మ‌రింత ర‌చ్చ రాజుకుంది. హిజబ్ కు వ్యతిరేకంగా కాషాయ కండువాలు, తలపాగాలు ధరించి కొందరు విద్యార్థులు కాలేజిలకు వచ్చారు. అయితే.. అప్పటి వరకు నిరసనలకే పరిమితమైన హిజబ్ వివాదం ఇరు వర్గాల మధ్య మంగళవారం హింసాత్మకంగా మారింది. హిజబ్ కు అనుకూల, వ్యతిరేక విద్యార్థుల ప్రదర్శనలతో ఉడిపి, శివమొగ్గ, భాగల్కోటె, దావరగెరె జిల్లాల్లోని విద్యా సంస్థలు అట్టుడికిపోయాయి. కొడగు జిల్లా కుశాలనగర్ సుందరనగర కాలేజిలో తన స్నేహితురాలికి బలవంతంగా కాషాయం శాలువా వేసేందుకు యత్నించిన విద్యార్థిపై వైరి పక్షం కత్తులతో దాడి చేసి, భుజం, వెన్నుపై గాయాలు చేసింది. ఈ కేసులో విద్యార్థులు విక్కు, ధనును పోలీసులు అరెస్ట్ చేశారు. శివమొగ్గ కాలేజిలో కొందరు విద్యార్థులు జాతీయ జెండాను కిందకు దించేసి కాషాయ జెండా ఎగరేశారు.  దీంతో ఈ వివాదంపై జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది.

కాగా.. హిజబ్ వివాదం వెనుక కొన్ని అదృశ్య శక్తులు ఉన్నాయని, రాజకీయ లబ్ధి కోసమే విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. హిజబ్ అంశం లోక్ సభలో కూడా ప్రతిధ్వనించింది. ఈ అంశంపై కాంగ్రెస్, డీఎంకే, ఐయూఎంఎల్, సీపీఎం, సీపీఐ, వీసికే, ఎండీఎంకే, జేఎంఎం పార్టీల సభ్యులు వాకౌట్ చేశారు. రాజ్యాంగబద్ధమైన తమ హక్కుల కోసం కోర్టులో పోరాడుతున్న తమ మతం విద్యార్థినులు విజయం సాధించాలని ప్రార్థిస్తున్నానని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించారు. విద్యార్థులంతా సంయమనం పాటించాలని కర్ణాటక హైకోర్టు విజ్ఞప్తి చేసింది. హింసాత్మక ఘటనలు జరగడంతో విద్యా సంస్థలకు సీఎం బొమ్మై మూడు రోజులు సెలవులు ప్రకటించారు. హిజబ్ వివాదంపై బాలల హక్కుల కార్యకర్త, నోబెల్ శాంతి బహుమతి విజేత పాకిస్తాన్ కు చెందిన మలాలా యూసఫ్ జాయ్ స్పందించింది. ‘హిజబ్ తో విద్యార్థినులను అనుమతించకపోవడం భయానక చర్య. మహిళల పట్ల వివక్ష కొనసాగుతోందని, ముస్లింమహిళలను చిన్నచూపు చూడడాన్ని భారత నాయకులు ఆపేయాలి’ అని మలాలా ట్వీట్ చేసింది.

కర్ణాటకలో రగిలిన హిజాబ్ వివాదంపై పాకిస్థాన్ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషీ స్పందించారు. ముస్లిం బాలికలను చదువుకోకుండా నిరోధించడం ప్రాథమిక మానవ హక్కుల ఉల్లంఘన అని మండిపడ్డారు. ఈ ప్రాథమిక హక్కును ఎవరైనా నిరాకరించడం, హిజాబ్ ధరించినందుకు వారిని భయభ్రాంతులకు గురి చేయడం కచ్చితంగా అణచివేత అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముస్లింలను ఓ ప్రాంతానికి, వర్గానికి పరిమితం చేయాలనే భారత ప్రభుత్వ పన్నాగంగా దీనిని ప్రపంచం తెలుసుకోవాలన్నారు పాకిస్తాన్ మంత్రి.  

By
en-us Political News

  
హైదరాబాద్‌లో జీహెచ్ఎంసీ మాజీ డిప్యూటీ మేయర్, బోరబండ మాజీ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్‌ను హత్య చేసేందుకు జరిగిన భారీ కుట్రను బోరబండ పోలీసులు భగ్నం చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ పంచాయతీ ఎన్నికల రెండో దశ పోలింగ్ ఉత్సాహంగా కొనసాగుతోంది.
తెలంగాణ ప్రయోజనాలే తమకు పరమావధన్న ఆయన పార్లమెంటులో ఈ ప్రతిపాదనపై చర్చ,  ఓటింగ్ జరిగినప్పుడు తమ పార్టీకి చెందిన ముగ్గురు రాజ్యసభ సభ్యులు అనుకూలంగా ఓటు వేస్తారని వెల్లడించారు.
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులు ఆమోదం పొందితే దేశ రాజకీయాలలో కాంగ్రెస్ ప్రతిష్ఠ బాగా మసకబారుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నాయి. ఇది 2029 సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ గెలుపు అవకాశాలపై నిస్సందేహంగా ప్రతికూల ప్రభావం చూపుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
తొలి విడత పంచాయతీ ఎన్నికలలో  వైసీపీ మద్దతుదారులు కనీసం పాతిక శాతం  స్థానాలను కూడా గెలుచుకోలేకపోయారు. అదే సమయంలో తెలుగదేశం కూటమి మద్దతు ఉన్నఅభ్యర్థులు తిరుగులేని విజయాలతో ప్రభంజనం సృష్టించారు. 
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ బిల్లు ఉద్దేశాలను, ప్రక్రియను  తప్పుబడుతుండగా, ఇండియా కూటమిలోని పలు ప్రాంతీయ పార్టీలో,  సీట్ల వాటా రక్షణ, సవరణల ఆధారంగా తమ వైఖరిని మార్చుకుంటున్న సంకేతాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి.
డీలిమిటేషన్ తో పాటు, మహిళా రిజర్వేషన్ల అమలును తీసుకురావడమే ఈ సమావేశాల నిర్వహన ప్రధాన లక్ష్యంగా కేంద్రంలోని మోడీ సర్కార్ చెబుతున్నప్పటికీ, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ముంగిట ఈ హడావుడి సమావేశాల వెనుక ఉన్న ప్రధాన లక్ష్యం బీజేపీకి రాజకీయ లబ్ధి చూకూర్చడమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
కేంద్రం తాజాగా తీసుకున్న నిర్ణయం మేరకు ఏ   రాష్ట్రంలోనూ  సీట్ల వాటా తగ్గదు, ప్రస్తుత నిష్పత్తిని కాపాడుతూనే అన్ని రాష్ట్రాల్లోనూ సమానంగా స్థానాలు పెరుగుతాయి.  అంతేకాకుండా, 2051 సీట్ల విషయంలో మార్పులు లేకుండా స్తంభనను అమలు చేయడం ద్వారా భవిష్యత్ జనాభా గణాంకాల ఆధారంగా రాష్ట్రాల మధ్య సీట్ల నిష్పత్తి మారకుండా నియంత్రించామని కేంద్రం చెబుతోంది. 
లోక్‌సభ నియోజకవర్గాల సంఖ్యను 50 శాతం పెంచడం వల్ల ఏ రాష్ట్రానికీ నష్టం జరగదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
మాదకద్రవ్యాల మహమ్మారి నుంచి యువతను కాపాడేందుకు చేపట్టిన నషా ముక్త్ భారత్ యాత్రకు ప్రముఖ సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
తమిళనాడులో సంచలనం సృష్టించిన మహిళా ఐఏఎస్ అధికారిణి వేధింపుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన శుక్రవారం (నవంబర్ 27) సాయంత్రం జరిగే  ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశంలో వీరు పాల్గొంటారు. ఈ సమావేశంలో పాల్గొనాల్సిందిగా ప్రధాని నరేంద్రమోడీ ఆహ్వానించడంతో వీరిరువురూ ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు.
మదురై సమీపంలోని తిరుపరంకుండ్రం కొండపై ఉన్న దీపస్తంభం వద్ద శనివారం దీపం వెలిగించాలని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.