ఆసియా కప్ లో టీమ్ ఇండియా x పాకిస్థాన్
Publish Date:Aug 22, 2025
Advertisement
ఆసియా కప్ క్రికెట్ టోర్నమెంట్ దాయాది దేశాల క్రికెట్ జట్ల మధ్య మరో పోరుకు వేదిక కానుంది. త్వరలో జరగనున్న ఆసియా కప్ క్రికెట్ టోర్నీలో భాగంగా టీమ్ ఇండియా, పాకిస్థాన్ జట్ల తలపడను న్నాయి. ఇరు దేశాల మధ్యా సత్సంబంధాలు లేని కారణంగా ఇంత కాలం అంతర్జాతీయ టోర్నీలలో అంటే ఐసీసీ ఈవెంట్లలో తప్ప ఇరు దేశాల మధ్యా ద్వైపాక్షిక మ్యాచ్ లు జరగడం లేదు. ఆయితే అసలు ఇక అంతర్జాతీయ టోర్నీలలో కూడా ఇరు దేశాల జట్లూ తలపడే అవకాశం ఉండదన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. ఔను.. పహల్గాం ఉగ్రదాడి అనంతరం ఇరు దేశాల మధ్యా యుద్ధం తప్పదా అన్న పరిస్థాతి ఏర్పడింది. దాడులు, ప్రతి దాడులూ కూడా జరిగాయి. ఆపరేషన్ సిందూర్ తో భారత్.. పాకిస్థాన్ భూభాగంలోని ఉగ్ర స్థావరాలను అత్యంత కచ్చితత్వంతో ధ్వంసం చేసింది. ఆ తరువాత పాకిస్థాన్ కాళ్లా వేళ్లా పడటంతో కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించింది. ఈ నేపథ్యంలోనే పాకిస్థాన్ తో అన్ని రకాల సంబంధాలనూ తెంచేసుకుంది. ఈ నేపథ్యంలోనే ఆసియా కప్ లో భాగంగా పాకిస్థాన్ తో తలపడాల్సిన పోటీని భారత్ బహిష్కరిస్తుందన్న వార్తలు గట్టిగా వినిపించాయి. రాజకీయపార్టీలు, సామాన్య ప్రజలే కా దు.. క్రికెట్ అభిమానులు సైతం పాకిస్థాన్ తో మ్యాచ్ వద్దంటే వద్దని గట్టిగా డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఆసియా కప్ లో భాగంగా పాకిస్థాన్ తో తలపడాల్సిన మ్యాచ్ ను టీమ్ ఇండియా బహిష్కరించడానికే ఎక్కువ అవకాశాలున్నాయన్న భావన సర్వత్రా వ్యక్తం అయ్యింది. ఈ నేపథ్యంలో భారత క్రీడా మంత్రిత్వ శాఖ తాజాగా చేసిన ప్రకటన భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ విషయంలో క్లారిటీ ఇచ్చింది. పాకిస్థాన్ తో ఎటువంటి క్రీడా సంబంధాలకూ తావులేదని స్పష్టం చేసిన మంత్రిత్వ శాఖ అయితే అంతర్జాతీయ ఇంకా స్పష్టంగా చెప్పాలంటే మల్టీ నేషనల్ ఈవెంట్ల విషయంలో ఈ నేషేధం ఉండదన్న క్లారిటీ ఇచ్చింది. అంటే ఆసియా కప్ లో భాగంగా భారత్, పాకిస్థాన్ జట్లు తలపడేందుకు ఎటువంటి ఆటకం లేదని స్పష్టం చేసింది. దీంతో సెప్టెంబర్ 14న ఆసియా కప్ లో భాగంగా టీమ్ ఇండియా, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది. దీంతో ఈ మ్యాచ్ పట్ల ఇరు దేశాలలోనే కాకుండా.. క్రికెట్ ఆడే దేశాలన్నిటిలోనూ తీవ్ర ఆసక్తి నెలకొంది. టోర్నీ ఏదైనా, వేదిక ఏదైనా భారత్, పాక్ మధ్య మ్యాచ్ అంటే అదో హైటెక్ మ్యాచే. యుద్ధం జరుగుతోందా అన్నంత ఉత్కంఠ నెలకొంటుంది. ప్రపంచ వ్యాప్తంగా భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ పట్ల ఆసక్తి వ్యక్తమౌతుంది. అసలు ఇరు జట్ల మధ్యా మ్యాచ్ ఉందంటేనే అది టోర్నీకే ఒక అదనపు ఆకర్షణగా మారుతుంది.
http://www.teluguone.com/news/content/hivoltage-match-in-asia-cup-tournment-39-204767.html





