Publish Date:Aug 22, 2025
ఆసియా కప్ క్రికెట్ టోర్నమెంట్ దాయాది దేశాల క్రికెట్ జట్ల మధ్య మరో పోరుకు వేదిక కానుంది. త్వరలో జరగనున్న ఆసియా కప్ క్రికెట్ టోర్నీలో భాగంగా టీమ్ ఇండియా, పాకిస్థాన్ జట్ల తలపడను న్నాయి. ఇరు దేశాల మధ్యా సత్సంబంధాలు లేని కారణంగా ఇంత కాలం అంతర్జాతీయ టోర్నీలలో అంటే ఐసీసీ ఈవెంట్లలో తప్ప ఇరు దేశాల మధ్యా ద్వైపాక్షిక మ్యాచ్ లు జరగడం లేదు. ఆయితే అసలు ఇక అంతర్జాతీయ టోర్నీలలో కూడా ఇరు దేశాల జట్లూ తలపడే అవకాశం ఉండదన్నట్లుగా పరిస్థితి మారిపోయింది.
ఔను.. పహల్గాం ఉగ్రదాడి అనంతరం ఇరు దేశాల మధ్యా యుద్ధం తప్పదా అన్న పరిస్థాతి ఏర్పడింది. దాడులు, ప్రతి దాడులూ కూడా జరిగాయి. ఆపరేషన్ సిందూర్ తో భారత్.. పాకిస్థాన్ భూభాగంలోని ఉగ్ర స్థావరాలను అత్యంత కచ్చితత్వంతో ధ్వంసం చేసింది. ఆ తరువాత పాకిస్థాన్ కాళ్లా వేళ్లా పడటంతో కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించింది. ఈ నేపథ్యంలోనే పాకిస్థాన్ తో అన్ని రకాల సంబంధాలనూ తెంచేసుకుంది. ఈ నేపథ్యంలోనే ఆసియా కప్ లో భాగంగా పాకిస్థాన్ తో తలపడాల్సిన పోటీని భారత్ బహిష్కరిస్తుందన్న వార్తలు గట్టిగా వినిపించాయి. రాజకీయపార్టీలు, సామాన్య ప్రజలే కా దు.. క్రికెట్ అభిమానులు సైతం పాకిస్థాన్ తో మ్యాచ్ వద్దంటే వద్దని గట్టిగా డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఆసియా కప్ లో భాగంగా పాకిస్థాన్ తో తలపడాల్సిన మ్యాచ్ ను టీమ్ ఇండియా బహిష్కరించడానికే ఎక్కువ అవకాశాలున్నాయన్న భావన సర్వత్రా వ్యక్తం అయ్యింది.
ఈ నేపథ్యంలో భారత క్రీడా మంత్రిత్వ శాఖ తాజాగా చేసిన ప్రకటన భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ విషయంలో క్లారిటీ ఇచ్చింది. పాకిస్థాన్ తో ఎటువంటి క్రీడా సంబంధాలకూ తావులేదని స్పష్టం చేసిన మంత్రిత్వ శాఖ అయితే అంతర్జాతీయ ఇంకా స్పష్టంగా చెప్పాలంటే మల్టీ నేషనల్ ఈవెంట్ల విషయంలో ఈ నేషేధం ఉండదన్న క్లారిటీ ఇచ్చింది.
అంటే ఆసియా కప్ లో భాగంగా భారత్, పాకిస్థాన్ జట్లు తలపడేందుకు ఎటువంటి ఆటకం లేదని స్పష్టం చేసింది. దీంతో సెప్టెంబర్ 14న ఆసియా కప్ లో భాగంగా టీమ్ ఇండియా, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది. దీంతో ఈ మ్యాచ్ పట్ల ఇరు దేశాలలోనే కాకుండా.. క్రికెట్ ఆడే దేశాలన్నిటిలోనూ తీవ్ర ఆసక్తి నెలకొంది. టోర్నీ ఏదైనా, వేదిక ఏదైనా భారత్, పాక్ మధ్య మ్యాచ్ అంటే అదో హైటెక్ మ్యాచే. యుద్ధం జరుగుతోందా అన్నంత ఉత్కంఠ నెలకొంటుంది. ప్రపంచ వ్యాప్తంగా భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ పట్ల ఆసక్తి వ్యక్తమౌతుంది. అసలు ఇరు జట్ల మధ్యా మ్యాచ్ ఉందంటేనే అది టోర్నీకే ఒక అదనపు ఆకర్షణగా మారుతుంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/hivoltage-match-in-asia-cup-tournment-25-204768.html
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద, పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.