అమరావతి 12వ శతాబ్దపు రాజధాని చరిత్ర!

Publish Date:Jun 24, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ నవ్యాంధ్ర రాజధాని అమరావతి ప్రాంతానికి వేల సంవత్సరాల  చరిత్ర ఉంది. కేవలం ఆధునిక కాలంలోనే కాకుండా, శతాబ్దాల క్రితమే ఈ ప్రాంతం ప్రముఖ రాజధానిగా, సాంస్కృతిక కేంద్రంగా వర్ధిల్లింది. ఈ నేపథ్యంలో 12వ శతాబ్దంలో అమరావతి రాజధాని చరిత్ర, నాటి భౌగోళిక పరిస్థితులు,   ప్రాచీన శాసనాల వెనుక దాగున్న అద్భుతమైన నిజాలను ప్రముఖ చరిత్ర పరిశోధకుడు శివశంకర్ గారు తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వివరించారు.  

చరిత్ర అనేది కేవలం డిగ్రీలు, పిహెచ్‌డిలు చేసిన మేధావుల గ్రంథాల్లోనే కాదు, లోకాన్ని చదివిన సామాన్యుల అన్వేషణలోనూ దాగి ఉంటుందని నిరూపిస్తున్నారు శివశంకర్ . పట్టుమని పదో తరగతి కూడా చదవకపోయినా, మన భౌగోళిక పరిస్థితులు, చారిత్రక శాసనాలు, ప్రాచీన ఆధారాలపై ఆయన సాధించిన పట్టు అసాధారణమైనది. ఆయన రాసిన "గుంటూరు జిల్లా అదృశ్య గ్రామాలు" అనే పరిశోధనా గ్రంథం చరిత్రకారులనే ఆశ్చర్యపరుస్తోంది. ఒక సాదాసీదా వ్యక్తి దశాబ్దాల పాటు తన సొంత సమయాన్ని, డబ్బును పణంగా పెట్టి, మరుగున పడిపోయిన గుంటూరు, అమరావతి ప్రాంతాల 12వ శతాబ్దపు రాజధాని వైభవాన్ని శాసనాల ఆధారంగా వెలికితీయడం ఒక అద్భుతమైన చారిత్రక యాత్ర.  గుంటూరు జిల్లా పరిసర ప్రాంతాల్లోని అదృశ్య గ్రామాలు, ప్రాచీన శాసనాలపై ఆయన దశాబ్దాలుగా సాగించిన పరిశోధనలు నేటి విద్యావంతులను సైతం విస్మయపరుస్తున్నాయి. 

పిహెచ్‌డిలు, డాక్టరేట్లు చేసిన వారు కూడా తాకని ఎన్నో అరుదైన చారిత్రక అంశాలను ఆయన సేకరించారు. నాటి కాలంలో గుంటూరు, విజయవాడ,   అమరావతి పరివాహక ప్రాంతాల భౌగోళిక విస్తరణ ఏ విధంగా ఉండేదో శివశంకర్   ఆధారాలతో సహా వివరించారు. ముఖ్యంగా గుంటూరు జిల్లాలోని వివిధ చారిత్రక ప్రస్థానాలు, శాసనాల ప్రాధాన్యతను ఆయన గుర్తు చేశారు. ఎంతో మంది రాజకీయ ప్రముఖులు, సెలబ్రిటీలతో పోల్చితే..  ఇలాంటి ఒక అసాధరణ మేధస్సు కలిగిన వ్యక్తిశివశంకర్.  12వ శతాబ్దంలోనే కాకుండా, శతాబ్దాల కాలంగా ఈ ప్రాంతం ఎలా పరిణామం చెందిందనే విషయాలను ఆయన కళ్ళకు కట్టినట్లు వివరిస్తున్నారు. విజయవాడ, రాజమండ్రి, శ్రీకాకుళం వంటి చారిత్రక నగరాల వరుసలోనే గుంటూరు కూడా ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. అమరావతి ప్రాంతం 12వ శతాబ్దంలో ఒక వెలుగు వెలిగిన రాజధానిగా ఎలా ఉండేదో, ఆ కాలపు రాజకీయ, సామాజిక పరిస్థితులు ఎలాంటివో శాసనాల సాక్షిగా ఈ పరిశోధన ద్వారా స్పష్టమవుతోంది.

ఈ ప్రాంత విద్యా సాంస్కృతిక చరిత్రను ప్రస్తావిస్తూ, 1920లలోనే గుంటూరు జిల్లా నుండి దాదాపు 50 మందికి పైగా లండన్, ఐర్లాండ్ వంటి విదేశాలకు వెళ్లి ఉన్నత విద్యను అభ్యసించారు. మిగిలిన జిల్లాలతో పోలిస్తే ఈ ప్రాంతంలో విదేశీ విద్య, సామాజిక చైతన్యం చాలా ముందే ప్రారంభమైందని చెప్పడానికి ఇదొక బలమైన నిదర్శనమన్నారు శివశంకర్.

సొంతంగా చిన్న ఉపాధి మార్గాన్ని వెతుక్కుంటూనే..  మరోపక్క చరిత్రపై ఉన్న అపారమైన జిజ్ఞాసతో శివశంకర్  పరిశోధనలు సాగించారు. ఎంతో సమయాన్ని, సొంత డబ్బును వెచ్చించి,  ప్రాచీన ఆధారాలు, శాసనాలను ప్రజల ముందుకు తీసుకురావడానికి ఆయన నిరంతరం కృషి చేస్తున్నారు.

చరిత్రను కేవలం పుస్తకాల్లోనే కాకుండా భౌగోళిక ఆధారాలతో సహా నిరూపించడానికి శివశంకర్   అందించిన ఈ చారిత్రక ఆధారాలు రాబోయే తరాలకు ఎంతో ఉపయోగపడతాయనడంలో సందేహంలేదు. ఇలాంటి నిష్ణాతులను ప్రభుత్వం మరియు సమాజం ఎంతగానో ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది.

By
en-us Political News

  
ఇరాన్ మాజీ అత్యున్నత నాయకుడు (సుప్రీం లీడర్) అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల క్రతువుకు సంబంధించి అంతర్జాతీయంగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
సోషల్ మీడియా దిగ్గజం మెటా యాజమాన్యంలోని ప్రముఖ ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌పై భారత ప్రభుత్వం అత్యంత తీవ్రమైన చర్యకు ఉపక్రమించింది.
రాష్ట్ర పోలీసు శాఖ పని తీరును మరింత ప్రజలకు చేరువ చేసే దిశగా డీజీపీ ఆనంద్ కీలక ఆదేశాలు జారీ చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజధాని అంశం మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
పారిశ్రామికాభివృద్ధి, ఉపాధి కల్పన, స్థానిక ఆర్థిక వ్యవస్థ బలోపేతం లక్ష్యంగా కుప్పం నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాల
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ జరిగి దశాబ్ద కాలం దాటినా, రాష్ట్రానికి ఒక శాశ్వతమైన, తిరుగులేని రాజధానిని నిర్మించుకోలేకపోవడం తెలుగు జాతి దురదృష్టం.
ఆంధ్రప్రదేశ్‌లోని మామిడి సాగుదారులకు కేంద్ర ప్రభుత్వం ఒక తీపి కబురు అందించింది.
కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానంతరం భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో స్వీకరించే శ్రీవారి లడ్డూ ప్రసాదం విక్రయాలు ఈ ఏడాది జూన్ నెలలో రికార్డు స్థాయికి చేరుకున్నాయి.
ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ రాజకీయ దుమారం రేపుతోంది.
శ్రీ వకుళామాత సన్నిధిలో శాస్త్రోక్తంగా ప్రారంభమైన ‘అక్షర గోవిందం – అన్నప్రాశనం’..
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫాల్కన్ పోంజీ స్కామ్ కేసులో ఎన్‌ఫోర్స్‌ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరో కీలక ముందడుగు వేసింది.
దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్ హత్య కేసులో ప్రధాన నిందితురాలు సోనమ్ రఘువంశీకి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది.
లింగంపల్లి పసికందు కిడ్నాప్ కేసును చందానగర్ పోలీసులు ఛేదించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.