Publish Date:Aug 28, 2025
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రాష్ట్రప్రగతికి విషయంలో ఏ ఒక్క అవకాశాన్నీ వదలడం లేదు. అలాగే అవకాశాలను అందిపుచ్చుకోవడంలో, పెట్టుబడులను ఆకర్షించడంలో అనితర సాధ్యమన్న రీతిలో ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన సొంత నియోజకవర్గమైన కుప్పానికి భారీ పెట్టుబడితో హిందాల్కో సంస్థ రానున్నది.
అది ఇలాంటి అలాంటి ప్రాజెక్టుతో కాదు. ఏకంగా ఐ ఫోన్ విడిభాగాల తయారీలో కీలకం అయిన ఇంటిగ్రేటెడ్ అల్యూమినియం ఎక్స్ ట్రేషన్ ఫెసిలిటీని కుప్పంలో ఏర్పాటు చేయడానికి హిందాల్కో ఇండస్ట్రీస్ ముందుకు వచ్చింది. కుప్పంలో హిందాల్కో ఉత్పత్తి చేసే అల్యూమినియంను ఐఫోన్ విడి భాగాల తయారీకి ముడి సరుకుగా సరఫరా చేయడమే లక్ష్యం.ఇందు కోసం హిందాల్కో కుప్పంలో ₹586 కోట్ల పెట్టుబడితో సంస్థను ఏర్పాటు చేయనుంది. ఐఫోన్ విడిభాగాల తయారీకి ముడి సరుకు సరఫరా యూనిట్ ఏర్పాటుతో కుప్పం యాపిల్ ఐఫోన్ తయారీ చైన్ లో భాగం కానుంది.
కుప్పంలో హిందాల్కో ప్రాజెక్టు నకు రాష్ట్ర పెట్టుబడి ప్రమోషన్ బోర్డు (ఎస్ఐపీబీ) అతి త్వరలో ఆమోదిస్తుందని అంటున్నారు. ఈ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక చరిత్రలో ఒక మైలురాయి అవుతుందనడంలో సందేహం లేదంటున్నారు అధికారులు. ఈ భారీ ప్రాజెక్టుకు ఆ సంస్ధ కుప్పంనే ఎన్నుకోవడానికి అది ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కావడమే కాకుండా.. బెంగళూరు, చెన్నై మెట్రో నగరాలకు సమీపంగా ఉండటం కూడా ఒక కారణం. అన్నీ అనుకున్నట్లు జరిగితే.. ఈ ప్రాజెక్టు 2027 నాటికి సాకారం అవుతుంది. అంతే కాదు ప్రత్యక్షంగా వేయి మందికి ఉద్యోగ అవకాశాలను కల్పిస్తుందని చెబుతున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/hindalco-project-to-kuppam-39-205165.html
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు.
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది.
ధనుష్ తన కొత్త రాజకీయ పార్టీ కోసం తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి.