వల్లభనేని వంశీ ఎన్నికపై హైకోర్టు విచారణ

Publish Date:Nov 1, 2022

Advertisement

కృష్ణాజిల్లా గన్నవారం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఎన్నికపై దాఖలైన పిటిషన్ పై హైకోర్టు విచారణ జరిగింది. వకాలత్ దాఖలు చేశామని కౌంటర్ వేలయడానికి సమయం కావాలని ఎమ్మెల్యే తరఫు న్యాయ వాది కోరారు. పిటిషన్లో ప్రతివాదులు పలువురికి మరోసారి నోటీసులు జారీ చేసింది. మరికొం దరికి పత్రికా ప్రకటన ద్వారా నోటీసులు ఇచ్చేందుకు అనుబంధ పిటిషన్‌ దాఖలు చేయడానికి పిటిష నర్‌ తరఫు లాయర్‌కు అనుమతిచ్చింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది హైకోర్టు.

గన్నవరం ఎమ్మెల్యే వంశీ ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ వైఎస్సార్‌సీపీ నుంచి పోటీ చేసిన యార్ల గడ్డ వెంకటరావు 2019 జులైలో హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. వంశీ ఓటర్లను ప్రలోభపెట్టడానికి అక్రమాలకు పాల్పడ్డారన్నారు. ఎన్నికల ప్రచారంలో వంశీ సూచనతో తహసీల్దార్‌ సంతకంతో ఇళ్ల స్థలాల నకిలీ పట్టాలు పంపిణీ లెక్కింపు ప్రక్రియ చట్టవిరుద్ధంగా జరగడం తో స్వల్ప తేడాతో ఓడిపోయానని పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై విచారణ కొనసాగుతోంది. 

2019 ఎన్నికల్లో గన్నవరం నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా వంశీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్య ర్థిగా యార్లగడ్డ వెంకట్రావు పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో వంశీ విజయం సాధించారు. అయితే, ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడి వంశీ గెలుపొందాడని, ఆయన ఎన్నికను రద్దు చేయాలంటూ యార్లగడ్డ వెంకట్రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బాపుల‌పాడులో ఎమ్మార్వో స్టాంపు ఫోర్జరీ చేసి.. 12 వేల న‌కిలీ ఇళ్ల ప‌ట్టాల‌ను తన అనుచరులకు వంశీ పంచారని యార్లగడ్డ వెంక ట్రావు పిటి షన్‌లో పేర్కొన్నారు. అలాగే, ప్రసాదంపాడు పోలింగ్ బూత్‌లో రిగ్గింగ్ చేసిన‌ట్లు వల్లభనేని వంశీపై పోలీసులు కేసు కూడా నమోదు చేశారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

By
en-us Political News

  
దేశ రక్షణ రంగంలో అత్యంత కలకలం రేపిన ఉదంతం వెలుగులోకి వచ్చింది.
సినిమా తరహాలో పక్కా ప్లాన్ వేశాడు.. పోలీసులకు ఎలాంటి ఆధారాలు దొరకవని భావించాడు.. కానీ చివరకు చేసిన చిన్న పొరపాటే అతడిని పోలీసులకు పట్టించింది.
అంతర్జాతీయ విమానయాన రంగంలో కలకలం సృష్టించిన ఫ్లైదుబాయ్ విమాన హైజాక్ యత్నం కేసులో విచారణ వేగవంతం కాగా, ఊహించని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
దేశం కోసం ప్రాణాలర్పించిన ఓ వీర జవాన్ కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది.
ఆశిష్ అనే యువకుడు జొమాటో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు
హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల కేసు.. దర్యాప్తు ముమ్మరం.!
ఆంధ్రప్రదేశ్‌లో పేదల సొంతింటి కలను సాకారం చేసే దిశగా కూటమి ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది
చిన్నారి జీవితాన్ని విషాదంగా మార్చిన బిస్కెట్.!
ఆకాశంలో ఓ పక్షి.. విమానంలో వందలాది మంది ప్రయాణికులు.. క్షణాల్లో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ! శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇండిగో విమానానికి పక్షి ఢీకొట్టినట్లు అనుమానం
న్యాయవాది ఖాజా మొయిజుద్దీన్ హత్య కేసు మరోసారి చర్చనీయాంశంగా మారింది.
అమెరికాలో మరోసారి విషాదం చోటుచేసుకుంది. ఉపాధి కోసం అగ్రరాజ్యానికి వెళ్లిన తెలంగాణకు చెందిన ఓ మహిళ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.
భారత పైలట్ చెప్పిన షాకింగ్ నిజాలు..!
ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తన చందాదారులను ఆకట్టుకునేందుకు మరో వినూత్నమైన ఆఫర్‌ను ముందుకు తెచ్చింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.