హైడ్రాపై వెనక్కి తగ్గేది లేదు.. హైకోర్టు ఆదేశాలను గౌరవిస్తాం : సీఎం రేవంత్

Publish Date:Jul 28, 2026

Advertisement

 

హైడ్రా కమిషనర్ నియామకానికి సంబంధించి హైకోర్టు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. హైకోర్టు తీర్పును ఇంకా పూర్తిగా పరిశీలించలేదని, ప్రభుత్వం తరఫున న్యాయ నిపుణులతో కలిసి ఆదే శాలను సమగ్రంగా అధ్యయనం చేసిన తర్వాత తదుపరి నిర్ణయం తీసుకుంటామని సీఎం వెల్లడించారు. న్యాయస్థానాలపై తమ ప్రభుత్వానికి సంపూర్ణ గౌరవం, విశ్వాసం ఉందని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో కొందరు కావాలనే డబ్బులు ఖర్చు చేసి ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ముఖ్యమంత్రి ఆరోపించారు. అలాంటి ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని కోరారు. 

ప్రభుత్వం చేపడుతున్న ప్రతి కార్యక్రమం ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని అమలు చేస్తున్నామని, హైడ్రా విషయంలో కూడా ప్రభుత్వానికి స్పష్టమైన కార్యాచరణ ఉందని తెలిపారు. హైడ్రా తమ ప్రభుత్వం తీసుకువచ్చిన అత్యంత కీలకమైన సంస్కరణల్లో ఒకటని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొ న్నారు. ఆక్రమణలను తొలగించడం, చెరువులు, కుంటలు, నాలాలు వంటి జలవ నరులను పరిరక్షించడం, నగరంలో వరదల సమస్యను తగ్గించడం వంటి లక్ష్యాలతో హైడ్రా సమర్థవంతంగా పనిచే స్తోందని అన్నారు. ఇప్పటివరకు అనేక చెరువులు, నాలాలు ఆక్రమణల నుంచి విముక్తి పొందాయని, ప్రజల నుంచి కూడా మంచి స్పందన లభించిందని చెప్పారు.

హైడ్రా కమిషనర్ నియామకం విషయంలో ఎవరిని అధికారిగా నియమించాలనేది పూర్తిగా ప్రభుత్వ విచక్షణాధికారంలో భాగమని సీఎం స్పష్టం చేశారు. ఆ అధికారాన్ని ప్రభుత్వం నుంచి ఎవరూ హరించలేరని వ్యాఖ్యా నించారు. కోర్టుల తీర్పులను గౌరవిస్తూ,అవసరమైతే చట్టపరంగా తమ వాద నలు వినిపిస్తామని తెలిపారు. హైడ్రా దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్న సంస్థగా గుర్తింపు పొందిందని, భవిష్యత్తులో ఈ సంస్థను మరింత బలోపేతం చేసి ప్రజా ప్రయోజనాల కోసం మరింత సమర్థవంతంగా పనిచేసేలా చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. హైడ్రా చేపడుతున్న కార్యక్రమాలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగవని, ప్రభుత్వ సంకల్పం యథా విధిగా కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.

High Court verdict on Hydra, CM Revanth reddy, Hydra Commissioner Ranganath,  Telangana Goverment, GHMC, BRS Party 

By
en-us Political News

  
ఖనిజాల నిధిగా పిలిచే మన నేల పొట్టలో అపారమైన ప్రాకృతిక సంపద దాగి ఉంది.
దేశంలో కరెన్సీ వ్యవస్థను మరింత ఆధునికీకరించే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
భార్య ప్రాణాలు పోతుంటే వీడియో కాల్‌లో చూపించిన కసాయి భర్త..!
తెలంగాణకు 11.56 లక్షల ఇళ్లు కేటాయించాలని వినతి..!
జింబాబ్వేపై 3-0తో సాధించిన క్లీన్ స్వీప్ భారత క్రికెట్ అభిమానుల్లో కొత్త జోష్ నింపింది. అశోక్ శర్మ, యశ్ ఠాకూర్ లాంటి డెబ్యూటెంట్లలో కాన్ఫిడెన్స్ నింపి, వారి నుంచి అద్భుత ప్రదర్శన రాబట్టిన వెరీ వెరీ స్పెషల్ వీవీవీఎస్ లక్ష్మణ్ ప్రశాంతత, విజన్ క్రికెట్ అభిమానుల మనస్సులను హత్తుకుంది.
ఆధార్ కోసం తిరిగి తిరిగి ఆలసి.. కలెక్టరేట్‌లో ఆత్మహత్యాయత్నం..!
కిరాణా దుకాణం నడుపుతూ బయటకు సాధారణ వ్యాపారిలా కనిపించిన ఇద్దరు వ్యక్తులు
అమెరికా కలలతో సుదూర తీరాలకు వెళ్లిన ఒక కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
నేడు పోలీసుల ఎదుట విచారణకు హాజరుకానున్న ట్రైనీ ఐపీఎస్..!
ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే.. ఫేస్‌బుక్ పోస్ట్ వేదిక నుంచి ఆ వీడియో అదృశ్యమైంది. కంటెంట్ నిబంధనలను ఉల్లంఘించిందనో లేదా చట్టపరమైన అభ్యంతరంఉందనో ఉందనో చూపే సందేశం ఆ వీడియో క్లిక్ చేస్తే రావడం వినియోగదారులను విస్మయానికి గురి చేసింది.
కృష్ణా నది ఎగువ ప్రాంతాలైన మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జూరాల ప్రాజెక్టుకు వరద ఉద్ధృతి పెరిగి ప్రాజెక్టు జలకళ సంతరించుకుంది. జూరాల ప్రాజెక్టుకు 32వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతోంది.
ముందస్తు బెయిల్ కోరుతూ దాఖలైన పిటిషన్‌పై జస్టిస్ వై. లక్ష్మణరావు నేతృత్వంలోని న్యాయస్థానం విచారణ జరిపి.. తమ్మినేని కుమారుడిపై నమోదైన అభియోగాలు తీవ్రమైనవని పేర్కొంటూ ముందస్తు బెయిలు నిరాకరించింది. కాగా ఇదే కేసులో నిందితులుగా ఉన్న తమ్మినేని సీతారాం, ఆయన భార్య వాణిశ్రీ లకు మాత్రం ముందస్తు బెయిల్ మంజూరుర చేసింది.
ఒకవైపు మంచినీటి కొరతతో జనం అల్లల్లాడుతుంటే.. మరోవైపు పది రోజులుగా నీరు వృధాగా పారుతున్నా అధికారులు పట్టించుకోకపోవడాన్ని ప్రజలు విమర్శిస్తున్నారు. శివారెడ్డి పల్లి గేట్ ప్రాంతంలో పైప్‌లైన్ లీకేజీ కారణంగా గ్రామంలోని పలు కాలనీ వాసులకు మంచినీటి సరఫరా నిలిచిపోయింది. తాగునీటి కోసం మహిళలు, గ్రామస్థులు కిలోమీటర్ల కొద్దీ దూరంలో ఉన్న వ్యవసాయ బావులు, బోర్‌వెళ్ల వద్దకు కాలినడకన వెళ్లి నీటిని తెచ్చుకోవాల్సి దుస్థితి ఏర్పడింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.