‘ధరణి’కి బ్రేకులు..

Publish Date:Nov 3, 2020

Advertisement

కేసీఆర్ దూకుడుకు కోర్టు స్టే

 

పాపం గ్లోబరీనా కంపెనీ

 

కోర్టుకెళ్లిన బీజేపీ నేత కరుణాకర్

 

తెలంగాణలో ఆస్తుల వివరాలకు సంబంధించి... కేసీఆర్ సర్కారు రూపొందించిన ధరణి దూకుడుకు, పోర్టల్‌కు హైకోర్టు బ్రేకులు వేసింది. వ్యవసాయేతర ఆస్తుల వివరాల నమోదుపై స్టే విధించింది. అసలు ఒక ప్రైవేటు సంస్థకు, ఆస్తుల వివరాలు ఎలా ఇస్తారన్న ప్రశ్నలు ఈ పోర్టల్ ప్రారంభం నుంచే మొదలయ్యాయి. పైగా పాలకులతో సన్నిహిత సంబంధాలున్న గ్లోబరీనా సంస్థకు, ఈ సైట్ నిర్వహణ అప్పగించారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో.. ధరణి పోర్టల్‌పై తెలంగాణ హైకోర్టు స్టే విధించడంతో, పాపం గ్లోబరీనా నిరాశ చెందాల్సి వచ్చింది.

 

అంతా ఆందోళన చెందినట్లే.. హైకోర్టు కూడా ధరణి పోర్టల్ భ ద్రతపై ఆందోళన, సందేహాలు వ్యక్తం చేయడం విశేషం. గూగుల్ ప్లేస్టోర్ నుంచి ధరణిని డౌన్‌లోడ్ చేసుకునే సందర్భంలో.. అచ్చం అలాంటి మరో నాలుగు యాప్స్ ఉన్నందున, పౌరులు ఏది అసలైన యాప్ అన్నది గుర్తించడం కష్టమని కోర్టు వ్యాఖ్యానించింది. అసలు ధరణి యాప్‌పై అనుసరిస్తున్న భద్రతా ప్రమాణాలేమిటో చె ప్పాలని ఆదేశించింది. ఇప్పటివరకూ సేకరించిన వివరాలు ఎవరికీ ఇవ్వవద్దని ఆదేశించింది.

 

ధరణి ఏర్పాటు ప్రక్రియపై,  హైకోర్టు చేసిన వ్యాఖ్యలు పరిశీలిస్తే.. దానిపై ప్రజలకున్న సందేహాలను, న్యాయస్థానం గుర్తించినట్లు స్పష్టమవుతోంది. అసలు ఏ చట్టం ప్రకారం ఆధార్, కులం వివరాలు సేకరిస్తున్నారని నిలదీసింది. వ్యక్తిగత వివరాలకు ఎలా భద్రత కల్పిస్తారని ప్రశ్నించింది. కొత్త రె విన్యూ చట్టంలో, వ్యవసాయేతర భూముల ప్రస్తావన ఎక్కడ ఉందని సూటిగా ప్రశ్నించింది. అందులో డేటా భద్రత ప్రస్తావనే లేదని గుర్తు చేసింది. అసలు దానికి ఉన్న చట్టబద్ధత-డేటా.. భద్రత వివరాలు ఇవ్వాలని ఆదేశించింది.

 

నిజానికి ధరణి పోర్టల్ ప్రక్రియ ప్రారంభం నుంచే, దానిపై రాజకీయ పార్టీలు-ప్రజల్లో సందేహాలు, ఆందోళన మొదలయింది. తమ ఆస్తుల వివరాలు ఎందుకివ్వాలన్న ప్రశ్న, ప్రజల నుంచి వ్యక్తమయింది. పైగా అసలు ధరణి పోర్టల్ ప్రభుత్వానిదా? ప్రైవేటు సంస్థదా? వివరాలు ఇవ్వాలని ఏ శాఖ నుంచి ఆదేశాలు వచ్చాయన్న ప్రశ్నలకు, ఇప్పటివరకూ ఏ ఒక్క శాఖ సమాధానం ఇవ్వలేదు. పైగా ఒకరిపై మరొకరు బాధ్యత నెట్టేసుకున్నాయి. దానితో జనంలో ఆందోళన మరింత పెరిగింది.

 

పైగా దాని నిర్వహణ గ్లోబరీనా సంస్థకు అప్పగించారన్న వార్తలు, ప్రజలను మరింత ఆందోళనకు గురిచేశాయి. గతంలో ఇంటర్ మూల్యాంకన బాధ్యత తీసుకున్న సదరు సంస్థ తప్పిదాల వల్ల, తెలంగాణలో 25 మంది విద్యార్ధులు ఆత్మహత్య చేసుకున్నారు. దానితో ఆగ్రిహ ంచిన తలిదండ్రులు, ఇంటర్ కార్యాలయాన్ని విడతల వారీగా ముట్టడించడం తెలిసిందే. మళ్లీ ఇప్పుడు అదే సంస్థ చేతికి ధరణి పోర్టల్ నిర్వహణ అప్పగించడం ప్రజల ఆందోళనకు కారణమయింది. సదరు సంస్థ యజమాని, సర్కారుకు దగ్గరివారిగా పేరుంది.

 

తాజాగా  హైకోర్టు ఇచ్చిన స్టేతో,  ప్రజలు ఊరట చెందారు. దీనిపై  ప్రజాందోళనను తొలుత గుర్తించి, న్యాయపోరాటం చేసిన ఘనత బీజేపీకే దక్కుతుంది. ఈ ప్రక్రియ ప్రారంభం కాకముందే, బీజేపీ సీనియర్ నేత జి.ఆర్.కరుణాకర్.. ప్రజల్లో నెలకొన్న సందేహాలపై కోర్టుకెళ్లారు. అయినా, ప్రభుత్వం పోర్టల్‌ను ప్రారంభించింది.

 

‘అసలు ధరణి పోర్టల్ అనేది ప్రభుత్వానిదా? ప్రైవేటుదా? ఒకవేళ ప్రభుత్వానిదయితే, ఏ శాఖ నుంచి ఆమేరకు ఉత్తర్వులొచ్చాయి? ఒకవేళ ప్రభుత్వం కాకుండా, ప్రైవేటు సంస్థ దానిని నిర్వహిస్తే, పౌరుల వ్యక్తిగత భద్రత, గోప్యతకు భంగం కలిగితే, దానికి బాధ్యత ఎవరు వహిస్తారు? అంటే కేసీఆర్ ఏది చెబితే అది చట్టమయిపోతుందా? అధికారులు వాస్తవాలు చెప్పరా? వారి మెదళ్లు ఏమైపోయాయి? ఒక ప్రైవేటు సంస్థకు ఆస్తుల వివరాలు ప్రజలు ఎందుకు ఇవ్వాలని అధికారులు చెప్పలేరా?  ధరణిపై కోర్టు స్టే ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నాం’ అని,  కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన బీజేపీ సీనియర్ నేత జి.ఆర్.కరుణాకర్ వ్యాఖ్యానించారు.  విచిత్రంగా.. సీఎస్ స్వయంగా హాజరయిన సెంటర్‌లోనే,  తొలిరోజు పోర్టల్ మొరాయించిన వైనంపై విమర్శలు వెల్లువెత్తాయి.

-మార్తి సుబ్రహ్మణ్యం

By
en-us Political News

  
ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా సోనమ్ వాంగ్ చుక్ నిరవధిక నిరశన సాగుతోంది. గత 20 రోజులుగా ఆయన నిరాహార దీక్ష చేస్తుండటంతో.. ఆరోగ్య పరిస్థితి క్రమంగా క్షీణిస్తోందని వైద్య వర్గాలు తెలిపాయి. ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో, దేశవ్యాప్తంగా ప్రజల్లో, సామాజిక మాధ్యమాల్లోఆయనకు మద్దతు అనూహ్యంగా పెరిగింది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోనమ్ వాంగ్ చుక్ తో భేటీకి హస్తిన పర్యటనకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. నేడో రేపో రేవంత్ రెడ్డి దిల్లీకి చేరుకుని, జంతర్ మంతర్ వద్ద దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్‌చుక్‌ను స్వయంగా కలిసి సంఘీభావం ప్రకటించనున్నారని కాంగ్రెస్ లో అత్యంత విశ్వసనీయవర్గాల ద్వారా తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YCP) ప్రస్తుతం తీవ్రమైన వ్యూహాత్మక అయోమయంలో కొట్టుమిట్టాడుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ (తారక్) రాజకీయ అరంగేట్రం గురించిన చర్చ
అమర్ రాజాకు కాలుష్య నియంత్రణ మండలి నిబంధనల పేరుతో నోటీసులు ఇవ్వడం, విద్యుత్ కనెక్షన్లు కట్ చేయడం వంటి చర్యలతో నాటి ప్రభుత్వం ఎలా ఇబ్బందులకు గురి చేసిందో.. పారిశ్రామిక వర్గాలు గుర్తుచేసుకుంటున్నాయి. ఏపీలో పుట్టి పెరిగిన ఒక ప్రతిష్టాత్మక సంస్థ, తన భవిష్యత్తు విస్తరణ, వృద్ధి ప్రస్థానం కోసం రాష్ట్రం దాటి వెళ్లాల్సిరావడంపై సర్వత్రా ఇప్పుడు మరోసారి చర్చ మొదలైంది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారిక డిజిటల్ వేదికగా రూపొందించిన జగన్ 2.0 సూపర్‌యాప్‌ను వైసీపీ అధినేత జగన్‌ గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆవిష్కరించారు.
భీమవరం, కిర్లంపూడి లలో పర్యటించారు. రెండు చోట్లా కూడా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలలో పట్టు నిరూపించుకోవడానికి ఆయన చేపట్టిన ఏ పర్యటన అయినా సరే.. ఉద్రిక్తతలు, గందరగోళం మధ్యే సాగుతున్నాయి.
కిర్లంపూడి పోలీస్ స్టేషన్‌లో ఆయనతో పాటు మరికొందరు  వైసీపీ నేతలపై  పోలీసులు  ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందిని అడ్డుకుని, వారిపై భౌతిక దాడికి దిగారనే ఆరోపణలపై ఈ చర్యలు తీసుకున్నారు. 
రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కౌశిక్ రెడ్డి ఒక ఛాలెంజ్ విసిరారు. కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా నీటిని వెంటనే ఎత్తిపోయాలని, ఆ నీటిని అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మీదుగా ఎల్లంపల్లికి తరలించాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ఆ విధంగా నీటిని ఎత్తిపోసే ప్రక్రియలో అన్నారం లేదా సుందిళ్ల బ్యారేజీలకు ఏవైనా నష్టాలు లేదా ప్రమాదాలు జరిగితే, దానికి పూర్తి బాధ్యత తమదేనన్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్.. ముద్రగడ సమాజానికి చేసిన సేవలను గుర్తించి ఈ గౌరవాన్ని కల్పించాలని నిర్ణయించారు. ఈ మేరకు అంత్యక్రియల ఏర్పాట్లను పర్యవేక్షించాలని, అన్ని రకాల ప్రభుత్వ మర్యాదలు లోటు లేకుండా చూడాలని ఉన్నతాధికారులను ప్రభుత్వం ఆదేశించింది.
ల్పపీడన ప్రభావంతో జులై మూడో వారంలో దేశవ్యాప్తంగా వర్షాలు మళ్లీ ఊపందుకోనున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు మధ్య భారతదేశం, తూర్పు రాష్ట్రాలలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ పేర్కొంది.
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా సాగుతున్న ఈ వినూత్న నిరసన ప్రదర్శనలకు మెల్లిమెల్లిగా జనం ముఖం చాటేస్తున్నారు. పరీక్షల అవకతవకలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా డిమాండ్‌తో ప్రారంభమైన కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం.. ఆరంభంలో లక్షలాది మంది యువతను ఆకర్షించింది. అయితే క్రమక్రమంగా జనాదరణ కోల్పోయి ఇప్పుడు జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న ఆ పార్టీ నిరసనలు తూతూ మంత్రంగా మారాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.