సీడ్ యాక్సిస్ రోడ్డు కేసు.. తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు.!

Publish Date:Jul 21, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ ప్రక్రియలో   కీలకమైన సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణానికి సంబంధించిన న్యాయ వివాదంలో  ఏపీ హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. అమరావతి  రాజధాని నగరాన్ని అనుసంధానించే కీలక  రవాణా మార్గంగా ప్రతిపాదించిన ఈ రహదారి భూసేకరణ వివాదంపై ఏపీ హైకోర్టులో విచారణ ముగిసింది. ఈ కేసులో ఇరువర్గాల వాదనలు  విన్న న్యాయస్థానం    తీర్పును రిజర్వ్ చేసింది. అలాగే..  తుది తీర్పు వెలువడే వరకు వివాదాస్పద భూముల్లో  స్టేటస్ కో  పాటించాలని ఆదేశించింది. 

ఈ  పిటిషన్‌పై  హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ రవీంద్రనాథ్ తిలకరి , జస్టిస్ చింతలపూడి పురుషోత్తంకుమార్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. గుంటూరు జిల్లా పెనుమాక గ్రామానికి చెందిన చోడిశెట్టి నిర్మలత అనే రైతు  అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణం కోసం తన పరిధిలోని భూమిని సేకరించే సమయంలో సంబంధిత అధికారులు చట్టబద్ధమైన నిబంధనలను, భూసేకరణ చట్టాల మార్గదర్శకాలను స పాటించలేదని ఆమె తన పిటిషన్ లో ఆరోపించారు. రైతులకు రాజ్యాంగబద్ధంగా అందాల్సిన హక్కులు,   పరిహార చెల్లింపుల ప్రక్రియలు, భూసేకరణ నోటిఫికేషన్ నిబంధనల అమలులో   లోపాలు జరిగాయని పేర్కొన్నారు. 

ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ దమ్మలపాటి శ్రీనివాస్  వాదనలు వినిపించారు.   రాజధాని   పరిధిలో కీ రవాణా వ్యవస్థకు సీడ్ యాక్సెస్ రోడ్డు వెన్నెముక వంటిదని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. గతంలో కోర్టు విధించిన మధ్యంతర ఉత్తర్వుల వల్ల ఈ కీలక రహదారి నిర్మాణం  నిలిచిపోయిందని, దీనివల్ల   రాజధాని మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టు జాప్యమౌతోందని పేర్కొన్నారు.  విస్తృత ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వెంటనే  మధ్యంతర స్టే   ఎత్తివేయాలని కోరారు. 

ప్రభుత్వం చేపట్టిన భూసేకరణ ప్రక్రియ అంతా చట్టబద్ధంగా, పారదర్శకంగానే సాగిందని అడ్వొకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. పెనుమాక గ్రామ పరిధిలోని వివాదాస్పద భూములకు సంబంధించి చట్ట ప్రకారం అనుసరించాల్సిన అన్ని రకాల ప్రక్రియలను   నెరవేర్చామన్న ఆయన ప్రజా ప్రయోజనాల దృష్ట్యా చేపడుతున్న రహదారి పనులకు ఆటంకం కలగకుండా స్టే తొలగించాలని  కోరారు.  ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు  ధర్మాసనం తీర్పు రిజర్వ్ చేసింది.  

Penumaka Land Acquisition Case, Dammalapati Srinivas AG, Amaravati Capital Roads, AP High Court Status Quo

By
en-us Political News

  
ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య జరిగే ప్రతిష్టాత్మక యాషెస్ టెస్ట్ మ్యాచ్‌కు భారత్ వేదిక కాబోతోందా? చెన్నైలో బిగ్ బాష్ లీగ్ ఓపెనింగ్ మ్యాచ్ తర్వాత క్రికెట్ ఆస్ట్రేలియా సీఈఓ టాడ్ గ్రీన్‌బర్గ్ వెల్లడించిన క్రేజీ ప్లాన్స్, లాజిస్టికల్ సవాళ్ల పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
ఫ్రెంచ్ ఇన్సూరెన్స్ దిగ్గజం బిఎన్‌పి పారిబాస్ కార్డిఫ్, వార్‌బర్గ్ పింకస్ నుండి ఇండియాఫస్ట్ లైఫ్‌లో 26 శాతం వాటాను కొనుగోలు చేసింది. సుమారు ₹10,000 కోట్ల విలువైన ఈ బిగ్ ఇన్సూరెన్స్ డీల్ మరియు బ్యాంక్ ఆఫ్ బరోడా వాటా వివరాలను ఇక్కడ పూర్తిగా తెలుసుకోండి.
ఓపెన్ ఏఐ రక్షణ సరిహద్దులను దాటుకుని హగ్గింగ్ ఫేస్ ప్లాట్‌ఫామ్‌పై మానవ ప్రమేయం లేకుండా దాడి చేసిన ఏఐ మోడల్. సైన్స్ ఫిక్షన్ వంటి ఈ విపరీతమైన సైబర్ దాడి వెనుక ఉన్న పూర్తి వివరాలు మరియు సైబర్ సెక్యూరిటీ నిపుణుల హెచ్చరికల గురించి తెలుసుకోండి.
నెట్‌ఫ్లిక్స్ GenPage , అమెజాన్ ప్రైమ్ వీడియో Lighthouse ప్రాజెక్టులతో AI ఆధారిత హోమ్‌పేజీలను తీసుకువస్తున్నాయి. కానీ యూజర్లు ఈ మార్పులను ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
రింగ్‌కాన్ Gen 3 స్మార్ట్ రింగ్ మార్కెట్లోకి లాంచ్ అయింది. లార్డ్ ఆఫ్ ది రింగ్స్ స్పెషల్ టై ఇన్, 14 రోజుల బ్యాటరీ లైఫ్, సబ్‌స్క్రిప్షన్ ఉచిత హెల్త్ డేటా మరియు ప్రతి 2 సెకన్ల SpO2 ట్రాకింగ్ ఫీచర్లతో $349 ధరకు అందుబాటులో ఉంది. పూర్తి వివరాలు చదవండి.
గూగుల్ డీప్‌మైండ్ సీఈఓ డెమిస్ హసాబిస్ AGI ఆవిష్కరణ మరియు దాని వల్ల రాబోయే తీవ్రమైన సైబర్, న్యూక్లియర్ భద్రతా ముప్పులపై కీలక హెచ్చరికలు చేశారు. AGI మానవాళి భవిష్యత్తును ఎలా మార్చబోతోందో ఈ కథనంలో తెలుసుకోండి.
దక్షిణ కొరియా రూపొందించిన 15,000 TEU అణుశక్తి ఆధారిత కార్గో నౌక డిజైన్‌కు అమెరికన్ బ్యూరో ఆఫ్ షిప్పింగ్ గుర్తింపు లభించింది. జంట మోల్టెన్ సాల్ట్ రియాక్టర్లు MSR మరియు ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ నౌక, సముద్ర వాణిజ్యంలో కార్బన్ ఉద్గారాలను తగ్గించడంలో మరియు రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులు తేవడంలో కీలక పాత్ర పోషించనుంది.
భారత స్టాక్ మార్కెట్లు వరుసగా 5వ రోజు భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్, నిఫ్టీ పతనానికి ట్రంప్ టారిఫ్‌లు, క్రూడ్ ఆయిల్ ధరల పెంపే కారణమా? పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి!
సిద్దిపేటలో అండర్ 13, అండర్ 15 బ్యాడ్మింటన్ టోర్నీని ఎమ్మెల్యే హరీశ్‌రావు ఘనంగా ప్రారంభించారు. సిద్దిపేటను స్పోర్ట్స్ హబ్‌గా మార్చే కల, రూ. 11.50 కోట్ల స్టేడియం నిధుల రద్దుపై ఆయన చేసిన కీలక వ్యాఖ్యలు మీకోసం!
జింబాబ్వేతో జరగనున్న రెండో టీ20లో సిరీస్ చేజిక్కించుకోవాలని టీమిండియా భావిస్తోంది. తుది జట్టులో ఊహించని మార్పులు, వైభవ్ సూర్యవంశీ రికార్డు ఇన్నింగ్స్, పిచ్ నివేదిక మరియు సమగ్ర వివరాలు తెలుసుకోండి.
కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ సమక్షంలో ద్రవాహారం తీసుకుని దీక్ష ముగించడంపై వెల్లువెత్తుతున్న విమర్శలను ఖండించిన ఆయన..   ప్రభుత్వం ఇచ్చిన  హామీలను పరిగణనలోకి తీసుకుని   దీక్ష విరమించానని, ఇందులో ఎలాంటి  బ్యాక్ డోర్ ఒప్పందాలూ లేవని కుండబద్దలు కొట్టారు. 
 మొజాంబిక్ దేశ పతాకంతో సముద్రంలో పయనిస్తున్న  దిశ   ఎల్‌పీజీ  ట్యాంకర్ లో 28 మంది ఇండియన్  నావికులు విధులు నిర్వర్తిస్తున్నారు. విశ్వస నీయంగా అందిన సమాచారం మేరకు ఈ క్షిపణి దాడి నుంచి నౌకలోని 28 మంది భారత సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు.
కేవలం వారం రోజుల వ్యవధిలోనే భారతీయ నావికులు దాడుల్లో ప్రాణాలు కోల్పోవడం ఇది రెండోసారి కావడం ఆందోళన కలిగిస్తున్నది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.