Publish Date:Aug 25, 2022
బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగించేందుకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎటువంటి షరతులూ లేకుండా యాత్రను కొనసాగించేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. పాదయాత్ర ఆపాలంటూ పోలీసులు బండిసంజయ్ కు ఇచ్చిన నోటీసులను హైకోర్టు స్పస్పెండ్ చేసింది. యాత్రను నిలిపివేయాలంటూ పోలీసులు ఇచ్చిన నోటీసులపై బీజేపీ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై గురువారం మధ్యాహ్నం విచారణ చేపట్టిన హై కోర్టు పాదయాత్రకు బేషరతు అనుమతి ఇచ్చింది. శాంతి భద్రతలు, మత సామరస్యాన్ని విఘ్నం కలిగేలా బండి సంజయ్ వ్యాఖ్యానించారంటూ యాత్ర నిలిపివేయాలని నోటీసులు ఇచ్చిన దానిపై ఆ వ్యాఖ్యలకు సంబంధించిన ఆధారాలను చూపాలని కోర్టు ప్రభుత్వాన్ని కోరగా ప్రభుత్వం పెన్ డ్రైవ్ లో ఆధారాలను సమర్పించింది.
అయితే పెన్ డ్రైవ్ ఆధారాలు చెల్లవన్న కోర్టు సరైన పద్ధతిలో ఆధారాలను సమర్పించకపోవడంపై ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేసింది. అనంతరం యాత్రకు అనుమతి తీసుకున్నారా అని బండి సంజయ్ తరఫు న్యాయవాదులను ప్రశ్నించింది. అందుకు తీసుకున్నామంటూ వారు సమాధానమిచ్చారు. దీంతో బండి సంజయ్ యాత్రకు అనుమతి ఇస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
కాగా బండి సంజయ్ యాత్రను నిలిపివేయాలంటూ పోలీసులు నోటీసులు జారీ చేయడంపై తెరాస శ్రేణులలోనే ఒకింత అసహనం వ్యక్తమైంది. ఎవరికీ పట్టని యాత్రను నిలిపివేయాలంటూ నోటీసులు జారీ చేయడం వెనుక ప్రభుత్వ వ్యూహమేమి
టో అర్దం కావడం లేదని టీఆర్ఎస్ శ్రేణులే అంతర్గత సంభాషణల్లో ఆశ్చర్యం వ్యక్తం చేశారు. గోటితో పోయేదానికి గొడ్డలి దాకా తీసుకువచ్చారన్నది సామెత. టీఆర్ఎస్ బండి సంజయ్ పాదయాత్ర విషయంలో వ్యవహరిస్తున్న తీరు ఆ సామెతనే గుర్తు చేస్తున్నది. బండి ప్రజా సంగ్రామ యాత్ర.. ఎప్పుడు ఎక్కడ జరుగుతోందో కూడా రాష్ట్రంలో జనం పట్టించుకోవడం లేదు. విడతల వారీగా బండి ప్రజా సంగ్రామ యాత్ర అంటూ నడుస్తున్నారు.
ముగింపు సభ పేర పార్టీ అగ్రనాయకులను తీసుకువచ్చి బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు. ఆ యాత్రలో ఆయన చేస్తున్న విమర్శలు, ప్రసంగాలలో కొత్తదనమేమీ ఉండటం లేదు. కేసీఆర్ కుటుంబ పాలన, కేసీఆర్ కుటుంబ అవినీతి అన్న ఊకదంపుడు విమర్శలను జనం పట్టించుకోవడం లేదు ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ బండి పాదయాత్ర వల్ల ఘర్షణ పూరిత వాతావరణం ఏర్పడుతోందంటూ యాత్రకు బ్రేక్ వేయడం ఎందుకో? దాని వెనక ఉన్న వ్యూహమేమిటో అర్ధం కావడం లేదని టీఆర్ఎస్ శ్రేణులు అంటున్నారు.
అవసరం లేని ఆంక్షల వల్ల బీజేపీ గ్రాఫ్ పెరగడం వినా మరో ప్రయోజనం ఉండదని అంటున్నారు. పైగా బండి సంగ్రామ యాత్ర దాదాపు ముగింపు దశకు వచ్చేసింది. ఈ సమయంలో ఆ యాత్రను నిలిపేయాలంటూ నోటీసులు ఇవ్వడం వల్ల యాత్ర గురించి చర్చ జరుగుతుందనీ, అది బీజేపీకే ప్రయోజనకరమని టీఆర్ఎస్ శ్రేణులు భావిస్తున్నాయి. ఇప్పుడు కోర్టు కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పు పడుతూ యాత్రకు అనుమతి ఇవ్వడంతో బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం మరింత పెరిగిందని అంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/high-court-green-signal-to-bandi-padayatra-39-142649.html
టీవీకే అధినేత విజయ్‌కు కాంగ్రెస్ మద్దతు తెలపడంపై ఆగ్రహంగా ఉన్న డీఎంకే.. కాంగ్రెస్‌కు కటీఫ్ చెప్పేసింది. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, లోక్‌సభలో తమ పార్టీ సభ్యులకు కాంగ్రెస్ ఎంపీలతో కాకుండా విడిగా సీటింగ్ కేటాయించాలని డీఎంకే ఎంపీ కనిమొళి స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
తాజా సమాచారం ప్రకారం.. విజయ్ తన పార్టీకి ఉన్న బలానికి తోడుగా మరో మూడు పార్టీల మద్దతును కూడగట్టుకున్నారు. ఆ పార్టీల మద్దతుతో అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118ని ఆయన సాధించారు.
తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవ్వగా.. మెజారిటీ నిరూపణ విషయంలో రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కచ్చితమైన నిబంధనలు పాటించాలని పట్టుబడుతున్నారు. విజయ్ కు తన పార్టీ ఎమ్మెల్యేలు 107 మందికి అదనంగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది.
పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనకు ముందే తెలుసని, నాయకత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు. అయితే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి.. క్షేత్రస్థాయిలో కేడర్‌ను కాపాడుకుంటూ వచ్చిన తనకు ఈ పరిణామం మనస్తాపానికి గురిచేసిందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు.
బాబు కూటమిని ఎందుకంత విలువైనదిగా భావిస్తున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూటమి ఎప్పుడెప్పుడు చీలిపోతుందాని కాచుకుని కూర్చుని ఉంది. ఏ అవకాశం వచ్చినా వారు వదిలిపెట్టినట్టే కనిపించదు. మొన్న కోట వినుత ఘటన, నిన్న అరవ శ్రీధర్ వ్యవహారం, ఇవాళ వర్మ ఇష్యూ.. ఇలా సమయం దొరికినపుడల్లా ఆయా అంశాలను బాగా హైలెట్ చేసి.. కూటమిలో ఏదో ఒక చిచ్చు రాజేయాలని చూస్తోంది వైసీపీ అధినాయకత్వం.
అతి కొద్ది మంది నేతలు జగన్ ప్రకటనను సమర్దిస్తూ.. అనుకూల ప్రకటనలు చేస్తుండగా.. మెజారిటీ లీడర్, క్యాడర్ మాత్రం జగన్ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
టీవీకే అధినేత విజయ్‌తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్‌కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్రబాబు ఫొటోలేదని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వర్మ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జనసేన నేత, మాజీ ఎమ్మెల్యే దొరబాబు జోక్యం చేసుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వర్మ దురుసు వ్యాఖ్యలపై పార్టీలో అంతర్గతంగా చర్చించిన అధిష్టానం.. వర్మ వ్యవహారాన్ని తప్పుబట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్‌కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్‌తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్‌కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.