ధూళిపాళ్లకు బెయిల్.. జగన్ సర్కారుకు మరో ఝలక్..
Publish Date:May 24, 2021
Advertisement
సంగం డెయిరీ కేసులో టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్రకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. నరేంద్రతో పాటు సంగం డెయిరీ ఎండీ గోపాలకృష్ణన్‌కు కూడా బెయిల్ వచ్చింది. అయితే, 4 వారాల పాటు విజయవాడ పరిధిలోనే ఉండాలని షరతు విధించింది. వాళ్లు ఉండే అడ్రస్ విచారణాధికారికి ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. వారిని విచారణకు పిలవాలంటే 24 గంటల ముందు నోటీస్ ఇవ్వాలని పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. గత నెల 23న ధూళిపాళ్ల నరేంద్రను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఉదయాన్నే వంద మందికి పైగా పోలీసులు ఆయన ఇంటిపై దాడి చేసి.. నరేంద్రను బలవంతంగా అరెస్ట్ చేశారు. సంగం డెయిరీని కంపెనీ చట్టంలోకి మార్చే సమయంలో అక్రమాలకు పాల్పడ్డారంటూ గతంలో జరిగిన వ్యవహారంపై తాజాగా కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి.. జైలుకు తరలించారు. ఆ తర్వాత సంగం డెయిరీని ప్రభుత్వ డెయిరీకి స్వాధీనం చేశారు. అయితే, హైకోర్టు ఆ ఉత్తర్యులను కొట్టివేసింది. జైల్లో ఉండగానే ధూళిపాళ్ల కరోనా బారినపడ్డారు. ప్రస్తుతం ఆయన రాజమండ్రిలోని ప్రైవేట్ ఆస్పత్రిలో ధూళిపాళ్ల చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే సర్కారు టార్గెట్ చేసి, కేసులు పెట్టి.. జైలుకు పంపిన రఘురామకృష్ణరాజు సైతం బెయిల్ సాధించారు. తాజాగా, ధూళిపాళ్ల నరేంద్రకు కూడా బెయిల్ రావడంతో జగన్‌రెడ్డి సర్కారుకు వరుస షాకుల మీద షాకులు తగులుతున్నాయి. కక్ష పూరితంగా వ్యవహరిస్తూ.. పస లేని కేసులు పెట్టి.. కట్టడి చేయాలని చూస్తే.. న్యాయస్థానాలు చేస్తూ ఊరుకోవంటూ ప్రతిపక్షం మండిపడుతోంది. కోర్టుల్లో వరుస ఎదురు దెబ్బల తర్వాతనైనా జగన్‌రెడ్డి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని హితవు పలుకుతున్నాయి.
http://www.teluguone.com/news/content/high-court-granted-bail-to-dhulipalla-narendra-39-116079.html





