నిర్మాత బండ్ల గణేష్‌ ఆస్తి వేలంపై హైకోర్టు సంచలన తీర్పు.!

Publish Date:Jul 3, 2026

Advertisement

టాలీవుడ్ సినీ నిర్మాత,  బండ్ల గణేష్‌కు తెలంగాణ హైకోర్టులో   ఎదురుదెబ్బ తగిలింది. ఆయన కుటుంబానికి చెందిన   ఆస్తి వేలాన్ని సమర్థిస్తూ  తెలంగాణ హైకోర్టు తీర్పు  వెలువరించింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేపట్టిన రికవరీ ప్రక్రియ,  వేలం చర్యలు పూర్తిగా చట్టబద్ధమేనని కోర్టు స్పష్టం చేసింది. గతంలో డెట్ రికవరీ ట్రిబ్యునల్  ఈ వేలాన్ని రద్దు చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు  కొట్టివేసింది.  
వివరాలిలా ఉన్నాయి. 

 బండ్ల గణేష్, ఆయన తండ్రి,   సోదరుడు ప్రమోటర్లుగా వ్యవహరిస్తున్న  శ్రీ పరమేశ్వర పౌల్ట్రీ ఫామ్ ప్రైవేట్ లిమిటెడ్  అనే సంస్థ వ్యాపార అవసరాల కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి భారీ మొత్తంలో రుణాలు తీసుకుంది. ఈ బ్యాంకు రుణాలకు గ్యారెంటీగా హైదరాబాద్‌   జూబ్లీహిల్స్ పరిధిలోని షేక్‌పేట్‌లో ఉన్న సుమారు 500 గజాల నివాస భవనాన్ని వారు తాకట్టు పెట్టారు. అంతేకాకుండా, ఈ రుణాలకు సంబంధించి బండ్ల గణేష్ కుటుంబ సభ్యులు వ్యక్తిగత హామీదారులుగా  సంతకాలు చేశారు.

అయితే..    సదరు సంస్థ తీసుకున్న రుణాలను సకాలంలో తిరిగి చెల్లించలేదు. బకాయిలు పేరుకుపోవడంతో రంగంలోకి దిగిన యూనియన్ బ్యాంక్ అధికారులు, బ్యాంకింగ్ నిబంధనల ప్రకారం రుణాల రికవరీలో భాగంగా 2019లో సర్ఫేసీ చట్టం కింద ఆ జూబ్లీహిల్స్ఆ  ఆస్తిని బ్యాంక్ అధికారులు తమ అధీనంలోకి తీసుకున్నారు. ఆ తర్వాత బకాయిల వసూలు కోసం 2022లో ఆ 500 గజాల విలువైన ఆస్తికి బహిరంగ వేలం నిర్వహించారు.

ఆ   వేలంలో  ఆ ఆస్తి  8.51 కోట్ల రూపాయలు పలికింది. అయితే ఈ వేలాన్ని సవాల్ చేస్తూ..  బండ్ల గణేష్ వర్గం డెట్ రికవరీ ట్రిబ్యునల్ ని ఆశ్రయించారు. గతంలో డీఆర్‌టీ ఆ వేలాన్ని రద్దు చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. దీంతో తమకు రావలసిన రికవరీ మొత్తం ఆగిపోవడంతో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ వ్యవహారంపై తెలంగాణ హైకోర్టులో అప్పీల్ పిటిషన్ దాఖలు చేసింది.

ఈ పిటిషన్‌పై  విచారణ చేపట్టిన  జస్టిస్ మౌషూమి భట్టాచార్య,  జస్టిస్ గడి ప్రవీణ్ కుమార్‌లతో కూడిన హైకోర్టు ధర్మాసనం..  బ్యాంక్ తరపు న్యాయవాదుల వాదనలతో ఏకభవించి,  రుణాలు ఎగ్గొట్టినప్పుడు రికవరీ చేసుకునే హక్కు బ్యాంకులకు ఉంటుందని స్పష్టం చేస్తూ, డీఆర్‌టీ ఇచ్చిన పాత ఉత్తర్వులను రద్దు చేస్తూ తీర్పు ఇచ్చింది.  

Union Bank of India, Property Auction, Jubilee Hills Property, Bandla Ganesh Court Case

By
en-us Political News

  
ప్రపంచవ్యాప్తంగా మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితులు, పెరుగుతున్న సమర వాతావరణం నేపథ్యంలో భారత ప్రభుత్వం అత్యంత అప్రమత్తమైంది.
అశోక్‌నగర్‌లో నిరుద్యోగుల మెరుపు ధర్నా..!
వైసీపీ అధినేత జగన్ వైఖరిపై రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
భారత స్వాతంత్య్ర సంగ్రామంలో కోట్లాది మంది భారతీయుల్లో దేశభక్తి రగిలించిన అమర గేయం
ఛత్తీస్‌గఢ్ మీదుగా పయనిస్తున్న తీవ్ర వాయుగుండం, చురుగ్గా ఉన్న నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలంగాణవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం
విధులు నిర్వర్తిస్తున్న ఎస్సై ప్రవళ్లిక పట్ల దురుసు ప్రవర్తన.. చర్యలకు డిమాండ్..!
జగన్‌కు ములాఖత్‌కు నిరాకరణ.. జైలు వద్ద సీదిరి కుటుంబ సభ్యులను పరామర్శించారు.. !
మానవత్వం మరుగున పడిపోతోందా? కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవాల్సిన చేతులే.. అదను చూసి లూటీకి తెగబడుతున్నాయా?
విధుల్లో ఉన్న మహిళా ఎస్సైపై వైసీపీ నేతలు దురుసు ప్రవర్తన..!
పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్‌లు..!
గచ్చిబౌలిలో నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతంలో మట్టి కుప్పకూలడంతో ముగ్గురు కార్మికులు గాయపడ్డారు.
తెలంగాణలో విద్యా వ్యవస్థ, నిరుద్యోగం, ఉద్యోగ నైపుణ్యాలు (స్కిల్స్) అంశాలపై ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.
ఫార్ములా-ఈ కారు రేస్ కేసులో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ రేపు నాంపల్లి ఏసీబీ కోర్టుకు హాజరుకానున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.