ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం వ్యవహారంలో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు షాక్ ఇచ్చింది. మద్యం కుంభకోణం కేసులో సీఐడీ తనకు నోటీసులు జారీ చేయడాన్ని సవాల్ చేస్తూ, తనపై కేసులను కొట్టివేయాలంటూ ఆయన దాఖలు చేసిన రిట్ పిటిషన్ ను విచారించిన ఏపీ హైకోర్టు ఆయన సీఐడీ విచారణకు హాజరు కావాల్సిందేనని స్పష్టం చేసింది.
జగన్ హయాంలో ఆంధ్రప్రదేశ్ లో భారీ మద్యం కుంభకోణం జరిగిందని సాక్షాత్తూ వైసీపీలో నంబర్ 2గా ఓ వెలుగు వెలిగిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డే అన్నారు. అంతే కాదు ఆ కుంభకోణంలో కర్త, కర్మ, క్రియ అంతా కసిరెడ్డి రాజశేఖరరెడ్డే అని కుండబద్దలు కొట్టారు. వైసీపీ నుంచి రాజీనామా చేసి, రాజకీయ సన్యాసం తీసుకున్న తరువాత కాకినాడ పోర్టు భూముల వ్యవహారంలో విచారణకు హాజరైన సందర్భంగా విజయసాయి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఈ విషయం వెల్లడించారు. ఇప్పుడు ఆయన మాటలు అక్షర సత్యాలేననడానికి తాజాగా ఆయన సీఐడీ విచారణకు హాజరు కావాల్సిందే నంటూ హైకోర్టు విస్పష్టంగా చెప్పడాన్ని ఉదాహరణగా చూపుతున్నారు పరిశీలకులు.
ఈ కుంభకోణంలో ప్రధాన సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి తనకు విచారణకు హాజరు కావాల్సింది పేర్కొంటూ సీఐడీ ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ కసిరెడ్డి రాజశేఖరరెడ్డి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్ ను విచారించిన హైకోర్టు కసిరెడ్డి సీఐడీ విచారణకు హాజరు కావాల్సిందేనని విస్పష్టంగా పేర్కొంది.
కసిరెడ్డి రాజశేఖరరెడ్డి క్వాష్ పిటిషన్ పై శుక్రవారంపిటిషన్పై విచారణ చేపటిన హైకోర్టు ధర్మాసనం సీఐడీ నోటీసులపై తాము ఎట్టి పరిస్థితుల్లో జోక్యం చేసుకోబోమని తేల్చి చెప్పింది. తదుపరి నోటీసు జారీ చేసి విచారణకు పిలిచే ముందు పటిషనర్కు కొంచం సమయం ఇవ్వాలని సీఐడీ అధికారులను కోర్టు ఆదేశించింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/high-court-big-shock-to-kasireddy-rajasekhar-reddy-39-195592.html
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు.
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది.
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్, విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు.
2021 లో జగన్ మోహన్ రెడ్డి కుప్పంలో నాటిన విత్తనం మహావృక్షమై దాని వేర్లు పులివెందుల వరకు పాకుతాయని జగన్ ఊహించి ఉండరు. 2021 జగన్ కుప్పం మునిసిపాలిటీ ని తెలుగుదేశంకు దక్కకుండా చేసి, చంద్రబాబు ముఖం ఇప్పుడు చూడాలి అన్న పరుష వ్యాఖ్యలే పులివెందులతో పులివెందులపై తెలుగుదేశం గట్టిగా నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది.
ఏపీలో జరుగుతున్న పురపాలక సంఘం ఎన్నికల ఫలితాల్లో అధికార కూటమి పక్షాలు తమ జోరును ప్రదర్శిస్తున్నాయి.