అదానీపై హిండెన్ బర్గ్ మరో బాంబు!

Publish Date:Sep 13, 2024

Advertisement

అదానీ వ్యాపార సామ్రాజ్యం అత్యంత వేగంగా విస్తరించడం వెనుక మోడీ అండదండలు, ఆశీర్వాదం పుష్కలంగా ఉన్నాయన్న ఆరోపణలు తరచుగా వినిపిస్తూ ఉంటాయి.  అదే సమయంలో అదానీ  అదానీ లక్ష్యంగా  అమెరికా పరిశోధనా సంస్థ హిండెన్ బర్గ్  చేస్తున్న ఆరోపణలు, వెలువరిస్తున్న నివేదికలు  మాత్రం ఆయన వ్యవహార శైలీ, వ్యాపార విస్తరణల వెనుక ఏదో మతలబు ఉందన్న అనుమానాలకు తావిస్తునే ఉన్నాయి.  ప్రపంచ కుబేరుల జాబితాలో స్థానం సంపాదించుకున్న అదానీపై హిండెన్ బర్గ్ తాజాగా మరో బంబు పేల్చింది.  అదానీ  మనీలాండరింగ్, సెక్యూరిటీల ఫోర్జరీ వంటి నేరాలకు పాల్పడ్డారని హిండెన్ బర్గ్ పేర్కొంది. ఈ విషయం స్విస్ అధికారుల విచారణలో తేలిందని కూడా హిడెన్ బర్గ్ ప్రకటించింది.  అందుకే తమ దేశంలో ఉన్న అదానీ గ్రూప్‌కు చెందిన అనేక బ్యాంక్ అక్కౌంట్లను స్విట్జర్లాండ్ సీజ్ చేసిందని పేర్కొంది. ఇలా పలు స్విస్ బ్యాంక్ అకౌంట్లలలో జమ చేసిన 310 మిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో  2600 కోట్ల రూపాయల పైనే  సీజ్ అయ్యాయని హిండెన్ బర్గ్ పేర్కొంది. స్విస్ క్రిమినల్ కోర్టు రికార్డుల ఆధారంగా ఈ సమాచారాన్ని సేకరించినట్లు పేర్కొన్న హిండెన్ బర్గ్ బ్రిటన్ వర్జిన్ ఐలాండ్స్, మారిషస్, బెర్ముడాలో వివాదాస్పద నిధులలో అదాని అనుబంధ సంస్థ పెట్టుబడులు ఉన్నాయని పేర్కొంది.  

ఈ వార్త కూడా చదవండి.. అదానీ మహా పతనం వెనుక కుట్ర?

అయితే సహజంగానే హిండెన్ బర్గ్ ఆరోపణలను అదానీ గ్రూప్ ఖండించింది. స్విస్ కోర్టు ప్రొసీడింగ్స్ తో ఎలాంటి సంబంధం లేదన్న అదానీ గ్రూప్, ఆ దేశంలోని తమ బ్యాంక్ అక్కౌంట్లేవీ సీజ్ కాలేదని వివరణ ఇచ్చింది. తమ గ్రూప్ మార్కెట్ విలువను పతనం చేయడానికీ, ప్రతిష్టను దెబ్బతీయడానికి హిండెన్ బర్గ్  ప్రయత్నిస్తున్నదని విమర్శించింది.  మోడీ ప్రధానిగా తొలి సారి పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత నుంచే అదానీ గ్రూప్ వ్యాపార సామ్రాజ్యం వేగంగా విస్తరించడం ఆరంభమైందన్నది మాత్రం వాస్తవం. అయితే గత ఏడాది  అదానీ    ఎక్కౌంటింగ్ ఫ్రాడ్, కృత్రిమంగా షేర్ విలువలు పెంచడం, అవినీతి, మనీ లాండరింగ్  తదితర ఆరోపణలు గుప్పిస్తూ హిండెన్ బర్గ్ ఒక నివేదిక విడుదల చేసింది. ఆ ప్రభావంతో అప్పటి వరకూ ప్రపంచ కుబేరుల జాబితాలో మూడో స్థానంలో ఉన్న అదానీ ఆ తరువాత నెల రోజుల వ్యవధిలోనే 26వ స్థానానికి పడిపోయిన సంగతి తెలిసిందే.  ఆ సమయంలో అదానీ గ్రూపు షేర్ల విలువ సగానికి పైగా పతనమైంది. సరే ఆ తరువాత ఎలాగోలా కోలుకుందనుకోండి. అది వేరే సంగతి అప్పట్లో..  అయినా అదానీ గ్రూపు సంస్థలపై మదుపర్ల విశ్వసనీయత సన్నగిల్లిందన్నది వాస్తవం.

అప్పట్లో అదానీ గ్రూపుపై హిండెన్ బర్గ్ నివేదిక వెనుక ఉన్నది మరో పారిశ్రామిక దిగ్గజం, విప్రో వ్యవ స్థాపకుడు అయిన ప్రేమ్ జీ అన్న ప్రచారం జరిగినా కూడా మదుపర్లలో అదానీ గ్రూపుపై నమ్మకం కలగలేదు. ఇప్పుడు తాజాగా అదానీ గ్రూపుపై హిండెన్ బర్గ్ స్విస్ క్రిమినల్ కోర్టు రికార్డులను ఉటంకిస్తూ చేసిన ఆరోపణలు మార్కెట్ ప్రపంచంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మరో గ్రేట్ ఫాల్ ను అదానీ గ్రూపు సంస్థలు ఎదుర్కొనే అవకాశాలున్నాయని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

By
en-us Political News

  
హైదరాబాద్ నగరంలో మహిళల భద్రతను ప్రశ్నార్థకం చేస్తూ మరో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది.
బాలీవుడ్‌లో మరోసారి ఆదాయపు పన్ను శాఖ దూకుడు పెంచింది.
తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త సంక్షేమ అధ్యాయానికి తెరలేచింది.
స్థానిక ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ జనాల గుండెల్లో కొలువయ్యారు. అన్నిటికీ మించి మంగళగిరిలో నెలకొన్న అతి కీలకమైన, ప్రధానమైన   గృహ నిర్మాణ హక్కుల (హౌసింగ్ డాక్యుమెంటేషన్) పత్రాల సమస్యకు దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తున్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్..!
ఒకవైపు ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూనే, మరోవైపు అదే ఎన్నికల్లో ప్రతిపక్షాలు పాల్గొనడం వల్ల ఆ తప్పులకూ, లోపాలకు చట్టబద్ధత కల్పించినట్లవుతోందన్న ఆయన ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.
శంషాబాద్ వద్ద హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై ఊహించని ఘటన చోటుచేసుకుంది.
దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న అర్బన్ ల్యాండ్ సీలింగ్‌ (ULC) దరఖాస్తుల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
హైదరాబాద్‌లో కుటుంబ కలహాలు విషాదాంతమయ్యాయి
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
పంజాబ్‌లోని ప్రసిద్ధ లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ క్యాంపస్‌లో శనివారం రాత్రి ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి.
ఆ సమయంలో తాను కేరళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తుండగా, గ్యానేష్ కుమార్ కేంద్ర హోంమంత్రిత్వ శాఖలో ఉన్నతాధికారిగా సేవలందిస్తున్నారని గుర్తుచేశారు. ప్రయాణ సమయంలో తన రిటైర్మెంట్ అనంతర ప్రణాళికల గురించి  ఆరా తీసిన జ్ణానేష్ కుమార్‌.. ఆ సందర్భంలోనే బీజేపీ తరఫున పతనం తిట్ట లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలని సూచించారన్నారు. 
ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల ఫలితాలు,  ప్రస్తుత రాజకీయ వాతావరణం దృష్ట్యా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు విజయంపై ధీమాతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ బరిలోకి దిగడంతో సమీకరణాలు ఏ విధంగా మారతాయన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.