తాడిపత్రిలో హైటెన్షన్ ఇరకాటంలో పోలీసులు

Publish Date:Aug 18, 2025

Advertisement

తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దాదాపు 14 నెలల తరువాత వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలో అడుగుపెట్టనుండటమే ఇందుకు కారణం. నియోజకర్గంలో ప్రజా సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరిస్తానంటూ పెద్దారెడ్డి తాడిపత్రి రానున్నారు. ఆయన తాడిపత్రి ప్రవేశానికి కోర్టు నుంచి అనుమతి కూడా లభించింది.

తాము విధించిన షరతులకు లోబడే తాడిపత్రి పర్యటన ఉండాలన్న షరతు విధించింది. దీంతో సోమవారం (ఆగస్టు18) తాడిపత్రిలో అడుగుపెట్టేందుకు పెద్దారెడ్డి రెడీ అయ్యారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం నేత జేసీ ప్రభాకరరెడ్డి అడ్డుకునే ప్రయత్నాలు చేస్తారన్న భావనతో ఆయనకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. మొత్తం మీద పెద్దారెడ్డి ఎంట్రీ నేపథ్యంలో తాడిపత్రిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది.  

మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని రాకుండా మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకరరెడ్డి గత కాలంగా అడ్డుకుంటున్న సంగతి తెలిసిందే . ఈ నేపథ్యంలోనే పెద్దారెడ్డి హైకోర్టును ఆశ్రయించి తాడిపత్రి లోకి ప్రవేశించేందుకు అనుమతి తెచ్చుకున్నారు.కోర్టు కూడా పెద్దారెడ్డికి భద్రత కల్పించి తాడిపత్రిలోకి అనుమతించాలని పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది. దీంతో పెద్దారెడ్డి సోమవారం (ఆగస్టు 18) తాడిపత్రి బయలుదేరారు. అయితే ఇదే సమయంలో జేసీ ప్రభాకరరెడ్డి తాడిపత్రిలో శివుడి విగ్రహావిష్కరణ కార్యక్రమం ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమానికి భారీగా హాజరుకావాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో   టీడీపీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. దీంతో ఉద్రిక్తతలు పెచ్చరిల్లి ఘర్షణకు దారి తీసు ప్రమాదం ఉందన్న భావనతో  తాడిపత్రికి బయలుదేరిన పెద్దిరెడ్డిని పోలీసులు మార్గమధ్యంలో నే అడ్డుకున్నారు. శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా తాడిపత్రికి రావద్దంటూ పెద్దిరెడ్డికి చెబుతు న్నారు. కోర్టు అనుమతితో వస్తున్న తననెలా అడ్డుకుంటారని పెద్దారెడ్డి పోలీసులను నిలదీస్తున్నారు. మొత్తం మీద తాడిపత్రిలో టెన్షన్ వాతావరణం పోలీసులను ఇరకాటంలో పడేసింది. 

By
en-us Political News

  
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.  
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో   పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు.  పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. 
 ధనుష్‌ తన కొత్త రాజకీయ పార్టీ కోసం  తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు  ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే  ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి. 
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని. 
అయితే ఆయన  తాజాగా   నిర్వహించిన కార్యకర్తల సమావేశం మాత్రం భిన్నంగా జరిగింది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు,  వ్యక్తం చేసిన అసహనం వైసీపీవర్గాలలో  కలకలం రేపింది. 
జనసేన, బీజేపీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా భాగస్వాములు కావడం లేదు.  ప్రతి నెలా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చురుకుగా పాల్గొంటుంటే.. జనసేన, బీజేపీ నాయకుల భాగస్వామ్యం నామమాత్రంగా ఉంటోందనీ, ఇది కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఉందా అన్న అనుమానాలను కలిగిస్తోందనీ సర్వేలో వెల్లడైన జనాభిప్రాయం. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.