మసాలలా పేరుతో విషం.. కాటేదాన్‌లో H-FAST మెగా ఆపరేషన్..!

Publish Date:Aug 4, 2026

Advertisement

 

చూడటానికి ఆకర్షణీయంగా.. చేతిలోకి తీసుకుంటే బరువుగా.. నాణ్యమైన బ్రాండెడ్ మసాలాల్లా కనిపిస్తున్నాయి.. అంతేకాదు.. ఘుమఘుమ లాడుతూ నోరూరిస్తున్నాయి..! కానీ అవి కూరల్లో వేసుకునే మసాలాలు కాదండోయ్ విషపూరిత రసాయనాలతో తయారు చేసిన కల్తీ మిశ్రమాలు..! ఇలాంటి మసాలాలను దర్జాగా మార్కెట్‌లోకి తరలిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కల్తీ దందాను H-FAST అధికారులు బట్టబయలు చేశారు. కాటేదాన్ కేంద్రంగా సాగుతున్న ఈ వ్యవహారంపై H-FAST, జీహెచ్‌ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన మెగా ఆపరేషన్‌లో 25.3 టన్నుల కల్తీ మసాలాలు పట్టుబడ్డాయి.

మసాలాల కొనుగోలు, ప్రాసెసింగ్, హోల్‌సేల్, రిటైల్ వ్యాపారం నిర్వహిస్తున్న 13 సంస్థలు, కేంద్రాలపై అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా నాణ్యత లేని ఆవాలు, జీలకర్ర, వాము, లవంగాలు, షాజీరా తదితర మసాలాలకు ఫ్యాబ్రిక్ డైలు, ఇండస్ట్రియల్ కలర్స్, టాల్కం పౌడర్, రైస్ బ్రాన్ ఆయిల్ వంటి ఆహారంలో వినియోగించకూడని పదార్థాలను కలుపుతు న్నట్లు గుర్తించారు. మసాలాలకు రంగు, మెరుపు, బరువు పెంచి బ్రాండెడ్ ఉత్పత్తుల మాదిరిగా తయారు చేసి మార్కెట్‌లో విక్రయిస్తు న్నట్లు అధికారులు గుర్తించారు. 

దాడుల్లో 7,920 కిలోల వాము, 6,700 కిలోల జీలకర్ర, 4,960 కిలోల ఆవాలు, 2,350 కిలోల జీలకర్ర పొడి, 2,280 కిలోల షాజీరా, 550 కిలోల లవంగాలు, 540 కిలోల సోంపు కలిపి మొత్తం 25,300 కిలోల కల్తీ మసాలాలు స్వాధీనం చేసుకున్నారు. అదనంగా భారీగా ముడి పదార్థాలు, షైనింగ్ పౌడర్, సింథటిక్, ఫ్యాబ్రిక్ డైలు, రైస్ బ్రాన్ ఆయిల్, మూడు రోలింగ్ మెషీన్లను సీజ్ చేశారు.

ఈ వ్యవహారంపై మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు, బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కేసు నమోదు చేసి కాటేదాన్‌కు చెందిన రాహుల్ భాటి, బేగంబజార్‌కు చెందిన విశాల్ పన్వార్, దులీచంద్ కచావర్‌లను అరెస్ట్ చేశారు. స్వాధీనం చేసుకున్న మసాలాలు, రసాయనాలను ల్యాబొరేటరీ పరీక్షలకు పంపించి, నివేదిక ఆధారంగా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్–2006తో పాటు ఇతర చట్టాల కింద చర్యలు తీసుకోనున్నారు.
ఇదే ఆపరేషన్‌లో అల్లం-వెల్లుల్లి పేస్ట్‌లో రసాయనాల వినియోగం, కుళ్లిన మాంసం నిల్వలు, రసాయనాలతో పండ్లను మగ్గించడం, యూరియా, డిటర్జెంట్లు, పామ్ ఆయిల్‌తో సింథటిక్ పనీర్ తయారీ వంటి మరిన్ని కల్తీ వ్యవహారాలు కూడా బయటపడ్డాయి.

H-FAST ఏర్పాటైన 140 రోజుల్లోనే 659 దాడులు నిర్వహించి 202 FIRలు నమోదు చేయడంతో పాటు సుమారు 246 టన్నుల కల్తీ ఆహారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రజలు అసాధారణంగా ప్రకాశవంతమైన రంగుల్లో కనిపించే మసాలాలు, బ్రాండింగ్ లేని ఆహార పదార్థాలను కొనుగోలు చేయవద్దని అధికారులు సూచించారు. ప్యాకింగ్, లేబులింగ్, FSSAI లైసెన్స్ వివరాలను పరిశీలించా లని, అనుమానాస్పద కల్తీ వ్యవహారాలు కనిపిస్తే డయల్ 100 లేదా H-FAST హెల్ప్‌లైన్ 8712661212కు కాల్ లేదా వాట్సాప్ ద్వారా సమాచారం ఇవ్వాలని కోరారు. కల్తీ ఆహారంపై తనిఖీలు, దాడులు నిరంతరం కొనసాగుతా యని అధికారులు స్పష్టం చేశారు.

H-FAST mega operation in Katedan, H-FAST, FSSAI, CM Revanth reddy, CP Sajjanar, DGP C.V. Anand, Telangana police   
 

By
en-us Political News

  
ప్రజాస్వామ్యంలో నాయకుడు ప్రజల కష్టాలను ఆలకించడానికి, కార్యకర్తలకు ధైర్యాన్ని ఇవ్వడానికి క్షేత్రస్థాయిలోకి రావడం సహజం
లిఫ్ట్‌లోకి అడుగు పెట్టగానే గాలిల్లో కలిసిపోయిన ప్రాణాలు..!
హైదరాబాద్ నగరం మరోసారి ఘోర హత్యోదంతంతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
మంత్రి లోకేష్‌తో ప్రవచన కర్త చాగంటి కోటేశ్వరరావు భేటీ..!
పిల్లల ప్రాణాలను తీస్తున్న ఇసుక ఈగలు..అసలేంటీ మహమ్మారి..?
నేలతల్లి గర్భంలో కోటానుకోట్ల రూపాయల విలువైన బాక్సైట్ సంపద నిద్రాణమై ఉంది.
కాల్పులు జరిపి ఆత్మహత్య చేసుకున్న ఏపీ అధికారి..ఇద్దరు మృతి..!
రెండు కాళ్లు విరిగిన రోగిపై లైంగిక వేధింపులు.. !
ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని రాజకీయ ప్రయోజనాలు, వ్యక్తిగత అజెండాల కోసం వినియోగించడం తగదని హెచ్చరించింది. పిటిషనర్ పేర్కొంటున్న బాధితులు, అభ్యర్థులు నేరుగా కోర్టు ముందుకు ఎందుకు రావడం లేదని ప్రశ్నించింది.
మైనర్ బాలికను బాస్కెట్‌ బాల్ టోర్నమెంట్ల సందర్భంగా అసభ్యకరమైన వ్యాఖ్యలు, సంజ్ఞలతో వేధించినట్లు వచ్చిన ఫిర్యాదుపై మాదాపూర్ పోలీసులు బాస్కెట్‌బాల్ కోచ్ పృథ్వీశ్వర్ రెడ్డిపై పోక్సో కేసు
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల అనంతరం రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది
ఢిల్లీ పోలీసులు తీసుకుంటున్న చర్యలు ఇప్పుడు వ్యాపార వర్గాల్లో, సామాజిక వర్గాల్లో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తున్నాయి. నిరసన ప్రాంగణంలో లభ్యమైన ఖాళీ ఫుడ్ ప్యాకెట్లు, వాటర్ బాటిళ్ల ఆధారంగా పోలీసులు స్థానిక రెస్టారెంట్లు, కేఫ్ యజమానులను విచారణ పేరిట వేధింపులకు గురి చేస్తున్నారు.
విమాన ప్రయాణం అంటే సురక్షితమైనది, ఆహ్లాదకరమైనది అని అందరూ భావిస్తారు. కానీ, నింగిలో ప్రయాణిస్తున్న వేళ ఊహించని విపత్తులు ఎదురైతే ఆ అనుభవం
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.