మన ఫోన్లు పేలవన్న గ్యారంటీ ఏంటి?

Publish Date:Sep 18, 2024

Advertisement

మన చేతిలో వున్న స్మార్ట్ ఫోన్ మన జీవితాలను పూర్తిగా స్వాధీనం చేసుకుందని బాధపడిపోతూనే వుంటాం. అయినా మనం మన చేతిల్లో ఫోన్లు వదలం. నిద్ర లేచిన దగ్గర్నుంచి నిద్రపోయే వరకు మాత్రమే కాదు.. ఆఖరికి నిద్రపోయేటప్పుడు కూడా మన ఫోన్ మనల్ని అంటిపెట్టుకుని వుండాల్సిందే. మన జీవితంలో భాగమైపోయిన, మన జీవితాన్ని తన చేతుల్లోకి తీసుకున్న స్మార్ట్ ఫోన్ మన జీవితాన్ని అంతం చేయగలదు. ఏదో ఒకరోజు ఆ ఫోను బాంబులాగా ఢామ్మని పేలిపోయి మన పేరు ముందు ‘స్వర్గీయ’ అనే పదాన్ని చేర్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, పరిస్థితులు, టెక్నాలజీ అంత దారుణంగా తయారయ్యాయి మరి.

లెబనాన్‌కి చెందిన తీవ్రవాద గ్రూప్ ‘హెజ్‌బొల్లా’ సభ్యులు ఉపయోగించే పేజర్లు రెండ్రోజుల క్రితం పేలిపోయాయి. ఆ పేలుళ్ళ ధాటికి తొమ్మిదిమంది హెచ్‌బొల్లా గ్రూప్ మిలిలెంట్లు అక్కడికక్కడే చనిపోయారు. హెజ్‌బొల్లా గ్రూప్ కొద్ది నెలల క్రితమే ఆ పేజర్లను తైవాన్‌కి చెందిన గోల్డ్ అపోలో అనే సంస్థకు ఆర్డర్ ఇచ్చి తయారు చేయించింది. అయితే మొస్సాద్ స్పై ఏజెన్సీ పేజర్లను తయారు చేసిన సంస్థతో కుమ్మక్కై తమకు సరఫరా చేసే పేజర్లలో పేలుడు పదార్థాలు అమర్చిందని హెజ్‌బొల్లా గ్రూప్ ఆరోపిస్తోంది. పేలుళ్ళకు కారణమైనవారిని వదిపెట్టమని హెచ్చరించింది. పేజర్లను తయారు చేసిన సంస్థ మాత్ర తమకు ఏ పాపమూ తెలియదని తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేస్తోంది. అమెరికా మాత్రం, ఈ పేలుళ్ళకు, తమకు ఎలాంటి సంబంధం లేదని ప్రకటించింది. ఈ గొడవని అలా వుంచితే, ఇలా ఎలక్ట్రానిక్ వస్తువులలో పేలుడు పదార్థాలు అమర్చి, ఎప్పుడు పేల్చుకోవాలంటే అప్పుడు పేల్చుకోవచ్చనే విషయం స్పష్టమవుతోంది. అలాంటి అవకాశం వున్నప్పుడు మన చేతిలో వున్న ఫోన్ కూడా ఒక మినీ బాంబ్ అని మనం ఎందుకు అనుమానించకూడదు?

మనం ఉపయోగించే ఫోన్లకి, మన శత్రుదేశం చైనాకి అవినాభావ సంబంధం వుంటుంది. ఫోన్ల మీద మేడిన్ చైనా అని వున్నా, వుండకపోయినా ఆ ఫోన్‌ తయారీ దశలో ఎక్కడో ఒకచోట చైనాతో లింక్ వుండే వుంటుంది. మన ఇండియా అంటే అగ్గిమీద గుగ్గిలం అయిపోతూ వుండే చైనా మన దేశానికి సరఫరా అయ్యే ఫోన్లలో ఏ చిన్న బాంబు నిక్షిప్తం చేసిందో ఏం పాడో! అసలే ఆ చైనావాళ్ళు మహా ముదుర్లు. విశ్వామిత్ర సృష్టి చేయడంలో ఆరితేరినవాళ్ళు. మన ఫోన్లో ఏ చిప్పు లాగానో, ఏ తీగ లాగానో కనిపించే బాంబుని సెట్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఏ దుర్ముహూర్తానో అది పేలినా పేలవచ్చు. అతిగా భయపడుతున్నట్టు, బయపెడుతున్నట్టు అనిపించినా, తాజాగా పేజర్ల పేలుడు జరిగిన నేపథ్యంలో మన చేతిలో వున్న ఫోన్‌ని కూడా అనుమానించడంలో తప్పు కాదేమో!

By
en-us Political News

  
వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గమైన పులివెందుల పరిధిలోని లింగాల మండలం నుంచి  జెడ్పీటీసీ స్థానానికి పోటీ చేయాల్సిందిగా  వైఎస్ సునీతను లోకేష్ కోరినట్లు  ప్రచారం జరుగుతోంది. కేవలం పోటీ చేయడమే కాకుండా, ఆ ఎన్నికలో విజయం సాధిస్తే..  జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పదవి  కట్టబెడతామని స్పష్టమైన హామీ ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.
భారతీయ చలనచిత్ర పరిశ్రమ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం గుజరాత్‌లోని ఏక్తా నగర్‌లో అత్యంత వైభవంగా జరిగింది.
యువనేత లోకేష్ రాప్తాడు రావడం పార్టీ కేడర్‌కు పండుగ రోజు.
తన కుమార్తె వివాహాన్ని అడ్డుపెట్టుకుని జగన్ తో సయోధ్య కోసం తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారంటూ తనపై వచ్చిన ఆరోపణలను ఆమె నిర్ద్వంద్వంగా ఖండించారు.  
సినిమా రంగంలో సరికొత్త చరిత్ర సృష్టిస్తూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.
ప్రముఖ సినీనటి రాధ తన కుటుంబ సభ్యులపై చెన్నై పోలీసులను ఆశ్రయించారు.
రాజకీయ నేతలను లక్ష్యంగా చేసుకుని అనుచిత వ్యాఖ్యలు చేయడం వంటి తీవ్రమైన అభియోగాలపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు అతడిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసుల విచారణలో భాగంగా వెలుగుచూసిన పరిణామాలు, అతడు వ్యక్తం చేసిన పశ్చాత్తాపం డిజిటల్ మీడియాలో ఇష్టారీతిగా వ్యాఖ్యలు చేసే వారందరికీ నిస్సందేహంగా ఒక హెచ్చరిక అని చెప్పవచ్చు. 
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
పెళ్లంటే సంబరమా.. అప్పుల భారమా? రూ.45 లక్షల లోన్‌పై నెటిజన్ ఆవేదన..!
భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా (ఇన్ చార్జ్) బొత్స అనూషను ఆ పార్టీ అధినేత జగన్ నియమించారు. ఈ మేరకు   పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి  ఉత్తర్వులు వెలువడ్డాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ నియామకం జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.  
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్ విదేశీ పర్యటన పెట్టుకోవడాన్ని ప్రస్తావిస్తూ రాజకీయ పరిశీలకులు షర్మిల కుమార్తె వివాహానికి హాజరు కాకుండా తప్పించేకునేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చంటూ విశ్లేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే షర్మిల తన అన్న నివాసానికి వెళ్లి వివాహ ఆహ్వానపత్రిక అందిస్తారా? అందిస్తే జగన్ ఆ వివాహానికి హాజరౌతారా? అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తమౌతున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.