చిటికెలో వచ్చేస్తా...అని నాగార్జున రేవంత్‌ని భలే వెళ్లి కలిశారే
Publish Date:Jun 1, 2025

Advertisement
కనిపించవు కానీ నీలో కూడా ఒక స్మార్ట్ పొలిటీషియన్ ఉన్నాడయ్యా నాగార్జునా.. అనే వాళ్లుంటారు. నాగార్జున ఏమంత సామాన్యంగా పావులు కదపరు. ఆయన స్కెచ్ వేస్తే అందుకంటూ ఒక లెక్కుంటుందని అంటారు. నాగార్జునకు అధికార పార్టీలతో మంచి రిలేషన్స్ ఉంటాయెప్పుడూ. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉండగా.. ఆయన భార్య అమల, కవిత మంచి ఫ్రెండ్స్ అన్న పేరుండేది. అందుకే కన్వెన్షన్ గొడవ కన్వినెంట్ గా పక్కకు వెళ్లిందని చెబుతారు. ఇటీవలి కాలంలో మంత్రి కొండా సురేఖ చేసిన సమంత కామెంట్ల కాక సంగతి సరే సరి. అసలు సమంతను నాగ చైతన్యకు కోడలిగా తేవడం వెనక పెద్ద ఎత్తున ప్రిపరేషనుందని అంటారు. ఎందుకంటే నాగ్ ఇంట్లో తన తర్వాత అంత పెద్ద స్టార్ ఎదగలేదు. నాగ్ చైతన్య నటన వరకూ పర్లేదు కానీ క్రేజ్ విషయంలో ఒక మహేష్, జూనియర్, అల్లు అర్జున్ స్తాయి లేదు.
ఇదే మహేష్ బాబు ఇక పద్మాలయ పని అయిపోయిందన్నపుడు ఉవ్వెత్తున ఎగసి.. పద్మాలయ పడుతున్న కష్టనష్టాలన్నిటినీ ఒంటి చేత్తో తుడిచి పెట్టేశాడు. ఇప్పుడా సంస్థ పరిస్థితి అటుంచితే సర్ ప్లస్ లో ఉన్నాడు. ఇక జూనియర్ సంగతి తెలిసిందే. తనకంటూ ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ సాధించుకుని పర్లేదనిపిస్తున్నాడు. హరికృష్ణ వారసుడిగా భేష్ అనిపిస్తున్నాడు. అమిత్ షాయే కోరి కలిసేంత క్రేజ్ సంపాదించాడు. ఇక అల్లు అర్జున్‌ని చూస్తూనే ఉన్నాం. మెగా కాంపౌండ్ లోంచి బయటకొచ్చి అల్లు కాంపౌండ్ అనేదానికి ఫ్లాగ్ షిప్ లీడర్షిప్ ఇస్తున్నాడు. ఇన్నాళ్ల పాటు మేం మెగా హీరోలం అన్న వాళ్లు సాధించలేనిది తాను జాతీయ స్థాయిలో ఉత్తమనటుడిగా నిలిచి.. ఇటు రాష్ట్ర అవార్డును కూడా కొల్లగొట్టి.. తగ్గేదే ల్యా అంటున్నాడు. నిజానికి నాగార్జునకు ఈ స్తాయిలో ఒక హీరోయిజం కావాలి. తన వారసుల నుంచి. ఇద్దరున్నారనుకుంటే ఇద్దరూ ఇద్దరే. వీరిలో అఖిల్ అయితే ఎక్కడో చైనా వారసత్వం. దీంతో అతడు సినిమాల వరకూ ఓకేగానీ ప్రేక్షకుల్లో ఒక జూనియర్ లాంటి క్రేజ్ సాధించడంలో ఇప్పటి వరకూ ఏమంత ప్రతిభ చూపించలేదు.
ఇద్దరిలోనూ నాగచైతన్యకే ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యే ఛాన్సుంది. ఎందుకంటే అతడిలో ఒక అక్కినేని మరో దగ్గుబాటి రక్తముంది. కానీ అతడెందుకో.. అంత రేంజ్ లో విజృంభించలేక పోతున్నాడు. దీంతో నాగార్జున సమంత అనే ఒక మార్కెట్ వాల్యూను నట్టింట్లో కట్టేసుకోవాలని భావించినట్టు సమాచారం. అది కాస్తా ఆమెకు అర్ధమై వ్యవహారం టోటల్ గా బెడిసికొట్టినట్టు చెబతారు. కొత్త కోడలు ధూళిపాళ వారి అమ్మాయి పై ఆ స్తాయిలో ఇంకా ఏదీ ప్లాన్ చేసినట్టు కనిపించడం లేదు. ఆమె మూలాలు, మార్కెట్ వాల్యూ సమంత అంత లేదు. దీంతో ఆమెను ఫ్యామిలీకి మాత్రమే పరిమితి చేసేలా కనిపిస్తోంది. గతంలో కూడా జగన్ కి స్నిహితంగా మెలిగిన చరిత్ర ఉంది నాగార్జునకు. ఒక సమయంలో కేసీఆర్ ఫ్యామిలీ అండదండలు చూసుకుని.. నాగ్ రేవంత్ తో రఫ్ గా బిహేవ్ చేశారని అంటారు. రేవంత్ కూతురి పెళ్లి ఎన్ కన్వెన్షన్‌లో జరిగితే.. ఏదో ప్లేట్ల రేట్ల దగ్గర తేడాలొచ్చాయనీ... అదే కన్వెన్షన్‌ని కూల్చే వరకూ వ్యవహారం వచ్చిందని అప్పట్లో అన్నారు.
ఆ ముచ్చట అలా ఉంచితే.. ఇప్పుడు రేవంత్ కి దగ్గరవక తప్పదని భావించిన నాగార్జున ఆ దిశగా అయితే ఒక అడుగు వేసి.. కొండా సురేఖ వంటి వారి నోటికి తాళమైతే వేశారు. తర్వాత ఈ బంధాను బంధాలు ఎక్కడి వరకూ వెళ్తాయో చూడాల్సి ఉంది. ఎంతైనా అధికారం అధికారమే. ఆ మాటకొస్తే నాగార్జున టాలీవుడ్లో మెగా చైర్లో ఉన్న చిరంజీవి అన్నా కూడా అంతే గౌరవం మర్యాద ఇస్తారు. ఎంతైనా నాగార్జున మార్క్ పాలిటిక్స్ పైకి కనిపించవు కానీ, మొత్తానికైతే ఎక్కడికక్కడ సెట్ చేయడానికి కొన్ని యత్నాలైతే చేస్తూనే ఉంటారట. ఒక్కోసారినాగార్జున వైలెంట్ డెసిషన్స్ కూడా తీసుకుంటారని అంటారు. ఆయనకు ఒళ్లు మండటం వల్ల.. ఒక మీడియా వ్యవస్థ సమూలంగా కుప్పకూలిందని. ఆయన్ను కెలకడం కూడా ఏమంత మంచిది కాదన్న టాకుంది ఇండస్ట్రీలో. అంత స్మార్ట్ గా, సరిగ్గా అదే సమయంలో ఎంతో వైల్డ్ గా.. ఆయన కదలికలు ఉంటాయని చెబుతారు.
http://www.teluguone.com/news/content/hero-nagarjuna-39-199087.html












