ఇలాంటి వ్యక్తులకు సహాయం చేస్తే.. సహాయం చేసిన వారే నాశనం అవుతారట..!
Publish Date:Aug 4, 2026
Advertisement
సహాయం.. మనిషికి ఉండాల్సిన మంచి గుణాలలో సహాయం చేయడం కూడా ఒకటి. ఆపదలో ఉన్నవారికి, అవసరం లో ఉన్నవారికి, ఇబ్బందులలో ఉన్నవారికి సహాయం చేయడం చాలామంచి లక్షణం.కానీ కొన్నిసార్లు, ఆలోచించకుండా చేసే సహాయం పెద్ద తలనొప్పిగా మారవచ్చు. చాణక్య నీతి ప్రకారం.. కొందరు వ్యక్తులకు సహాయం చేయడం వల్ల ఇబ్బందులు పడతారని, అంతే కాకుండా కొందరు వ్యక్తులకు సహాయం చేస్తే.. సహాయం చేసిన వారే నాశనం అవుతారని, తీవ్ర సమస్యలో చిక్కుకుంటారని చెబుతారు. అలాంటి మూడు రకాల వ్యక్తుల గురించి కూడా ఆచార్య చాణక్యుడు చెప్పాడు. దీని గురించి వివరంగా తెలుసుకుంటే.. దుర్మార్గులు, చెడ్డ గుణం కలిగిన స్త్రీ, పురుషులు.. చెడ్డ మనసు లేదా చెడు గుణం కలిగిన , కోపిష్టి స్వభావం ఉన్నవారికి ఎల్లప్పుడూ దూరంగా ఉండాలి. అలాంటి వారికి సహాయం చేయడం అంటే మన కాళ్ళను మనమే కాల్చుకోవడం లాంటిది. చెడ్డ స్వభావం ఉన్నవారు ఎవరికీ స్నేహితులు కారు. వారికి ఎంత దయ చూపినా, అవకాశం దొరకగానే తిరిగి హాని చేయడానికి వెనుకాడరు. అలాంటి వ్యక్తులకు సపోర్ట్ చేయడం వల్ల సామాజిక హోదా , ప్రతిష్టపై ప్రతికూల ప్రభావం పడుతుంది. అందువల్ల అటువంటి వ్యక్తులకు సంబంధించిన ఏ విషయాలకు అయినా దూరంగా ఉండాలి. ఎప్పుడూ విచారంగా ఉండేవారు.. ఈ ప్రపంచంలో కొందరు ఎటువంటి కారణం లేకుండా ఎప్పుడూ ఏడుస్తూ ఉంటారు. అన్నీ ఉన్నప్పటికీ, వారు తమ విధిని, పరిస్థితులను ఎప్పుడూ నిందించుకుంటూ ఉంటారు. ఇలాంటి నెది మూర్ఖుడు.. మూర్ఖుడికి , బుద్ధిహీనుడికి ఏదైనా చెప్పడం, సహాయం చేసేటప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోవాలి.. ఇతరులకు సహాయం చేయడం అంటే తప్పనిసరిగా మిమ్మల్ని మీరు ప్రమాదంలో పడేసుకోవడం కాదు. సహాయం చేసే గుణం మంచిదే అయినప్పటికీ, ,తెలివిని ఉపయోగించడం కూడా అంతే ముఖ్యం. ఎవరికైనా సహాయం చేసే ముందు, వారి ఉద్దేశాలను, ప్రవర్తనను జాగ్రత్తగా అంచనా వేయాలి. ఎదుటి వ్యక్తి మీ సహాయం చేసే గుణాన్ని దుర్వినియోగం చేయవచ్చని మీకు అనుమానం వస్తే, వెంటనే వెనక్కి తగ్గడం మంచిది. మీ దయా గుణాన్ని ఎవరూ దుర్వినియోగం చేయకుండా ఉండేలా మీ హద్దులను మీరే ఏర్పరచుకోవడం నేర్చుకోవాలి. సరైన వ్యక్తికి సహాయం చేయడం సరైన వ్యక్తి సహాయం చేయడం చాలా మంచిది. మన సహాయ గుణాన్ని సరైన చోట ఉపయోగించాలని చాణక్య నీతి బోధిస్తుంది. మీరు మీ శక్తిని, ధనాన్ని సరైన చోట, సరైన వ్యక్తుల వద్ద పెట్టుబడిగా పెట్టినప్పుడు మాత్రమే మీకు మంచి జరుగుతుందని అంటున్నాడు ఆచార్య చాణక్యుడు. అందువల్ల, ఎల్లప్పుడూ మంచి చెడుల మధ్య వ్యత్యాసాన్ని అర్థం చేసుకున్న తర్వాతే ఇతరులకు సహాయం చేయాలి.
నెగిటివ్ మనస్తత్వం ఉన్నవారికి సహాయం చేయడం మానుకోవాలని చాణక్యుడు చెప్పాడు. అలాంటి వారు తమ జీవితంలో ఎప్పటికీ సంతోషంగా లేదా సంతృప్తిగా ఉండలేరు. అలాంటి వారికి సహాయం చేస్తే, వారి ప్రతికూల శక్తి జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. క్రమంగా వారికి సహాయం చేసేవారు కూడా మానసిక ఒత్తిడికి గురై సంతోషాన్ని కోల్పోతారు.
మూర్ఖుడికి సలహా ఇవ్వడం లేదా సహాయం చేయడం అత్యంత మూర్ఖపు పనిగా చెబుతారు. తమ మంచి చెడులను తాము తెలుసుకోలేని వ్యక్తికి ఏదైనా వివరించడం పూర్తిగా సమయం వృధా చేసినట్టే. అలాంటి సరైన మార్గంలోకి నడిపించడానికి ప్రయత్నించినప్పుడు, వారు తరచుగా చెప్పేదాన్ని అపార్థం చేసుకుంటారు. అలాంటి వ్యక్తులు సహాయం అందించే వ్యక్తిని తమ శత్రువుగా భావిస్తారు. వారితో వాదించడం లేదా వారికి సహాయం చేయడానికి ప్రయత్నించడం వల్ల మనశ్శాంతిని పూర్తిగా కోల్పోవాల్సి వస్తుంది.
మీరు అవసరంలో ఉన్న, నిజాయితీపరుడైన, నిష్కపటమైన వ్యక్తికి సహాయం చేసినప్పుడు, తప్పకుండా ప్రతిఫలాన్ని పొందుతారు. సరైన వ్యక్తికి సహాయం చేయడం మనశ్శాంతిని ఇస్తుంది , సమాజంలో గౌరవాన్ని పెంచుతుంది.
*రూపశ్రీ.
http://www.teluguone.com/news/content/helping-these-people-could-ruin-your-life-35-227939.html




