తెలంగాణాను ఆదుకోండి..ప్ర‌ధానికి రేవంత్ లేఖ

Publish Date:Jul 16, 2022

Advertisement

గ‌త‌ పది రోజులుగా  కురిసిన భారీ వర్షాలతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో జనజీవనం అస్త వ్యస్తంగా మారింది. తెలంగాణలో కురుస్తున్న వర్షాలతో పాటు ఎగువ నుండి వస్తున్న వరదతో తెలంగాణ రాష్ట్రంలోని అనేక ప్రాంతాలు వరద ముంపుకు గురయ్యాయి. గోదావరికి వరద పోటెత్తడంతో అనేక గ్రామా లు నీట మునిగి,  ప్రజలు నిరాశ్రయులయ్యారు. పంట నష్టం, ఆస్తి నష్టం చోటుచేసుకుంది.  తెలంగాణ లో వరదల పరిస్థితిని జాతీయ విపత్తుగా పరిగణించాలని ప్రధాని నరేంద్ర మోడీకి  టీపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రాసిన లేఖ‌లో విజ్ఞ‌ప్తి చేశారు. 

తెలంగాణ రాష్ట్రంలోని వివిధ గ్రామాలలో నెలకొన్న పరిస్థితిని మళ్లీ సాధారణ స్థితికి  తీసుకురావడానికి జాతీయ విపత్తు ప్రతిస్పందన దళాన్ని వెంటనే పంపించాలని ప్రధాని మోడీ కి రాసిన లేఖలో లేఖలో విజ్ఞప్తి చేశారు. అంతేగాక  పంట నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్ర బృందాన్ని వెంటనే పంపాలని కోరా రు. రైతులకు ఎకరాకు రూ.15,000 నష్టపరిహారం ఇవ్వాలని, పంటలను తిరిగి సాగు చేసేందుకు విత్తనా లు , ఇన్‌పుట్ సబ్సిడీలు ఇవ్వాలని రేవంత్ రెడ్డి ప్రధానికి రాసిన లేఖలో విజ్ఞప్తి చేశారు.

తెలంగాణ రాష్ట్రానికి తక్షణ ఉపశమన ప్యాకేజీగా 2 వేల కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం అందించా లని లేఖలో కోరారు. రోడ్లను మరమ్మతు చేయడానికి పునర్నిర్మించడానికి, నిత్యావసర వస్తువుల సరఫరా ను పునరుద్ధరించటానికి కేంద్రం సహాయం అందించాలని రేవంత్ రెడ్డి కోరారు. అంతేకాదు వరదల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించాలని, కేంద్ర ప్రభుత్వం తెలంగాణ కు తెలంగాణ ప్రజలకు న్యాయం చేస్తుందని ఆశిస్తున్నానని లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రంలో 11 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు వరద ముంపునకు గురయ్యాయని లేఖలో పేర్కొన్న రేవంత్ రెడ్డి వరద ప్రాంతాల్లో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేని దయనీయమైన పరిస్థితి నెలకొందన్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం వరద పరిస్థితిని అంచనా వేయడంలో పూర్తిగా విఫలమైందని రేవంత్ రెడ్డి ప్రధాని మోడీకి రాసిన లేఖలో ఆరోపించారు.

రాష్ట్రంలో కుండ పోత వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారితే, గ్రామాలన్నీ చెరువులను తలపిస్తూ ఉంటే కెసిఆర్ మాత్రం అలాంటిదేమీ లేదని చెబుతున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.  వందేళ్లలో ఎన్నడూ లేని స్థాయిలో కుంభవృష్టి వర్షం కురిసి ఉత్తర తెలంగాణ జిల్లాలో పత్తి, సోయాబీన్, మొక్కజొన్న, వరి, పప్పు ధాన్యాల పంటలు పూర్తిగా నీట మునిగి సర్వనాశనమై పోతే  ఒక ఎకరం కూడా పంట నష్టం జరగలేదని ట్విట్టర్ పిట్ట కూతలు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున పంట నష్టం జరిగి నట్టు సమాచారం లేదని తెలిసి తెలియక మాట్లాడుతున్నారని కేటీఆర్ వ్యాఖ్యానించ‌డం అవివేకమని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.  కమీషన్ల కోసం  ఒక లక్ష కోట్లతో ప్రాజెక్టులు కడుతున్నారని,  కానీ వాటి నిర్వ హణకు నయాపైసా విడుదల చేయడం లేదని మండిపడ్డారు. కాంట్రాక్టర్లకు, కమిషన్ ఇచ్చేవారికి ప్రగతి భవన్ గేట్లు తెరుచుకుంటాయి  కానీ ప్రాజెక్టుల నిర్వహణకు నిధులు ఇవ్వడానికి మాత్రం ప్రగతిభవన్ గేట్లు తెరుచుకోవని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

By
en-us Political News

  
అయితే 2014 ఎన్నికలలో పార్టీ ఘోర పరాజయానికి ఫైర్ బ్రాండ్ నేతల నోటి దురుసు కూడా ఒక ప్రధాన కారణం అయ్యిందని అప్పట్లోనే పరిశీలకులు విశ్లేషించారు. అయితే పరాజయం తరువాత కూడా వైసీపీ తీర మారలేదు. అప్పట్లో నోరున్నది దూషించడానికే అన్నట్లుగా వ్యవహరించిన కొడాలి నాని వంటి వారు ఓటమి తరువాత సైలెంట్ అయిపోయినా.. వారి స్థానంలోకి అంబటి రాంబాబు, పేర్ని నాని వంటి వారు వచ్చి చేరారు.
ఇటీవల కాలంలో ముగ్గురుర వైసీపీ నేతలపై నమోదైన మూడు కేసుల్లో ఆ నేతలు వ్యవహరిస్తున్న తీరు, వారికి పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి మద్దతు విమర్శలకు గురౌతోంది. పూర్తిగా కుటుంబ వివాదాలు, ప్రత్యక్షంగా వారు పాల్పడిన అక్రమాలకు సంబంధించిన ఆధారాలతో నమోదైన కేసులను కూడా రాజకీయ వేధింపులంటూ  వారు మాట్లాడుతున్న మాటలు, చేస్తున్న వ్యాఖ్యలు విస్తుగొలుపుతున్నాయి.
ప్రభుత్వ బాకాలుగా వ్యవహరిస్తున్న మరికొన్ని మీడియా సంస్థల విలేకరులపై కూడా జంతర్ మంతర్ వద్ద నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రదర్శనకారులపై పోలీసుల దాష్టీకాన్నీ, తమ ఆందోళనలపై కేంద్రం అనుసరిస్తున్నఅణచివేతనూ ప్రస్తావించకుండా కేంద్ర ప్రభుత్వ అనుకూలతకే ప్రాధాన్యం ఇవ్వడంతోనే ప్రధాన స్రవంతి మీడియా ప్రజాగ్రహానికి గురౌతోందని చెబుతున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేసిన ఈ వీడియో సందేశంపై ప్రముఖ నటుడు, సామాజిక విమర్శకుడు ప్రకాశ్ రాజ్ ప్రధాని ముఖంలో భయం ప్రస్ఫుటంగా కనిపించిందంటూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
పార్లమెంటు ఉభయ సభలలో ఏదో ఒక సభ లో సభ్యత్వం లేని వ్యక్తి ఆరు నెలల కాల పరిమితి మించి కేంద్ర మంత్రిగా కొనసాగే అవకాశం లేదు. దీంతో మోడీ ఆదేశాల మేరకు రవ్ నీత్ సింగ్ బిట్టూ తన పదవికి రాజీనామా సమర్పించారు.
పరీక్షల్లో పారదర్శకత, విద్యారంగంలో సంస్కరణలు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ తో యువత చేపట్టిన పోరాటానికి మద్దతు ప్రకటించడమే కాకుండా.. జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో సోమవారం జరగనున్న ధర్నాలో స్వయంగా పాల్గొంటానని వెల్లడించారు.
కల్వకుంట్ల తారకరామారావు జన్మదినం జులై 24 ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ కేటీఆర్ కు పాతిక కిలోల సన్నబియ్యాన్ని కానుకగా పంపారు. అదీ తాను స్వయంగా ఆ బర్త్ డే గిఫ్ట్ ను అందించకుండా, ర్యాపిడో బైక్ బుక్ చేసి.. ఆ కానుకను తెలంగాణ భవన్ కు కేటీఆర్ కు పంపించారు.
వాస్తవానికి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునే కేబినెట్ భేటీకి డిప్యూటీ సీఎం హాజరు కాకపోవడానికి రాజకీయ కారణాలున్నాయా అన్న అనుమానాలకు ఆస్కారం లేని పరిస్ధితి ఉంది. ఎందుకంటే.. ఇటీవలే ముంబై లోని కోకిలా బెన్ అంబానీ ఆస్పత్రిలో పవన్ కల్యాణ్ భుజానికి శస్త్ర చికిత్స జరిగింది. ఆయనకుపూర్త విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించడం వల్లనే కేబినెట్ భేటీకి రాలేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
మత్స్యకారుల నాయకుడిగా, మాజీ మంత్రిగా గుర్తింపు పొందిన సీదిరి అప్పలరాజు ఇటీవల వార్తల్లో నిలిచారు.
జగన్ సొంత కుంపటి పెట్టుకున్న నాటి నుంచీ వెన్నంటి ఉన్న విజయసాయిరెడ్డి, సమీప బంధువు అయిన బాలినేని లకు పార్టీలో దక్కిన మర్యాద తెలిసిందే. ఇప్పుడు తాజాగా నిన్న మొన్నటి వరకూ జగన్ కు అత్యంత సన్నిహితుడిగా, నమ్మిన బంటుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డికి ఇప్పుడు కనీసం తాడేపల్లి ప్యాలెస్ గేటు వద్ద ఎంట్రీ కూడా దొరకడం లేదు.
ఇటీవల నిరుద్యోగ యువతను ఉద్దేశించి సుప్రీంకోర్టు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు నిరసనగా, సామాజిక మాధ్యమాల్లో రాజుకున్న ఆగ్రహం ఇప్పుడు దేశ రాజధాని జంతర్ మంతర్ వద్ద విశ్వరూపంతో నిలిచింది. ప్రశ్నించే హక్కును కోల్పోయిన తరానికి ప్రాతినిధ్యం వహిస్తూ కాక్రోచ్ జనతా పార్టీ రూపంలో విద్యార్థులు, యువత ఉద్యమిస్తున్నారు.
ఏపీలో కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేని వైసీపీ ఈ అంశాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తోంది. జాతీయ స్థాయి నీట్ లీకేజీ వ్యవహారంలోకి ఏపీ మెగా డీఎస్సీ పరీక్షల అంశాన్ని జోడించి లబ్ధి పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన డీఎస్సీ పరీక్షల్లో అనేక అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వైసిపి నాయకత్వం విమర్శిస్తూ, నీట్ తో పాటు డీఎస్సీ అక్రమాలపై కూడా విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తోంది.
దేశవ్యాప్తంగా నీట్ పరీక్షల నిర్వహణ, ప్రశ్నాపత్రాల లీకేజీ ఆరోపణలు తీవ్ర స్థాయిలో దుమారం రేపుతున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.