వారసులొస్తే.. రెబల్స్ రె‘ఢీ’.. టీఆర్ఎస్ కు కొత్త తలనొప్పి

Publish Date:May 10, 2022

Advertisement

ఉన్న సమస్యలు చాలవన్నట్లు తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ కు వచ్చే ఎన్నికలలో కొత్త తలనొప్పి ఎదురయ్యే ప్రమాదం కనిపిస్తున్నది. ఏనిమిదేళ్లుగా అధికారంలో ఉన్న ఆ పార్టీలో వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు పలువురు ఆశావహులు సిద్ధంగా ఉన్నారు. అయితే సిట్టింగులు, సీనియర్లు, మంత్రులు మాత్రం తమ తమ నియోజకవర్గాలలో తాము పదిలం అని భావిస్తూనే.. గెలుపునకు అనువుగా ఉన్న నియోజకవర్గాలలో తమ వారసులను రంగంలోకి దింపేందుకు ఇప్పటి నుంచే ప్రయత్నాలు ఆరంభించేశారు. అదిగో ఆ ప్రయత్నాలే అధికార పార్టీకి కొత్త తన నొప్పులు తెచ్చిపెడతాయంటున్నారు. ఇంత కాలంగా పార్టీని నమ్ముకుని నియోజకవర్గంలో చురుకుగా వ్యవహరించిన ఆశావహులు, ఇప్పుడు నేతల వారసుల ఎంట్రీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తమను కాదని వారసులకు పార్టీ టెకెట్లు ఇస్తే.. రెబల్స్ గా పోటీ చేసి సత్తాచాటుతామంటూ ఇప్పటి నుంచే హెచ్చరికలు చేస్తున్నారు.

కరీంనగర్ జిల్లా కోరుట్ల, పెద్ద పల్లి నియోజకవర్గాలలో వారసుల ప్రవేశంపై స్థానిక టీఆర్ఎస్ క్యాడర్ లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమౌతున్నది. కోరుట్ల ఎమ్మెల్యే  కల్వకుంట్ల విద్యాసాగరరావు తన కుమారుడిని వచ్చే ఎన్నికలలో తన నియోజకవర్గం నుంచే బరిలోకి దింపాలని ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభించారని చెబుతున్నారు. అందుకు తగ్గట్టుగానే విద్యాసాగరరావు తనయయు సంజయ్ కోరుట్ల నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటనలు చేస్తున్నారు. రాజకీయాలలో అవగాహన పెంచుకోవడంతో పాటు జనం సమస్యలూ తెలుసుకుంటూ, పార్టీ కార్యక్రమాల్లో క్రియా శీలంగా పాల్గొంటున్నారు. తండ్రి తరఫున ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడంలో చురుకుగా పాల్గొంటున్నారు. వచ్చే ఎన్నికలలో తాను పోటీ చేయకుండా కుమారుడిని బరిలోకి దింపాలన్నది విద్యాసాగరరావు వ్యూహంగా చెబుతున్నారు. అయితే ఇక్కడే కోరుట్ల నుంచి టికెట్ ఆశిస్తున్న ఆశావహుల్లో అసమ్మతి బీజాలు మొలకెత్తుతున్నాయి. విద్యాసాగరరావు ఇక్కడ నుంచి పోటీ చేస్తే ఓకే కానీ ఆయన పోటీ చేయని పక్షంలో తమకే అవకాశం ఇవ్వాలని వారు ఇప్పటి నుంచే గళమెత్తుతున్నారు. తమకు టికెట్ దక్కని పక్షంలో రెబల్ గా బరిలోనికి దిగి సత్తా చాటుతామని హెచ్చరికలూ చేస్తున్నారు. దాదాపు ఇటువంటి పరిస్థితే పెద్దపల్లి నియోజకవర్గంలోనూ నెలకొని ఉంది. ప్రస్తుతం పెద్దపల్లి మునిసిపల్ చైర్మన్ గా ఉన్న దాసరి మమత.. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో పెద్దపల్లి నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలని ఆమె మామ, సిట్టింగ్ ఎమ్మెల్యే దాసని మనోహరరెడ్డి ప్రయత్నాలు ప్రారంభించారు.  ఇప్పటి నుంచే ఆయన నియోజకవర్గలో మమతకు ఎవరూ పోటీగా ఎదగకుండా చర్యలు ప్రారంభించారని చెబుతున్నారు. అయితే ఆయన ప్రయత్నాలకు స్థానిక నేతల నుంచి పెద్దగా మద్దతు రావడం లేదని తెలుస్తోంది. ఈ సారి పెద్దపల్లి టిఆర్ఎస్ లో అసమ్మతి జ్వాలలు ఎగసిపడటం ఖాయమని స్థానిక నేతలు చెబుతున్నారు. మమతకు రెబల్స్ బెడద తప్పకపోవచ్చనీ అంటున్నారు. 

వారసుల రాజకీయ ఎంట్రీ వార్తలతో ఇప్పటి నుంచే టీఆర్ఎస్ లో అసమ్మతి జ్వాలలు రగులుకుంటున్నాయి. ఎన్నికల నాటికి ఇవి మరింత పెరిగి అధికార పార్టీకి తలనొప్పులు తెచ్చిపెట్టడం ఖామయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

By
en-us Political News

  
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
తట్టంచావడి నియోజకవర్గం నుంచి ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆయన పోటీ చేసిన మరో స్థానమైన మంగళంలోనూ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.