వైసీపీలో తెరపైకి వారసులు.. రెడ్డి సామాజిక వర్గ వారేనా?

Publish Date:Aug 23, 2023

Advertisement

పాత తరం పోతే కొత్త తరం వస్తుంది. రాజకీయాలలోనే కాదు ఏ రంగంలో అయినా ఈ మార్పు అనివార్యం. అవసరం కూడా. అయితే, రాజకీయాలలో కొందరి వారసులు మాత్రమే కొత్త తరం నేతలుగా ఎదుగుతుంటారు.  గతంలో వారసులంటే కేవలం కుమారులే కాగా ఇప్పుడు వారసురాలుగా కుమార్తెలు కూడా రాజకీయాలలో అడుగు పెడుతున్నారు. కాగా  ఏపీలో కూడా ఎన్నికల కదలిక మొదలవుతున్నది. ఇప్పటికే తెలంగాణ అధికార బీఆర్ఎస్  అభ్యర్థుల జాబితా ప్రకటించగా.. మిగిలిన పార్టీలు కూడా ఇక్కడ అభ్యర్థుల ఎంపిక లో ఉన్నాయి.  నేడో రేపో జాబితాలు ప్రకటించేస్తాయి. కాగా ఏపీ విషయానికి వస్తే అధికార పార్టీ వైసీపీ ఇప్పటికే పలు సర్వేల ఫలితాల ఆధారంగా అభ్యర్థుల ఎంపికపై కసరత్తు  మొదలు పెట్టింది. గత ఎన్నికలలో 151 సీట్లతో ఘన విజయం దక్కించుకోగా ఇప్పుడు ఆ 151 మందిలో ఎంతమందికి టికెట్లు దక్కుతాయన్నది ఆసక్తిగా మారింది. యాభైకి పైగా స్థానాలలో ఈసారి మార్పు తప్పదన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పలు చోట్ల వారసులను రంగంలోకి దింపాలని సీనియర్ నేతలు ఆశపడుతున్నారు. తమ ఆశ నెరవేర్చుకునేందుకు తమ వంతు కృషి కూడా చేస్తున్నారు.

ఈసారి ఎన్నికలకు తమ స్థానంలో తమ వారసులకు టికెట్లు కేటాయించాలని కొందరు నేతలు ఆశపడుతుంటే.. మరి కొందరు మాత్రం తమతో పాటు తమ వారసులకు కూడా టికెట్లు కావాలని అధిష్ఠానం వద్ద పట్టుబడుతున్నారు. ఎంపీ సుభాష్ చంద్రబోస్ ఇప్పటికే తన వారసుడికి టికెట్ ఇవ్వాలని పట్టుబడుతున్న సంగతి తెలిసిందే. రామచంద్రాపురం నుంచి పిల్లి సూర్య ప్రకాష్ పోటీ చేయాలని ఆరాటపడుతున్నారు. ఇక్కడ చెల్లుబోయిన గోపాలక్రిష్ణకు మరోసారి టికెట్ ఇస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో స్వతంత్రంగా పోటీ చేసేందుకు వెనుకాడబోమని కూడా సుభాష్ పేర్కొన్నారు. అధిష్టానం పిలిచి బుజ్జగించడంతో కాస్త సైలెంట్ గా ఉన్నారు. అయితే  టికెట్ కేటాయించకపోతే అనుకున్నది చేసేలా ఉన్నారు. ఇక తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఇప్పటికే తన   కుమారుడు అభినయ్ రెడ్డికి పార్టీ టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. ఇప్పటికే తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ గా ఉన్న అభినయ్ రెడ్డి నియోజకవర్గంలో అన్నీ తానై నడిపిస్తున్నారు. 

అలాగే ఇదే చిత్తూరు జిల్లా నుండి చంద్రగిరి నుంచి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తన తనయుడు మోహిత్ రెడ్డికి టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. మోహిత్ రెడ్డి ఈ మధ్యనే తుడా చైర్మన్ పదవి కూడా అప్పగించారు. మోహిత్ కూడా చంద్రగిరి రాజకీయాలన్నీ తన చేతుల మీదుగానే నడిపిస్తున్నారు. ఇక మరో ఎమ్మెల్యే పేర్ని నాని, మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన క్రిష్ణప్రసాద్, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా, మంత్రి విశ్వరూప్, శాసనసభాపతి తమ్మినేని సీతారాం, మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి, బాలినేని శ్రీనివాస్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి ఇలా చాలామంది తమ వారసులను ఈసారి ఎలాగైనా ప్రత్యక్ష ఎన్నికలలోకి దింపాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. వీరిలో ఇప్పటికే కొంతమంది అధిష్టానం వద్ద విన్నపాలు చేసుకోగా ఒకరిద్దరు అయితే ఏకంగా అల్టిమేటం జారీచేసినట్లుగా చెప్తున్నారు. 

అయితే, ఎంతమంది నేతలు తమ వారసుల కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా కొందరికి మాత్రమే ఈ విషయంలో లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తుంది. రెడ్డి సామజిక వర్గానికి చెందిన భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు అభినయ్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డిలకు ఇప్పటికే టికెట్లు ఖరారు కాగా.. శిల్పా మోహన్ రెడ్డి కుమారుడు రవిచంద్రారెడ్డి పోటీ చేయడం కూడా దాదాపుగా ఖరారైనట్లేనని చెప్తున్నారు. ఇక బాలినేని, వైవీ సుబ్బారెడ్డిల వారసుల ఎంట్రీపై కూడా కసరత్తులు మొదలు కాగా.. రానున్న ఎన్నికలలో వారికి టికెట్లు దక్కినా ఆశ్చర్యం లేదని చెప్తున్నారు. ఈ రెడ్డి సామాజికవర్గ నేతల వారసులు కాకుండా మిగతా నేతల వారసులకు మాత్రం ఈసారి కూడా మొండి చేయే అనే ప్రచారం వైసీపీ వర్గాలలో జోరుగా  సాగుతోంది.  

ఉదాహరణకు పిల్లి సుభాష్ వారసుడి స్థానంలో చెల్లుబోయినకే దాదాపుగా టికెట్ ఇవ్వనున్నారు. ఇక పేర్ని నానీ, ధర్మాన, తమ్మినేని వారసులకు ఇంకా సమయం ఉందని ఇప్పటికే పరోక్షంగా జగన్ సూచనలు చేసినట్లు తెలుస్తున్నది. దీని బట్టి చూస్తే వైసీపీలో వారసులు వస్తారు.. కానీ ఒక సామజిక వర్గానికి చెందిన యువనాయకులకు మాత్రమే ఆ అవకాశం దక్కుతుందని స్పష్టంగా తెలుస్తోంది.

By
en-us Political News

  
పేద అమ్మాయిల వివాహాలకు ఎనిమిది గ్రాముల బంగారం, ఓ పట్టుచీర కానుకగా ఇస్తామన్నారు. ఐదు ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్న రైతుల వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తామన్నారు. స్వయం సహాయక బృందాలకు రూ.5 లక్షలు వడ్డీ లేని రుణాలు, ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో డ్రాపవుట్‌ లేకుండా చేసేందుకు విద్యార్థుల తల్లులకు ఏడాదికి రూ.15 వేలు ఆర్థిక సహాయం చేస్తామన్నారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
నారా లోకేష్ నాయకత్వానికి ఈ ఆమోదం, ఈ అంగీకారం అంత సులభంగా ఏమీ రాలేదు. అసలు నారా లోకేష్ రాజకీయాలలో తొలి అడుగులు పడకముందే ఆయన నడకను ఆపేయాలని చూశారు. రాజకీయాలలో ఓనమాలు దిద్దడానికి ముందే ఆయన ఎదుగుదలను అణచివేయాలన్న ప్రయత్నాలు జరిగాయి.
ఆ పార్టీ ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఈ అంశంపై స్పందిస్తూ.. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంపై ప్రశంసలు కురిపించారు. పెరుగుతున్న జనాభా ప్రాతిపదికన అసెంబ్లీ మరియు లోక్‌సభ స్థానాలను సుమారు 50 శాతం మేర పెంచాలని కేంద్రం భావించడం అభివృద్ధికి సంకేతంగా అభివర్ణించారు. ఈ ప్రక్రియ కోసం ఒక స్పష్టమైన విధివిధానాన్ని అనుసరిస్తుండటం పట్ల వైసీపీకి ఎలాంటి అభ్యంతరాలూ లేవని వాకృచ్చారు.
మహిళా రిజర్వేషన్ ను డిలిమిటేషన్‌తో లింక్ చేయడం కేంద్రం చేస్తున్న పెద్ద కుట్రగా అభివర్ణించారు. మహిళా బిల్లు, డిలిమిటేషన్ రెండూ వేర్వేరు అంశాలన్న కల్వకుంట్ల కవిత.. ఈ రెంటినీ లింక్ చేసి.. మహిళల భుజాలపై తుపాకీ పెట్టి డిలిమిటేషన్ అంశాన్ని కాల్చాలని కేంద్రం ప్రయత్నిస్తోందన్నారు.
తృణమూల్ నేతల వాహనాలను సోదాలు చేస్తున్న అధికారులు, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఇతర బీజేపీ కీలక నేతల కాన్వాయ్‌లను ఎందుకు తనిఖీ చేయడం లేదని నిలదీశారు. నిబంధనలు అందరికీ సమానంగా ఉండాలని, కానీ బెంగాల్‌ లో మాత్రం పక్షపాత వైఖరి కనిపిస్తోందన్నారు.
కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ సభలో రాజ్యాంగ సవరణ బిల్లుతో పాటు డీలిమిటేషన్ బిల్లును కూడా ప్రవేశపెట్టారు. అదేవిధంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కేంద్రపాలిత ప్రాంతాల సవరణ బిల్లును సభ ముందు ఉంచారు. నారీ శక్తి వందన్ అధినియమ్ ద్వారా 2029 ఎన్నికల నాటికి మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలని కేంద్రం భావిస్తోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన తప్పనిసరి అని ప్రభుత్వం పేర్కొంటోంది.
నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత క్రియాశీలక నాయకుడు.
బిహార్ రాజకీయ ముఖచిత్రం మరోసారి అనూహ్య మలుపు తిరిగింది.
2024 ఎన్నికలలో తెలుగుదేశం కూటమి ఘన విజయం సాధించి అధికారపగ్గాలు చేపట్టడం వెనుక నిస్సందేహంగా లోకేష్ యువగళం పాత్రదే ప్రధాన, కీలక భూమిక. తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అటు పార్టీలో, ఇటు ప్రభుత్వంలో లోకేష్ అత్యంత క్రీయాశీల పాత్ర పోషిస్తున్నారడానికి ఇసుమంతైనా సందేహం అవసరం లేదు.
నారా లోకేష్ గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో యువగళం పాదయాత్ర ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు చేరువయ్యారు. క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపడమే కాకుండా, పార్టీ ఎన్నికల ప్రచారంలోనూ కీలక పాత్ర పోషించారు. మంగళగిరి నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో విజయం సాధించిన తర్వాత పార్టీలో ఆయన ప్రాధాన్యత ఒక్కసారిగా పెరిగింది.
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె పర్యటనకు హాజరుకాకూడదని స్థానిక మత్స్యకారులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ నిబంధనను అతిక్రమించి ఎవరైనా జగన్ పర్యటనకు వెడితే.. వారికి ఏకంగా ఒక లక్ష రూపాయల భారీ జరిమానా విధిస్తామని మత్స్యకార సంఘాల ప్రతినిధులు హెచ్చరించారు.
పార్టీ సిద్ధాంతాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలని, పార్టీ సిద్ధాంతాలే నాయకత్వానికి బలం అని విద్య, ఐటి శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ పిలుపునిచ్చారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.