రాజ్యసభలో శునకోపాఖ్యానం

Publish Date:Dec 20, 2022

Advertisement

రాజస్థాన్ లో జరుగుతున్న రాహుల్ భారత జోడో యాత్రలో పాల్గొన్న ఖర్గే వ్యాఖ్యలపై మంగళవారం (డిసెంబర్ 20) రాజ్యసభ దద్దరిల్లింది. ఇంతకీ మల్లికార్జున్ ఖర్గే భారత్ జోడో యాత్రలో ఏమన్నారంటే.. భారత దేశం కోసం నిజమైన త్యాగాలు చేసినది కాంగ్రెస్సేననీ, బీజేపీ కనీసం ఒక్క శునకాన్ని కూడా కోల్పోలేదనీ అన్నారు. ఈ వ్యాఖ్యలే రాజ్యసభను అట్టుడికించేశాయి.

మల్లికార్జున్ ఖర్గే తన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని బీజేపీ సభలో డిమాండ్ చేసింది. ఇందుకు ఖర్గే నిరాకరించారు. దీంతో సభలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్పీకర్ వారిస్తున్నా బీజేపీ సభ్యలు శాంతించలేదు. ఆందోళనకు దిగారు

. సోమవారం(డిసెంబర్ 19) ఖర్గే రాజస్థాన్ లోన అల్వార్ లో భారత్ జోడో యాత్రలో భాగంగా జరిగిన ర్యాలీని ఉద్దేశించి మాట్లడారు. పులిలా గర్జిస్తామంటుంది కానీ పిల్లిలా  ప్రవర్తిస్తుందంటూ కేంద్ర ప్రబుత్వంపై విమర్శలు గుప్పించారు.  సరిహద్దులో చైనా దురాక్రమణలకు పాల్పడుతున్నా.. చేతులు ముడుకుచుని కూర్చుంటుందని దుయ్యబట్టారు. చైనా దురాక్రమణలపై పార్లమెంటులో చర్చకు మాత్రం అంగీకరించదంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దేశం కాంగ్రెస్ నిలబడిందనీ, ఎందరో కాంగ్రెస్ నాయకులు ప్రాణత్యాగాలు చేశారనీ ఖర్గే అన్నారు.

అదే సమయంలో బీజేపీ దేశం కోసం ఒక్క శునకాన్ని  కూడా కోల్పోలేదని ఎద్దేవా చేశారు. ఆ వ్యాఖ్యలే మంగళవారం (డిసెంబర్ 20) రాజ్యసభలో దుమారానికి కారణమయ్యాయి. ఖర్గే వ్యాఖ్యలను నిరసిస్తూ బీజేపీ సభలో ఆందోళకు దిగింది. ఖర్గే క్షమాపణకు డిమాండ్ చేసింది. అయితే ఖర్గే క్షమాపణకు ససేమిరా అన్నారు. పార్లమెంటు బయట చేసిన వ్యాఖ్యలపై సభలో చర్చ జరగాల్సిన అవసరం లేదన్నారు. అయినా తాను చేసిన వ్యాఖ్యలు అక్షర సత్యాలన్నారు. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ దేశం కోసం త్యాగాలు చేశారనీ, బీజేపీలో ఎవరు  ప్రాణ త్యాగం చేశారో చెప్పాలనీ డిమాండ్ చేశారు.  

By
en-us Political News

  
రెక్కల కష్టంతో బతుకులు.. రోడ్డు ప్రమాదంతో ఆవిరైన ప్రాణాలు.!
హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది.
పండుగ వేళ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉత్సాహపూరిత వాతావరణం నెలకొంది.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
రాజకీయ నాయకులపై ప్రజలకు ఉండే అభిమానం ఒక్కోసారి అసాధారణ రీతిలో వ్యక్తమవుతుంది.
టాలీవుడ్ సినీ పరిశ్రమలో వరుస వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుండగా
దీపావళి పండగ అనగానే ప్రతి ఇంటా సంబరాలు, బాణసంచా చప్పుళ్లు సర్వసాధారణం.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చెన్నై వేదికగా ఇటీవల వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె వివాహం ఎంతో వైభవంగా జరిగింది.
అప్పుడప్పుడే లోకాన్ని చూడటం మొదలుపెట్టింది. అమ్మా నాన్నల ఒడిలో గోరుముద్దలు తింటూ.. బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుకోవాల్సిన వయసు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.