శ్రీ రామనవమికి భద్రాద్రిలో భారీ బందోబస్తు

Publish Date:Apr 5, 2025

Advertisement

16 మంది డీఎస్పీలు,66 మంది సీఐలు

భద్రాచలంలో ఆదివారం (ఏప్రిల్ 6)జరగనున్న శ్రీ సీతారామ స్వామి కల్యాణ మహోత్సవానికి భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో సీతారామస్వామి కల్యాణ మహోత్సవానికి హాజరు కానున్నారు.   గత ఏడాది లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఎలక్షన్ కోడ్ ఉండటంతో వీఐపీలు పెద్దగా హాజరు కాలేదు. ఈ సారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తోపాటు పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు పెద్దఎత్తున తరలివస్తున్నారు. సోమవారం జరిగే పట్టాభిషేకం కార్యక్రమానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హాజరవుతున్నారు.

దీనికి తగ్గట్టుగానే అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆదివారం స్వామివారి కల్యాణోత్సవం, సోమవారం పట్టాభిషేకం జరగనుంది. కల్యాణోత్సవం జరిగే మిథిలా స్టేడియంను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. చలవ పంతుళ్లు వేశారు. వేసవి వేడికి భక్తులకు దాహార్తిని తీర్చేందుకు మంచి నీటి సౌకర్యం తో పాటు మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేయనున్నారు. ఇదే సమయంలో భద్రతా ఏర్పాట్లు కూడా భారీగానే చేపట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో సహా పలువురు వీఐపీలు హాజరవుతుండటం,  సరిహద్దు రాష్ట్రంలో మావోల కదలికలు, తాజా ఎన్ కౌంటర్ల నేపథ్యంలో  రాష్ట్ర పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది . శ్రీ రామనవమి కి భక్తులు కూడా భారీగానే హాజరవుతున్నారు .

దీన్ని దృష్టిలో పెట్టుకుని భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిలో భాగంగానే 16 మంది డీఎస్పీలు,66 మంది సీఐలు,185 మంది ఎస్సైలు,ఏఎస్సైలు, 304 మంది హెడ్కానిస్టేబుళ్లు, 208 మంది మహిళా పోలీసుసిబ్బంది, 555 మంది కానిస్టే బుళ్లు, హోంగార్డులు 404 మంది ,డాగ్ స్క్వాడ్, రోప్ పార్టీ, 5 బృందాల ప్రత్యేక దళం ఆధ్వర్యంలో బందోబస్తు పర్యవేక్షిస్తున్నారు.. ఎక్కడికక్కడ మెటల్ డిటెక్టర్లు ఏర్పాటు చేశారు. పెద్ద సంఖ్యలో సీసీటీవీ కెమెరాలు, నిఘా విభాగం సిబ్బంది కూడా పెద్ద సంఖ్యలో మోహరించారు.

By
en-us Political News

  
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్,   విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.  
 నామినేషన్ల ఉపసంహరణ గడువు  ముగిసే నాటికి  రాష్ట్ర వ్యాప్తంగా  77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.  ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు.  గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్‌లో   మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.