బాసరకు పోటెత్తిన భక్తులు: జ్ణానసరస్వతి జన్మనక్షత్రం సందర్భంగా పెద్ద సంఖ్యలో అక్షరాభ్యాసాలు.!

Publish Date:Oct 16, 2026

Advertisement

తెలంగాణ రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి జన్మనక్షత్రమైన మూలా నక్షత్ర వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలలో అత్యంత ప్రాముఖ్యత ఉన్న  ఈ పర్వదినం సందర్భంగా శుక్రవారం (అక్టోబర్ 16) ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు.

జ్ఞాన ప్రదాయిని అయిన అమ్మవారిని మూలా నక్షత్రం రోజున అమ్మవారిని దర్శించుకుంటే సకల విద్యాభివృద్ధి కలుగుతుందని, పిల్లలకు  బుద్ధికుశలత లభిస్తుందని భక్తుల విశ్వాసం. అందుకే  తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది   తమ చిన్నారులతో కలిసి బాసర క్షేత్రానికి పోటెత్తారు. అమ్మవారి సన్నిధిలో అక్షరాభ్యాస కార్యక్రమాలు నిర్వహించారు. 

భక్తుల భారీ రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు,  జిల్లా యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. క్యూలైన్లలో గంటల తరబడి వేచి ఉండే భక్తులకు ప్రత్యేక తాత్కాలిక షెడ్లు  ఏర్పాటు చేశారు. అంతేకాకుండా క్యూలైన్లలో తీవ్రమైన రద్దీ మధ్య నిరీక్షిస్తున్న భక్తులకు, ముఖ్యంగా చిన్నపిల్లలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వేడి పాలు, బిస్కెట్లు ఉచితంగా పంపిణీ చేశారు.  భక్తుల భద్రత,  శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసు శాఖ బందోబస్తు ఏర్పాటు చేసింది.  

కాగా పలువురు ప్రముఖ రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు బాసర ఆలయాన్ని సందర్శించారు.   ఎమ్మెల్యే రామారావు పటేల్, మాజీ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, మాజీ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తదితరులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేశం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరికీ ఆ తల్లి ఆశీస్సులు లభించాలని  అమ్మకారిని కోరుకున్నారు.  

[Heavy Rush Basara, Basara Moola Nakshatra, Basara Jnana Saraswathi Temple, Aksharabhyasam, Goddess Saraswati, Dasara Navaratri, Telugu One]

By
en-us Political News

  
ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించనున్న జాతీయ స్థాయి నిరసన ర్యాలీకి తెలంగాణ నుంచి పార్టీ శ్రేణులను తరలించేందుకు ప్రత్యేక రైళ్లు కేటాయించకపోవడంపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో ప్రయాణికురాలు తోసివేయడంతో గాయపడిన టీజీఎస్‌ఆర్టీసీ కండక్టర్ ప్రవళికకు ప్రభుత్వం అండగా ఉంటుందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ భరోసా ఇచ్చారు.
సీనియర్ ఐఏఎస్ అధికారి జయేశ్ రంజన్ స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్) కోసం ప్రభుత్వానికి దరఖాస్తు సమర్పించారు. ఈ నిర్ణయం రాష్ట్ర పాలనా వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.  తదుపరి సీఎస్ రేసులో  ఉన్న జయేష్ రంజన్ వీఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకోవడం సంచలనంగా మారింది. 
మరీ ముఖ్యంగా హైదరాబాద్ పై చలిపులి పంచా విసిరింది.  ఉదయం పూట ఎండ తీవ్రత ఎంత ఎక్కువగా ఉంటున్నా, రాత్రి వేళల్లో,  తెల్లవారుజామున చలి తీవ్రత భారీగా ఉంటోంది.  
కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బొమ్మకల్ సల్ఫీ నగర్‌లో చోటుచేసుకున్న ఒక అంతులేని విషాద ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది
నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు మందగించడం, పెండింగ్ బిల్లులు విడుదల కాకపోవడం పట్ల నిరసన వ్యక్తం చేసిన  జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి తీవ్ర నిరవధిక దీక్ష హెచ్చరిక చేశారు.
అశ్వాపురం మండలం మిట్టగూడెం గ్రామం వద్ద  ఆ మహిళా ప్రయాణీకురాలు   కండక్టర్‌ను బలంగా తోసివేసింది. ఈ ఊహించని పరిణామానికి కండక్టర్ అదుపుతప్పి నడుస్తున్న బస్సులోంచి రోడ్డుపై పడిపోయారు. ఈ ఘటనలో బస్సు వెనుక చక్రాలు ఆమె  కాళ్లపై నుంచి దూసుకెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డారు.  
హైదరాబాద్‌లోని రామంతాపూర్‌లో భారీ పేలుడు కలకలం రేపింది.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణంలో వేగంగా మార్పులు వస్తున్నాయి.
పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ మహిళ నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసిన ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది.
రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంతో తలెత్తే కరువు పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందస్తు వ్యూహాలకు పదును పెట్టింది.
తెలంగాణ రాజకీయాల్లో సన్నవడ్ల సాగు అంశం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.