గ్రేటర్ లో భారీ వర్షం
Publish Date:Sep 24, 2024
Advertisement
గ్రేటర్ హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తోంది. హైదరాబాద్ వాతావరణ శాఖ ఇప్పటికే మంగళవారం అతి భారీ వర్షం కురిసే అవకాశముందని హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అవసరమైతే బయటకు రావాలని జిహెచ్ఎంసీ సూచించింది. మధ్యాహ్నం ఓ మోస్తారు వర్షం కురిస్తే సాయంత్రం భారీ వర్షం కురవడంతో ట్రాఫిక్ పూర్తిగా స్థంభించింది. రోడ్లపై నీళ్లు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. విద్యార్థులు, ఉద్యోగులు ఇంటికి వెళ్లాల్సిన సమయంలో భారీ వర్షం కురవడంతో వాళ్లు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మంగళవారం 14 జిల్లాలకు భారీ వర్ష సూచన ఉండటంతో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. తెలంగాణలో సోమవారం నుంచి వరుసగా నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు పడనున్నాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/heavy-rain-in-greater-39-185498.html
http://www.teluguone.com/news/content/heavy-rain-in-greater-39-185498.html
Publish Date:Apr 14, 2026
Publish Date:Apr 14, 2026
Publish Date:Apr 14, 2026
Publish Date:Apr 14, 2026
Publish Date:Apr 14, 2026
Publish Date:Apr 14, 2026
Publish Date:Apr 14, 2026
Publish Date:Apr 14, 2026
Publish Date:Apr 14, 2026
Publish Date:Apr 14, 2026
Publish Date:Apr 14, 2026
Publish Date:Apr 13, 2026
Publish Date:Apr 13, 2026





