దీపావళిలో ఎక్కువగా ఎదురయ్యే ఆరోగ్య సమస్యలు ఇవే..

Publish Date:Nov 11, 2023

Advertisement

 

దీపావళి దేశం యావత్తు సంతోషంగా జరుపుకునే పండుగ. ఈ పండుగ సమయంలో పెద్ద ఎత్తున బాణసంచా కాలుస్తుంటారు. ఒకప్పటికంటే ఇప్పుడు బాణసంచా కూడా అప్డేట్ అయ్యాయి. కేవలం బాణసంచా మాత్రమే కాదు,  ప్రతి ఇంట్లో స్వీట్లు, పిండివంటలు ఘుమఘుమలాడిపోతాయి. ఒకవైపు పటాసుల మోత, మరొకవైపు వంటల పరిమళాలు  మనసును నిలువనీయవు. అయితే ఈ పండుగ కారణంగా  బరువు పెరగడం, రక్తపోటు, మధుమేహం ఉన్నవారిలో చక్కెర స్థాయిలు పెరగడం వంటి సమస్యలు వస్తాయి. వీటి నియంత్రణ ఎవరి చేతుల్లో వారిదే. కాబట్టి వీటి గురించి పెద్దగా భయపడాల్సిన పనిలేదు. కానీ పటాసుల పొగ కారణంగా కళ్లు, శ్వాసక్రియ మొదలైన వాటికి పెద్ద ఎత్తున ప్రమాదం పొంచి ఉంటుంది. దీపావళి సందర్భంగా కళ్ళు, శ్వాస క్రియ  విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలేమిటో తెలుసుకుంటే..

 బాణసంచా కాల్చేటప్పుడు వాటి నుండి వెలువడే స్పార్క్స్ లేదా పొగ నుండి  కళ్లను రక్షించుకోవడానికి రక్షిత గాగుల్స్ ధరించడం చాలా ముఖ్యం . ఈ సాధారణ   గాగుల్స్  ఎగిరే నిప్పురవ్వలు, బాణసంచా తాలుకూ అవశేషాలు,  బాణసంచాలో ఉపయోగించే రసాయనాల నుండి  కళ్ళను రక్షిస్తాయి. అందుకే దీపావళి సమయంలో గాగుల్స్  ధరించడం వల్ల ఇలాంటి సమస్యలను చాలా వరకు నివారించవచ్చు.


 బాణసంచా కాల్చేటప్పుడు సేప్ గా ఉండాలంటే  నిర్ణీత  దూరం పాటించడం అవసరం. పేలుడు సంభవించే  బాణసంచా, నిప్పురవ్వలు ఎగజిమ్మే చిచ్చుబుడ్లు, కాకరవొత్తులు, పటాసులు  కంటికి గాయం కలిగించే ప్రకాశవంతమైన కాంతిని,  మంటలను ఎగజిమ్ముతాయి. ఇలాంటి వాటిని  ఉపయోగించేటప్పుడు  వాటిని దూరం నుండి వెలిగించాలి.

బాణసంచాలో గన్‌పౌడర్‌తోపాటు అనేక రకాల రసాయనాలు ఉంటాయి.  వాటిని తాకిన తర్వాత పొరపాటున కూడా ఆ చేతులతో కళ్లను తాకరాదు.  కళ్లకు తగిలితే తీవ్ర దుష్ప్రభావాలు కలుగుతాయని వైద్యులు చెబుతున్నారు. అందువల్ల, బాణాసంచా తాకడం లేదా కాల్చిన తర్వాత,  ముఖం లేదా కళ్లను తాకడానికి ముందు  చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. చేతులకు అంటిన పటాసుల తాలూకు  అవశేష రసాయనాలు కంటి చికాకు కలిగించవచ్చు.

పటాసులు కాల్చేటప్పుడు కంటి సంరక్షణే కాదు ప్రాణానికి ముఖ్యమైన శ్వాసక్రియ పట్ల కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ పొగను వెలువరిచే బాణసంచాకు దూరంగా ఉండాలి. అలాంటివి కాలుస్తున్నప్పుడు వీలైనంత దూరం వెళ్ళాలి.  పటాసులు కాల్చేటప్పుడు మరచిపోకుండా  మాస్క్ పెట్టుకోవాలి.  ఆస్తమా, శ్వాస సంబంధ సమస్యలు ఇదివరకే ఉన్నవారు  ఇన్ హెలర్ ను వెంట ఉంచుకోవాలి.  పటాసులు కాల్చేటప్పుడు పెద్ద మొత్తంలో ఒకేసారి పటాసులు పేల్చకుండా గ్యాప్ తీసుకోవాలి. పోటీ పెట్టుకుని అందరూ ఒకేసారి కాల్చడాన్ని నివారించాలి.

ఇంకొక విషయం ఏమిటంటే ఇప్పట్లో ఏ పని చేస్తున్నా దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకుని సంబంరపడాలని అనుకునేవారు చాలా ఎక్కువ. పటాసులు కాలుస్తూ వీడియోలు, సెల్పీలు తీసుకుంటూ పటాసులను నిర్లక్ష్యం చేయకూడదు. పరిసరాల మీద స్పృహ ఉండాలి.  చిన్నపిల్లలతో పటాసులు కాల్పించేటప్పుడు పెద్దలు దగ్గరే ఉండాలి.

                                                     *నిశ్శబ్ద.

By
en-us Political News

  
ఎండల ప్రభావం వల్ల లేదా మనం తినే ఆహారపు అలవాట్ల వల్ల చాలామందిలో శరీర ఉష్ణోగ్రత (Body Heat) అకస్మాత్తుగా పెరిగిపోతూ ఉంటుంది. ఆయుర్వేదం ప్రకారం..
అల్పాహారం రోజులో అత్యంత ముఖ్యమైన విభాగంగా పరిగణించబడుతుంది, ఎందుకంటే ఇది శరీరానికి రోజంతా అవసరమైన శక్తిని అందించడంలో సహాయపడుతుంది. అయితే సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం వల్ల, చాలా మంది..
ఆయుర్వేదం భారతీయులకు ఋషులు అందించిన గొప్ప వైద్య విధానం. ఈ ఆయుర్వేద వైద్యంలో వ్యాధిని మూలాల నుండి నిర్మూలించడం జరుగుతుంది.  సైన్స్ కనుగొనలేని ఎన్నో రకాల జబ్బులకు ఆయుర్వేదంలో వైద్యం దొరుకుతుంది...
ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న ప్రధాన ఆరోగ్య సమస్య గుండె జబ్బులు (Heart Diseases). మారుతున్న జీవనశైలి, ఒత్తిడి, శారీరక శ్రమ లేకపోవడం మరియు చెడు ఆహారపు అలవాట్ల వల్ల గుండె పనితీరు మందగిస్తోంది...
ప్రస్తుత ఆధునిక కాలంలో శారీరక ఆరోగ్యానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో, మానసిక ఆరోగ్యానికి (Mental Health) కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వడం ఎంతో అవసరం. కానీ, నేటి ఒత్తిడితో కూడిన జీవనశైలి, వ్యక్తిగత సమస్యల వల్ల చాలా మంది...
ఈ రోజుల్లో మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల చాలా మంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య మలబద్ధకం. ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే పైల్స్, గ్యాస్ వంటి ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఎలాంటి మందులు వాడకుండా, ఇంట్లోనే సహజంగా మలబద్ధకాన్ని ఎలా తగ్గించుకోవచ్చో ప్రముఖ ఆయుర్వేద నిపుణులు..
మానవ శరీరంలో ప్రేగుల పాత్ర చాలా ఉంది.,  తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడంలో,  శరీరానికి అవసరమైన పోషకాలను గ్రహించడంలో, వ్యర్థాలను బయటకు పంపడంలో ప్రేగులు చాలా కీలక పాత్ర పోషిస్తాయి. తిన్న ఆహారం..
మన శరీరంలో పొటాషియం స్థాయిలు హెచ్చుతగ్గులు కావడం వల్ల కలిగే అనారోగ్య సమస్యలు, వాటి కారణాలు మరియు నివారణ మార్గాల గురించి ప్రముఖ వైద్యులు డాక్టర్ పాపారావు గారు ఈ వీడియోలో క్లుప్తంగా వివరించారు...
మూత్రపిండాలు శరీరం నుండి విషపదార్థాలను తొలగించడం, రక్తపోటును నియంత్రించడం,  శరీరంలో నీరు, ఖనిజాలను బాలెన్స్డ్ గా ఉంచడం వంటి   ముఖ్యమైన విధులను నిర్వర్తిస్తాయి. అయితే, కొన్ని అనారోగ్యకరమైన..
చాలా మందిని వేధించే ప్రధాన ఆరోగ్య సమస్యల్లో ‘తల తిరగడం’ (Vertigo/Dizziness) ఒకటి. హఠాత్తుగా కళ్ళు తిరగడం వల్ల భయం, అసౌకర్యం కలగడమే కాకుండా రోజువారీ పనులు చేసుకోవడం కష్టమవుతుంది.
చాలా మందికి రాత్రిపూట వేడివేడి అన్నం తింటే గాని నిద్ర పట్టదు. కానీ, బరువు తగ్గాలని లేదా ఫిట్‌గా ఉండాలని ప్రయత్నించే వారికి..
మనలో చాలా మందికి అద్దంలో చూసుకున్నప్పుడు కొన్ని శరీర భాగాలు నచ్చవు. ముఖ్యంగా ఎంత వ్యాయామం చేసినా, ఎంత కఠినమైన డైట్ పాటించినా తగ్గని మొండి కొవ్వు మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది...
ప్రస్తుత రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలా మంది మహిళలను వేధిస్తున్న అతిపెద్ద సమస్య పి.సి.ఓ.డి (PCOD). అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది..
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.