కరోనా వేళ.. వివాదంలో హెల్త్ డైరెక్టర్

Publish Date:Dec 23, 2022

Advertisement

ప్రభుత్వ అధికారులకు కులం ఉంటుంది. మతం ఉంటుంది. వద్దనుకుంటే అది వేరే విషయం. కానీ, వద్దనుకున్నా,  ప్రతి ఉద్యోగి, అధికారి కులం, మతంకు సంబందించిన వివరాలన్నీ ప్రభుత్వ రికార్డులలో భద్రంగా ఉంటాయి. అయితే  అదే సమయంలో ప్రభుత్వ ఉద్యోగులు తమ విధుల్లో కుల, మత విశ్వాసాల ప్రస్తావన చేయడం, కుల, మత వివక్ష చూపడం గానీ చేస్తీ అది  నేరం అవుతుంది. మత ప్రచారం చేయడం మరింత పెద్ద నేరం, అపరాధం అవుతుంది.  అందుకే తెలంగాణ రాష్ట్ర హెల్త్ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌ శ్రీనివాస్ రావు ఏసుక్రీస్తు దయతోనే దేశంలో కరోనా కేసులు తగ్గాయని చేసిన వ్యాఖ్యలు వివాదాస్పద మయ్యాయి. అంతేకాదు, క్రైస్తవం వల్లే దేశం అభివృద్ధి చెందిందని ఆయన చెప్పారు.ఆఫ్కోర్స్ అది ఆయన వ్యక్తీ గత విశ్వాసం కావచ్చును. కానీ  ఆయన ఒక ప్రభుత్వ అధికారి, ఆవిషయం మరిచి పోయి చేసిన వ్యాఖ్య సహజంగానే దుమారం రేపుతోంది.  

 భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో శ్రీనివాసరావు చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. నిజానికి ఆయన ఒక్క కరోనా గురించి మాత్రమే మాట్లాడి వదిలేయలేదు. ప్రపంచానికి, అభివృద్ధి పాఠాలు నేర్పిందే క్రైస్తవ మతమని మరో వివాదస్పద వ్యాఖ్య చేసారు. అలాగే, ప్రపంచం  అభివృద్ధి చెందడానికి క్రైస్తవులే కారణమన్నారు. అలాగే, క్రైస్తవ మత ప్రచారానికి కూడా ఆయన పిలుపు నిచ్చారు. కరోనా నుంచి పూర్తిగా విముక్తి చెందామని, మంచిని ఆచరించాలని..దాని కోసం అందరూ క్రైస్తవ మతాన్ని ముందుకు తీసుకుపోవాలని సూచించారు.

నిజమే, శ్రీనివాస రావు తమ విశ్వాసాన్ని వ్యక్తపరిచారు. అది కూడా వ్యక్తిగత హోదాలో హాజరైన సెమీ క్రిస్మస్ వేడుకల్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే, రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ పోస్టులో ఉన్న ఆయన, తమ విధుల్లో భాగమైన కరోనా మహమ్మారిని  ఏసు ప్రభువు దయతోనే నిరోధించామని చెప్పడం  విమర్శలకు దారి తీసింది. నిజానికి శ్రీనివాసరావు మత విశ్వాసాల గురించి పెద్దగా తెలియక పోయినా ఆయనకి రాజకీయ ఆశలు, ఆకాంక్షల గురించి మాత్రం వేరే చెప్పనక్కర లేదు. గతంలోనూ ఆయన పబ్లిక్ లో ముఖ్యమంత్రి కేసేఅర్ కాళ్లు మొక్కి, వివాదాస్పద అధికారిగా వార్తల్లోకి ఎక్కారు. అదొక వివాదం అయితే ఇప్పడు మరో వివాదానికి ఆయన తెర తీశారు. రాజకీయ విమర్శలకు కేంద్ర బిందువయ్యారు. సోషల్ మీడియాలో అయితే  శ్రీనివాస రావును చెరిగి పారేస్తున్నారు. 

అంతేకాదు  తీగ లాగితే డొంకంతా కదిలింది అన్నట్లు, వెంకన్న దేవుని పేరు (శ్రీనివాస రావు) పెట్టుకుని క్రైస్తవం పుచ్చుకున్న ఆయనపై, ఇంతకూ ముందు ఏమో కానీ, ఇప్పుడైతే  అవినీతి ఆరోపణలు కుడా వినిపిస్తున్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్  శ్రీనవాసరావు పెద్ద అవినీతి పరుడు అని విమర్శించారు..ప్రజలను ఓ మతానికి చెందిన దేవుడు కాపాడారట. మరి ఆ దేవుడు ఉన్న దేశానికే పో ..  అన్నారు. ఓ మతానికి కొమ్ముకాసే అధికారివా అని ప్రశ్నించారు. ఒక్క హాస్పిటల్ లో కూడా  శ్రీనివాస్ రావు సరైన సౌకర్యాలు కల్పించలేకపోయారని బండి ఆరోపించారు. ఎమ్మెల్యే టికెట్ కోసం మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని విమర్శించారు.  

అదొకటి అలా ఉంటే, తెలంగాణలో ని ప్రముఖ పుణ్యక్షేత్రం బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో అక్షరాభ్యాసం జరిపించే పలకలపై, క్రిస్మస్ ట్రీ బొమ్మలు వెలిశాయనే విమర్శలు వినవస్తున్నాయి. అలాగే ప్రముఖ సినిమా నటులు,సెలబ్రిటీలు గతంలో ఎప్పుడూ లేని విధంగా క్రిస్మస్ వేడుకలుజరుపు కోవడం, సోషల్  మీడియాలో ఫోటోలు పోస్ట్ చేయడం కూడా సమాజంలో మాట విద్వేషాలకు కారణం అవుతోందా ఆనం సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

By
en-us Political News

  
ప్రజల ప్రాణాలకు ముప్పు కలగకూడదని హెచ్చరించడమే ఆయన చేసిన నేరమైంది.
భారతీయ ఆర్థిక వ్యవస్థలో నల్లధనం అరికట్టేందుకు, అవినీతిని పూర్తిగా నిర్మూలించే లక్ష్యంతో పెద్ద నోట్ల రద్దు అంశం ఎప్పుడూ చర్చనీయాంశంగానే ఉంటుంది.
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన ఒక షాకింగ్ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది.
దీపావళి పండుగ వేళ ఛత్తీస్‌గఢ్‌లో అత్యంత హృదయ విదారకరమైన ఘటన చోటుచేసుకుంది.
దేశ రాజధాని ఢిల్లీలో వాతావరణ పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా మారింది.
ఇటీకాల కాలంలో టెక్నాలజీ రంగంలో వస్తున్న మార్పులతో పాటు ఉద్యోగుల పని వాతావరణంలోనూ విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి.
పండుగ వేళ నగరంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.
తెలుగు రాష్ట్రాల ప్రజలను వాతావరణ శాఖ మరోసారి అప్రమత్తం చేసింది.
హైదరాబాద్‌లో వరుస అగ్నిప్రమాదాలు కలకలం రేపుతున్నాయి
హైదరాబాద్‌లో దీపావళి వేడుకల వేళ అపశ్రుతి చోటుచేసుకుంది.
మహిళా సాధికారతే లక్ష్యంగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
రాజకీయాల్లో గెలుపు కోసం ప్రచారం, సభలు, సమావేశాలు.. ఇలా ఎన్నో వ్యూహాలు అవసరమని భావిస్తుంటారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఏడాది దీపావళి వేడుకలను అత్యంత ప్రత్యేమైన ప్రాంతంలో జరుపుకున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.