వావ్.. రోజూ కాసిన్ని నువ్వులు తింటే ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా ..!

Publish Date:Jan 12, 2024

Advertisement

  నువ్వులు భారతీయుల ఆహారంలో చాలా ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి. ఆయుర్వేదం కూడా నువ్వులను గొప్ప ఆహారంగా పేర్కొంది.  నువ్వులలో ప్రోటీన్, కాల్షియం, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఐరన్, ఫైబర్ వంటివన్నీ ఉంటాయి. చలికాలంలో రోజూ కాసిన్ని నువ్వులను తింటే శరీరం వెచ్చగా ఉండటమే కాకుండా ఆరోగ్యంగా కూడా ఉంటుంది. నువ్వులను రోజూ తినడం వల్ల కలిగే ఇతర ఆరోగ్యప్రయోజనాలు ఏంటో తెలిస్తే నువ్వులను అస్సలు వదలకుండా తింటారు.

ఆయుర్వేదం ప్రకారం నువ్వులు వేడి గుణం కలిగి ఉంటాయి. నువ్వులను తీసుకుంటే శరీరంలో వేడి పుడుతుంది. ఇది జఠరాగ్నిని సమతుల్యం చేస్తుంది. సాధారణంగా జఠరాగ్ని లోపించడం వల్ల  జీర్ణశక్తి మందగించి జీర్ణక్రియ తగ్గుతుంది. దీనికారణంగా మలబద్దకం సమస్య ఏర్పడుతుంది. అదే నువ్వులు తింటే ఈ సమస్య పరిష్కారమవుతుంది.

నువ్వులలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి  శరీరంలో ఉన్న చెడు కొవ్వులను తగ్గించడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

శరీరంలో కండరాలు ఆరోగ్యంగా, బలంగా ఉండటానికి ప్రోటీన్ చాలా ముఖ్యం. నువ్వులలో ఉండే ప్రోటీన్ కండరాలను ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా  హార్మోన్ల ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది. నువ్వులలో ఉండే  మాక్రోన్యూట్రియెంట్ జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే చర్మాన్ని  యవ్వనంగా ఉంచుంతుంది.

శరీరం లోపల వాపులు, నొప్పులు వంటివి ఊబకాయం, క్యాన్సర్ వంటి ప్రమాద సమస్యలకు కారణమవుతాయి. నువ్వులలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు  ఈ వాపులు, నొప్పులు తగ్గించడంలోనూ.. శరీరంలో అంతర్గత జబ్బులు నయం చేయడంలోనూ సహాయపడతాయి.

నువ్వులలో విటమిన్-బి1, బి3, బి6 పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో కణాలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. శరీరం అన్ని విధులను సక్రమంగా నిర్వర్థించేందుకు దోహదం చేస్తాయి. విటమిన్-బి లోపం వల్ల శరీరంలో బలహీనత దారుణంగా పెరుగుతుంది.

 నువ్వులు తింటే మహిళలలో నడుము భాగం బలంగా మారుతుంది. ఇది నెలసరి సమస్యలు, గర్బం దాల్చడం, ప్రసవం తరువాత కూడా నడుము బలంగా ఉండటంలో  సహాయపడుతుంది.

కాల్షియం పుష్కలంగా ఉండటం వల్ల నువ్వులు తింటే ఎముకలు బలంగా ఉక్కులాగా మారతాయి. ఆర్థరైటిస్, బోలు ఎముకల వ్యాధి, ఎముకలు పెలుసుబారడం వంటి సమస్యలు వచ్చే ప్రమాదం తగ్గుతుంది.

మహిళల్లోచాలామందిలో కనిపించే రక్తహీనత సమస్యకు నువ్వులు చెక్ పెడతాయి. నువ్వులలో ఉండే ఐరన్ రక్తహీనతకు చెక్ పెడుతుంది.

రక్తపోటు, రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో లేకపోతే రోజూ కాసిన్ని నువ్వులు తినడం అలవాటు చేసుకోవాలి. దీనివల్ల రక్తపోటు, రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.

                                                *నిశ్శబ్ద.
 

By
en-us Political News

  
కాలం మారినా మనిషి జీవన పోరాటం మాత్రం మారదు.  కొందరు కాలంతో పోటీ పడి ఎండ, వాన, చలి వంటి వాటిని లెక్క చేయకుండా సాగుతూ ఉండాలి. లేకపోతే వారితో పాటు వారిని నమ్ముకున్న కుటుంబాలు కూడా ఇబ్బందులు పడాల్సి వస్తుంది.....
వేసవి అంటే మండే ఎండలు, వేడి గాలులు,  చెమటలు పట్టించే వాతావరణం.. ఇవన్నీ ఉంటాయి.  ఇలాంటి రోజుల్లో  రోడ్డు పక్కన అమ్మే చెరకు రసం తాగితే ఎంతో హాయిగా ఉంటుంది. నిమ్మరసం, నల్ల ఉప్పు, పుదీనా కలపడం వల్ల చెరకు రసం  రుచి మరింత ఇనుమడిస్తుంది...
సాధారణంగా తాంబూలం వేసుకోవడం అనేది మన సంప్రదాయంలో ఒక భాగం. కానీ, ఆ తాంబూలానికి కొన్ని ప్రత్యేకమైన ఆయుర్వేద మూలికలను జత చేస్తే, అది గుండెను రక్షించే ఒక అద్భుతమైన ఔషధంగా మారుతుందని..
వేసవి వాతావరణం శరీరాన్ని అలసటకు గురి చేయడమే కాకుండా, జీర్ణక్రియ , శక్తి పై కూడా ప్రభావం చూపుతుంది. ఆయుర్వేదం ప్రకారం, ఆరోగ్యకరమైన శరీరం , మనస్సును కాపాడుకోవడానికి వేసవి కాలంలో ఆహారంపై..
నేటి కాలంలో మారుతున్న ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి మరియు జీవనశైలి కారణంగా చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్య మలబద్ధకం..
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మనల్ని నిరంతరం వేధించే ప్రధాన శత్రువులు ఒత్తిడి మరియు ఆందోళన. వీటితో పాటు థైరాయిడ్..
బ్రేక్ ఫాస్ట్ లేదా అల్పాహారం నేటికాలపు జీవనశైలికి చాలా ముఖ్యంగా మారింది.  ఉదయాన్నే అల్పాహారం తప్పకుండా తినాలని వైద్యుల నుండి ఆహార నిపుణుల వరకు ప్రతి ఒక్కరూ చెబుతారు.  అయితే చాలామంది అల్పాహారంలో..
కాలంతో పాటు అన్ని అలవాట్లు అప్డేట్ అవుతూ ఉన్నాయి.  మొదట వేప పుల్లలతో పళ్లు తోమేవారు,  తర్వాత పేస్ట్ లు వచ్చాయి.  ఆ తరువాత పేస్ట్ లలో ఉప్పు, బొగ్గు, లవంగం వంటివి చేరాయి.  అవి కూడా అయ్యాక మౌత్ వాష్ లు వచ్చాయి....
ఆరోగ్యకరమైన శరీరానికి జింక్ చాలా అవసరం. జింక్ కణజాలాలను బాగుచేస్తుందని చెబుతారు. జింక్ ఒక యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తూ, కణాలను దెబ్బతినకుండా కాపాడటానికి సహాయపడుతుంది. చర్మం..
ఇనుప పాత్రలో వంట చేయడం ఆరోగ్యానికి మేలు చేస్తుందని చెబుతారు. ఎందుకంటే ఇనుప పాత్రలో వంట చేయడం వల్ల ఆ ఆహారాన్ని ఐరన్ ఖనిజం చేరుతుంది.  దీని వల్ల శరీరానికి ఐరన్ ఎలాంటి సప్లిమెంట్ ..
ఈ రోజుల్లో పిల్లల నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరు   ఎక్కువ సమయాన్ని మొబైల్, ల్యాప్‌టాప్ లేదా టాబ్లెట్ స్క్రీన్‌ల ముందు గడుపుతున్నారు. దీని ఫలితంగా, కంటి అలసట , చికాకు సర్వసాధారణమైపోయాయి...
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో సరైన నిద్ర లేకపోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి...
AI..ప్రపంచం అంతా వాడుతున్న కృత్రిమ మేధస్సు ఇది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఈ కృత్రిమ మేధస్సు వాడకం చాలా పెరిగింది.  ఏ చిన్న సందేహం వచ్చినా ఏఐ ని వాడటం, దాన్ని సలహాలు, సూచలు అడగడం..
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.