ప్రతి రోజు ఒక కప్పు దానిమ్మ రసం తాగితే జరిగే మ్యాజిక్ ఇదే..

Publish Date:Nov 27, 2025

Advertisement

పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి. ప్రతి రోజూ ఆహారంలో పండ్లు తీసుకుంటే ఆరోగ్యం ఎంతో బాగుంటుంది. అయితే కొన్నిరకాల పండ్ల రసాలు కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.  ముఖ్యంగా దానిమ్మ రసం చేసే మ్యాజిక్ అంతా ఇంతా కాదు. రోజూ ఒక కప్పు దానిమ్మ (pomegranate) రసం తాగడం అనేక ఆరోగ్య ప్రయోజనాలను చేకూరతాయి. ఇది శరీరాన్ని శక్తివంతంగా, ఆరోగ్యంగా ఉంచే సహజ ఆయుర్వేద ఔషధంలా పనిచేస్తుంది. దానిమ్మ రసం తాగడం వల్ల కలిగే ముఖ్యమైన ప్రయోజనాలు ఏంటంటే..

గుండె ఆరోగ్యానికి మంచిది..

రక్తనాళాలను శుభ్రపరిచి, రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. చెడ్డ కొలెస్ట్రాల్ (LDL) స్థాయిని తగ్గిస్తుంది, మంచి కొలెస్ట్రాల్ (HDL) పెరుగుతుంది. గుండెపోటు, హై బీపీ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.

యాంటీ ఆక్సిడెంట్..

దానిమ్మలో పునికాలగిన్స్ (punicalagins) అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ను తొలగించి, క్యాన్సర్, వృద్ధాప్యం రాకుండా రక్షిస్తాయి. శరీరానికి నష్టం కలిగించే హానికరమైన కణాలతో పోరాడతాయి.

రక్తహీనత (అనీమియా) నివారణ..

దానిమ్మలో ఐరన్ అధికంగా ఉంటుంది. కాబట్టి దానిమ్మ జ్యూస్ లో కూడాఐరన్ అధికంగా ఉంటుంది.  ఈ కారణం వల్ల హిమోగ్లోబిన్ పెరగడానికి దోహదం చేస్తుంది. రక్తహీనత సమస్య తో ఇబ్బంది పడేవారు,  ముఖ్యంగా మహిళలు దానిమ్మ రసం రోజూ తీసుకుంటే మంచిది.  ఇంకా దానిమ్మ జ్యూస్  రక్తాన్ని శుద్ధి చేస్తుంది, చర్మవర్ణం మెరుగుపరుస్తుంది.


 రోగనిరోధక శక్తి..

దానిమ్మలో విటమిన్ C, విటమిన్ K, పొటాషియం అధికంగా ఉంటాయి.  ఇవి   ఇమ్యూనిటీని పెంచడంలో సహాయపడతాయి. జలుబు, దగ్గు వంటి సీజనల్ ఇన్ఫెక్షన్ల నుండి రక్షించడంలో సహాయపడతాయి.

చర్మ ఆరోగ్యం,  అందం..

దానిమ్మ జ్యూస్ రోజూ తాగుతూ ఉంటే చర్మం గ్లోగా, యంగ్‌గా కనిపించేందుకు సహాయపడుతుంది.  అలాగే చర్మం మీద మొటిమలు, మచ్చలు తగ్గించడంలో సహకరిస్తుంది.

మూత్రపిండాలకు & కాలేయానికి శుభ్రత..


టాక్సిన్లను బయటకు పంపి లివర్‌ను డిటాక్స్ చేయడంలో దానిమ్మ బాగా పనిచేస్తుంది. అంతేకాదు  మూత్రపిండాల్లో రాళ్ల ఏర్పడటాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.

ఆకలిని నియంత్రించడం & బరువు తగ్గడం..

దానిమ్మలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.  ఈ కారణంగా దానిమ్మ పండు లేదా జ్యూస్ తీసుకుంటే   త్వరగా ఆకలి కాదు.   మితంగా తీసుకుంటే బరువు తగ్గే వారికీ సహాయకరంగా ఉంటుంది.

దానిమ్మ జ్యూస్ తాగే ముందు ఈ జాగ్రత్తలు తీసుకోండి..

ఫ్రెష్‌గా గ్రైండ్ చేసిన  రసం తీసుకోవడం మంచిది.  ప్యాకెట్ జ్యూస్‌లో చక్కెర అధికంగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి మేలు కంటే హాని ఎక్కువ చేస్తుంది.  డయాబెటిస్ ఉన్నవారు డాక్టర్ సలహాతో మాత్రమే తీసుకోవాలి. రోజూ 1 కప్పు (150–200 మిల్లీలీటర్లు) సరిపోతుంది. అంతకు మించి ఎక్కువ తీసుకోకూడదు.

                                  *రూపశ్రీ.


గమనిక:
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

By
en-us Political News

  
ప్రతి మనిషి శరీరానికి సహజ ధర్మాలు ఉంటాయి.  ఆకలి వేసినప్పుడు ఆహారం తినడం,  దాహం వేసినప్పుడు నీరు త్రాగడం ఎలాగో.. మలమూత్ర విసర్జన కూడా అలాగే జరగాలి.  కానీ చాలామందికి మూత్రాన్ని ఆపుకునే అలవాటు ఉంటుంది...
ప్రతి ఏడాది ఎండలు పెరుగుతున్నట్టే చలి కూడా పెరుగుతోంది.   చివరి ఏడాది కంటే ఈ ఏడాది చలి తీవ్రత కూడా పెరిగింది.  చలి ఉదయం, రాత్రి వేళల్లో చాలా ఎక్కువగా ఉంటుంది.  ఇది నిజానికి చాలా మంది నిద్రించే సమయం...
లవంగాలు వంటింట్లో ఉండే ఒక మసాలా దినుసు.  
ఆయుర్వేదంలో ఉసిరికాయను "అమృతఫలం" అని పిలుస్తారు.  అంటే అమృతంతో సమానమైన ఔషద గుణాలు కలిగిన ఫలం. అమృతంలాగా శరీరానికి గొప్ప ఆరోగ్యాన్ని చేకూర్చుతుంది అని అర్థం.  ఉసిరికాయలో అనేక విటమిన్లు, ఖనిజాలు...
డిప్రెషన్.. నేటికాలంలో చాలామంది ఎదుర్కుంటున్న సమస్య.  చిన్న పెద్ద తేడా లేకుండా అన్ని వయసుల వారు ఈ డిప్రెషన్ ఊబిలో చిక్కుకుంటున్నారు. దీన్నుండి బయటపడటానికి మానసికంగా యుద్దం చేస్తుంటారు...
దోసకాయ తినడానికి  చాలా మంది  ఇష్టపడతారు. సాధారణంగా దోసకాయను  కూరగాయల లిస్ట్ లో చెబుతారు. దోసకాయలో నీరు  సమృద్ధిగా ఉండటం వలన ఇది శరీరాన్ని చల్లబరుస్తుంది,  శరీరం డీహైడ్రేట్ కాకుండా  నివారిస్తుంది...
శీతాకాలం ఆరోగ్యానికి పరీక్షలు పెట్టే కాలం.  శీతాకాలంలో చలి కారణంగా జలుబు, ఇన్ఫెక్షన్లు,  చర్మం పగలడం,  దురదలు,  ర్యాషెస్, డాండ్రఫ్ వంటివి చాలా వస్తాయి.  
సర్వేంద్రియానాం నయనం ప్రధానం అన్నారు.
కుటుంబ సభ్యులతో, స్నేహితులతో, ఇరుగు పొరుగు, కొలీగ్స్..  ఇట్లా  ఎవరితో అయినా ఎక్కడికైనా ప్రయాణాలు చేయాల్సి వస్తూనే ఉంటుంది....
పొట్ట కాస్త తేడా కొడితే చాలు.. ఎంత బలంగా, దృఢంగా ఉన్న మనిషి అయినా అసౌకర్యానికి లోనవుతారు. పొట్ట ఆరోగ్యం బాగుంటే మిగతా శరీరం ఆరోగ్యం కూడా చాలా వరకు బాగుంటుంది. కానీ పొట్ట ఆరోగ్యం తేడా వస్తే తిండి, నీరు తీసుకోవడం కూడా బ్రేక్ పడుతుంది. ఇలా పొట్ట, ప్రేగు ఆరోగ్యాన్నే గట్ అని పిలుస్తారు....
సాధారణంగా ఏదైనా అనారోగ్యం వల్ల డాక్టర్ చెకప్ చేయించుకున్నప్పుడు చాలామంది కిడ్నీ టెస్ట్ కూడా చేయించుకుంటారు.  ఈ సందర్భంలో కొందరిలో క్రియేటినిన్ స్థాయిలు ఎక్కువగా ఉన్నట్టు బయటపడుతుంటుంది.  క్రియేటినిన్ అనేది ఎక్కువగా ఉండటం వల్ల శరీరంలో విషపదార్థాలు ఎక్కువగా పేరుకుపోవడానికి..
చాలా మంది  సీజన్‌తో సంబంధం లేకుండా తరచుగా  ఇన్ఫెక్షన్లకు గురవుతూ ఉంటారు. గతంలో వాతావరణ మార్పుల కారణంగా జలుబు,  ఫ్లూ లాంటి అనారోగ్యాలు వచ్చేవి. కానీ ఇప్పుడు వాతావరణ మార్పుల వల్ల  డెంగ్యూ, చికున్‌గున్యా, విరేచనాలు...
శరీరానికి శక్తిని ఇవ్వడంలో ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది.  శరీరానికి ప్రోటీన్లు, విటమిన్లు,  ఖనిజాలు,  అమైనో ఆమ్లాలు.. ఇలా అన్ని రకాలు అవసరం అవుతాయి. ఇలా అన్ని కలగలిసిన ఆహారాన్నే సమతుల ఆహారం అని అంటారు....
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.