చలికాలంలో బెల్లం, వేయించిన శనగలు తినడం వల్ల కలిగే లాభాలు తెలుసా!
Publish Date:Nov 22, 2025
Advertisement
శీతాకాలంలో చలి రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది. తొందరగా అలసిపోయేలా చేస్తుంది. ఇన్ఫెక్షన్లు కలిగించడానికి కూడా కారణం అవుతుంది. చలికాలంలో ఏం తింటున్నాం, ఏ దుస్తులు ధరిస్తున్నాం అనేదికూడా ఆరోగ్యం విషయంలో కీలక పాత్ర పోషిస్తుంది. చలికాలంలో శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో కొన్ని ఆహారాలు చాలా బాగా పనిచేస్తాయి. భారతీయుల సాంప్రదాయ ఆహారాలు సీజనల్ సమస్యలకు ఔషధంగానూ,శరీరానికి సూపర్ పుడ్ గానూ పనిచేస్తాయి. అలాంటి ఆహారాలలో వేయించిన శనగలు, బెల్లం అద్భుతమైన కాంబినేషన్ గా పిలవబడుతుంది. అటు ఆరోగ్యాన్ని, ఇటు పోషకాలను కూడా సమృద్దిగా అందించే ఈ బెల్లం, వేయించిన శనగలను చలికాలంలో తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుంటే.. గుండె ఆరోగ్యం.. బెల్లం గుండెకు చాలా అవసరమైన ఐరన్, పొటాషియంలను అధికంగా కలిగి ఉంటుంది . ఐరన్ రక్త ప్రసరణను బాగా నిర్వహించడానికి సహాయపడుతుంది, పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. శనగపప్పులో విటమిన్లు, కాల్షియం, మెగ్నీషియం ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి, గుండె సమస్యల ప్రమాదాన్ని తగ్గించడానికి కూడా సహాయపడతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. బెల్లం క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రక్తహీనతను నివారించవచ్చు. ఇది అలసట, బలహీనతకు కారణమవుతుంది. బెల్లం తీసుకుంటే హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుకోవచ్చు. అలాగే ఆరోగ్యకరమైన హృదయనాళ వ్యవస్థకు సహాయపడుతుంది. జీర్ణవ్యవస్థ ఆరోగ్యం.. తరచుగా మలబద్ధకం, ఉబ్బరం లేదా గ్యాస్ వంటి జీర్ణ సమస్యలతో బాధపడుతుంటే ఆహారంలో బెల్లం, శనగపప్పులను తీసుకోవడం చాలా మంచిది. బెల్లం, వేయించిన శనగలు.. రెండింటిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది మలబద్దకాన్ని నయం చేయడంలోనూ, జీర్ణ ఆరోగ్యానికి మద్దతు ఇవ్వడంలోనూ సహాయపడుతుంది. బెల్లం, శనగల కాంబినేషన్ ప్రేగులను శుభ్రపరచడమే కాకుండా, శరీరం జీర్ణ ఎంజైమ్‌లను ఉత్పత్తి చేయడానికి కూడా సహాయపడుతుంది. ప్రతి రోజూ ఒక చిన్న బెల్లం ముక్క, ఒక గుప్పెడు వేయించిన శనగలు తినడం మంచిది. కండరాల ఆరోగ్యం.. శరీరం బలంగా, దృఢంగా ఉండాలని అనుకునేవారికి బెల్లం, శనగలు చాలా మంచి ఛాయిస్ అంటున్నారు పోషకాహార నిపుణులు. బెల్లంలోని పొటాషియం కండరాలు బాగా పనిచేయడానికి సహాయపడుతుంది. కండరాల తిమ్మిరి సమస్యను తగ్గిస్తుంది. వేయించిన శనగల్లో ఉండే ప్రోటీన్ కండరాలను బలంగా మార్చడంలో సహాయపడుతుంది. మెదడు, దంతాల ఆరోగ్యం.. వేయించిన శనగలు, బెల్లం తినడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుందట. బెల్లంలో యాంటీఆక్సిడెంట్లు సమృద్దిగా ఉంటాయి. ఇది జ్ఞాపకశక్తిని, కంటిచూపును మెరుగుపరుస్తాయి. బెల్లం, వేయించిన శనగపప్పు రెండింటిలో భాస్వరం ఉంటుంది. ఇది ఆరోగ్యకరమైన దంతాలు, ఎముకలకు చాలా ముఖ్యం. *రూపశ్రీ. గమనిక:
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
http://www.teluguone.com/news/content/health-benefits-of-jaggery-and-fried-chickpeas-in-winter-34-209913.html





