ఖాళీ కడుపుతో నిమ్మరసం తీసుకుంటే ఇన్ని షాకింగ్ ఫలితాలు ఉంటాయని తెలుసా?

Publish Date:Dec 31, 2024

Advertisement

 


నిమ్మరసం భారతీయుల ఆహారంలో ప్రధాన భాగం.  నిమ్మరసాన్ని వంటల్లో మాత్రమే కాకుండా రిఫ్రెషింగ్ డ్రింక్స్ లోనూ,  డిటాక్స్ డ్రింక్స్ లోనూ ఉపయోగిస్తారు.  నిమ్మరసాన్ని భారతీయ సంప్రదాయ వంటల తయారీలోనూ ఉపయోగిస్తారు.  నిమ్మరసాన్ని ఆహారంలో భాగం చేసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా నిమ్మరసాన్ని ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనం ఉంటుంది.  

నిమ్మరసం సిట్రస్ జాతికి చెందిన పండు.  దీన్ని పండు అని పిలుస్తామే కానీ నేరుగా దీన్ని తినలేము.  చాలా పుల్లగా ఉండే నిమ్మరసాన్ని పానీయాలలోనూ,  వంటల్లోనూ పులుపు కోసం జోడించుకుంటారు.  ఇక నిమ్మకాయలలో విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది.  అలాగే యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువగా ఉంటాయి.

గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి ఉదయాన్నే తాగాలి.  ఇలా చేయడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది.  ఇది మలబద్దకం, అజీర్ణం సమస్యలను కూడా తొలగిస్తుంది.  గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తీసుకుంటే పేగులు శుభ్రపడతాయి.  శరీరం శుద్ది అవుతుంది. శరీరంలో ఉండే మలినాలు బయటకు పోతాయి.

 ప్రతి ఒక్కరి శరీరంలో టాక్సిన్లు ఉంటాయి.  ఇవి ఆహారం, తాగే పానీయాలు, నీరు,  వాతావరణం కారణంగా శరీరంలో చేరతాయి.  ఈ టాక్నిన్లను తొలగించుకోవాలంటే డిటాక్స్ వాటర్ తాగాలి. డిటాక్స్ వాటర్ తాగితే శరీరం డిటాక్స్ అవుతుంది.  అందుకోసం ఉదయాన్నే నిమ్మరసం కలిపిన నీటిని తాగాలి.  ఇలా చేయడం వల్ల శరీరంలో విష పదార్థాలు,  వ్యర్థాలు అనబడే టాక్సిన్లు బయటకు వెళ్లిపోతాయి.

నిమ్మకాయలో విటమిన్-సి ఉంటుందనే విషయం తెలిసిందే.  ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది.  రోజూ నిమ్మరసం కలిపిన నీటిని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగుతూ ఉంటే రోగనిరోధక శక్తి బలపడి వ్యాధులతో పోరాడే శక్తిని శరీరానికి అందిస్తుంది.

ఉదయాన్నే పరగడుపున గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగడం వల్ల శరీరం హైడ్రేట్ గా ఉంటుంది. ఇది రోజంతా శరీరాన్ని చురుగ్గా ఉండేలా చేస్తుంది.  నిమ్మరసంలో ఉండే సమ్మేళనాలు శరీరానికి చురుకుదనం ఇస్తాయి.

నిమ్మరసంలో ఉండే విటమిన్-సి శరీరానికి రోగనిరోధక శక్తిని ఇవ్వడం మాత్రమే కాదు.. శరీరంలో కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో సహాయపడుతుంది.  శరీరంలో ఉండే అదనపు కొవ్వును కూడా తగ్గిస్తుంది.  ఇది బరువు తగ్గాలని అనుకునేవారికి చాలా మంచి పానీయం.  నిమ్మరసం కలిపిన నీరు ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకుంటూ ఉంటే కొన్ని రోజులలోనే బరువు విషయంలో మార్పులు స్పష్టంగా కనిపిస్తాయి.

నిమ్మకాయలలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది.  ఇది గుండె ఆరోగ్యాన్నిమెరుగుపరుస్తుంది.  ఎలాగంటే పొటాషియం అధిక రక్తపోటును అదుపులో ఉంచుతుంది.  రక్తపోటు ఎక్కువైన సందర్బాలలోనే గుండెపోటు వచ్చే ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి.  అందుకే నిమ్మరసాన్ని అధిక రక్తపోటు ఉన్నవారు ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకుంటే రక్తపోటు అదుపులో ఉండి గుండెపోటు వచ్చే అవకాశాలు తగ్గుతాయి.

మధుమేహం ఉన్నవారికి కూడా నిమ్మరసం మంచిది.  ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది. ప్రతి రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో నిమ్మరసం కలిపిన నీటిని తాగుతుంటే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.


                                       *రూపశ్రీ.
 

By
en-us Political News

  
స్ట్రెస్, ఆందోళన, బీపీ వంటి సమస్యలతో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. రోజువారీ జీవితంలో ఒత్తిడి పెరగడంతో మనసుతో పాటు శరీరంపై కూడా ప్రభావం పడుతుంది. ఇలాంటి సమయంలో శ్వాసపై దృష్టి పెట్టే ప్రాణాయామాలు కొంతమందికి రిలాక్సేషన్‌కు సహాయపడవచ్చు.
మన శరీరం సరిగ్గా పనిచేయడానికి అవసరమైన ముఖ్యమైన ఖనిజాల్లో పొటాషియం (Potassium) ఒకటి. శరీరంలో పొటాషియం స్థాయి సరైన మోతాదులో ఉండటం చాలా ముఖ్యం.
సర్వేంద్రియానాం నయనం ప్రధానం అని అంటారు. కంటి ఆరోగ్యం మెరుగ్గా ఉంటే జీవితం చాలా వరకు దిగులు లేకుండా ఉంటుంది.   కంటికి ఏదైనా సమస్య వస్తే.. దాని ప్రభావం జీవితం మీద చాలా ప్రస్పుటంగా కనిపిస్తుంది.
కాల్షియం, ఐరన్ లోపం ఉందా? పాలు, పాల ఉత్పత్తుల విషయంలో కల్తీపై ఆందోళన ఉందా? అయితే మన ఇంట్లోనే సులభంగా లభించే ఒక ఆకుకూర మీ ఆహారంలో మంచి పోషక వనరుగా ఉపయోగపడవచ్చు.
ఐస్ క్రీమ్.. చిన్న పిల్లల నుండి పెద్దల వరకు ఇష్టంగా తింటారు. చాలామంది వర్షాకాలంలో కూడా ఐస్ క్రీమ్ తింటే ఆ కిక్కే వేరు అంటారు.  కాలం ఏదైనా ఐస్ క్రీమ్ పట్ల చాలా ఇష్టం ఉంటుంది.
చండీపురా వైరస్ (Chandipura Virus) ప్రస్తుతం ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్న వైరస్‌లలో ఒకటి. ముఖ్యంగా 15 సంవత్సరాల లోపు పిల్లల్లో ఈ వైరస్ తీవ్రమైన ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. వర్షాకాలంలో దీని ప్రమాదం మరింత ఎక్కువగా ఉంటుంది.
మనిషి  మెదడు చాలా శక్తివంతమైనది.  మనిషి మనుగడ సాగుతున్నది మెదడు పనితీరు మీదనే.. మెదడు ఎంత ఆరోగ్యంగా ఉంటే మనిషి జీవితం అంత బాగుంటుంది.
మధుమేహం అనేది ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఒక ఆరోగ్య సమస్య, ఇది అన్ని వయసుల వారిని ప్రభావితం చేస్తుంది. జీన్స్ ప్రభావం, ఊబకాయం , జీవనశైలిలో మార్పులు వంటి కొన్ని ప్రమాద కారకాలు ఈ వ్యాధి వచ్చే ప్రమాదాన్ని పెంచుతాయి.
అవిసె గింజలు (Flax Seeds) చిన్నవైనా ఆరోగ్యానికి చేసే మేలు ఎంతో గొప్పది. ఆయుర్వేద నిపుణులు డా. చిట్టిభొట్ల మధుసూదన శర్మ ఈ వీడియోలో అవిసె గింజల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను సులభంగా వివరించారు.
ప్రతిరోజూ ఉదయం కేవలం 5 నుంచి 10 నిమిషాల పాటు భస్త్రిక ప్రాణాయామం చేస్తే శరీరానికి, మనసుకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి.
పిల్లలు తమ మనసులో ఉన్న ప్రతి విషయాన్ని తల్లిదండ్రులతో స్వేచ్ఛగా పంచుకుంటున్నారా? లేక కొన్ని విషయాలను దాచిపెడుతున్నారా? పిల్లలు తమ సమస్యలు, భయాలు, సందేహాలు, విజయాలు, అపజయాలు అన్నింటినీ తల్లిదండ్రులతో నమ్మకంగా చెప్పుకోవడం వారి మానసిక ఎదుగుదలకు ఎంతో అవసరం. 
పిల్లలకు పేరు పెట్టడం అనేది ప్రతి తల్లిదండ్రులకు ఎంతో ప్రత్యేకమైన మరియు పవిత్రమైన సందర్భం.
మోకాళ్ల నొప్పితో ఇబ్బంది పడుతున్నారా? తరచూ పెయిన్‌కిల్లర్ మాత్రలు వాడుతున్నారా? అయితే ఈ వీడియోను తప్పకుండా చూడండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.