నెలరోజుల పాటు ఒక గ్లాస్ మెంతి గింజల నీరు తాగితే ఏమవుతుందంటే..!

Publish Date:Dec 23, 2024

Advertisement

 


ఆకుకూరలు ఆరోగ్యానికి చాలా మంచివి.  ఆకుకూరల పెంపకానికి విత్తనాలే మూలం. అయితే అన్ని విత్తనాలను నేరుగా తీసుకోలేం.  ముఖ్యంగా మెంతికూరలో ఫైబర్, ప్రోటీన్, విటమిన్లు,  మినరల్స్ వంటి అనేక పోషకాలు  ఉంటాయి.  మెంతికూరనే కాకుండా మెంతి గింజలను కూడా ఆహారంలో వాడతారు.  ఇవి శరీరానికి అనేక విధాలుగా ప్రయోజనం చేకూరుస్తాయి. మెంతి గింజలను రాత్రిపూట నీటిలో నానబెట్టినప్పుడు, దానిలోని పోషకాలు నీటిలోకి ట్రాన్స్ఫర్ అవుతాయి. ఇది మరింత ప్రయోజనకరంగా ఉంటుంది.


రోజూ మెంతి నీళ్ళు తాగడం వల్ల  ఆరోగ్యం చాలా మెరుగుపడుతుంది.  మెంతులు ఒక మసాలా  దినుసుగా ఉపయోగిస్తారు. ఇది ఆహార రుచిని పెంచడమే కాకుండా అనేక వ్యాధులను నయం చేయడంలో కూడా సహాయపడుతుంది. నెల రోజుల పాటు ప్రతిరోజూ ఒక గ్లాసు మెంతుల  నీరు తాగడం వల్ల కలిగే  ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకుంటే..  

మెంతి నీరు..

రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు నీటిలో రెండు చెంచాల మెంతి గింజలు వేసి మూత పెట్టాలి. ఉదయం ఖాళీ కడుపుతో ఈ నీటిని తాగాలి. ఇలా రోజూ ఒక నెల రోజులు చేస్తే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.

జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి..


మెంతికూరలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది, ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. నెల రోజుల పాటు రోజూ మెంతి నీరు తాగడం వల్ల మలబద్ధకం, అసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. మెంతి కూరలో ఉండే ఎంజైమ్‌లు జీర్ణక్రియను సులభతరం చేస్తాయి.  ఆహారాన్ని సరిగ్గా జీర్ణం చేయడంలో సహాయపడతాయి.


బరువు తగ్గడం సులభం..

మెంతికూరలో ఉండే కొన్ని మూలకాలు శరీరంలో ఉండే కొవ్వును తగ్గించడంలో సహాయపడతాయి. అదనంగా ఇది ఆకలిని తగ్గించడం ద్వారా బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. మెంతి నీళ్ళు తాగడం వల్ల జీవక్రియ పెరిగి శరీరంలో క్యాలరీలు త్వరగా బర్న్ అవుతాయి.

రోగనిరోధక శక్తిని పెంచుతాయి..

మెంతికూరలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుండి కాపాడతాయి.  రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి . నెల రోజుల పాటు రోజూ ఒక గ్లాసు మెంతికూర నీరు తాగడం వల్ల జలుబు, దగ్గు వంటి చిన్నచిన్న వ్యాధులకు దూరంగా ఉండవచ్చు.

చక్కెర స్థాయి నియంత్రణ..

మెంతికూరలో ఉండే కొన్ని మూలకాలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులకు మెంతి నీరు చాలా మేలు చేస్తుంది. ఇది ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచడం ద్వారా రక్తంలో చక్కెరను తగ్గిస్తుంది.

హృదయ ఆరోగ్యం..


మెంతికూరలో ఉండే పోషకాలు గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడం ద్వారా గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అంతే కాకుండా రక్తపోటును అదుపు చేయడంలో మెంతి నీరు కూడా ఎంతగానో సహకరిస్తుంది.


చర్మం మరియు జుట్టుకు..

మెంతికూరలో ఉండే విటమిన్లు,  ఖనిజాలు చర్మం-జుట్టు ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. అంతే కాదు మొటిమలు, మచ్చలను తొలగించి జుట్టును మృదువుగా,  మెరిసేలా చేయడంలో కూడా మెంతి నీరు సహాయపడుతుంది.

                                        *రూపశ్రీ.

By
en-us Political News

  
మధుమేహం (Diabetes) ఉన్నవారు చేసే మొదటి పని అన్నం మానేసి చపాతీలు తినడం. మరి నిజంగా చపాతీ తింటే షుగర్ తగ్గుతుందా? అన్నం తింటే పెరిగిపోతుందా? ఈ విషయంలో చాలా మందిలో..
నేటి వేగవంతమైన ఒత్తిడితో కూడిన జీవితంలో ఆందోళన ఒక సాధారణ సమస్యగా మారింది. కొన్నిసార్లు చిన్న చిన్న విషయాలు కూడా మనసును అశాంతపరిచి, నిద్ర, ఆహరం, రోజువారీ జీవనశైలిపై  ప్రభావం చూపుతాయి...
కాలం మారినా మనిషి జీవన పోరాటం మాత్రం మారదు.  కొందరు కాలంతో పోటీ పడి ఎండ, వాన, చలి వంటి వాటిని లెక్క చేయకుండా సాగుతూ ఉండాలి. లేకపోతే వారితో పాటు వారిని నమ్ముకున్న కుటుంబాలు కూడా ఇబ్బందులు పడాల్సి వస్తుంది.....
వేసవి అంటే మండే ఎండలు, వేడి గాలులు,  చెమటలు పట్టించే వాతావరణం.. ఇవన్నీ ఉంటాయి.  ఇలాంటి రోజుల్లో  రోడ్డు పక్కన అమ్మే చెరకు రసం తాగితే ఎంతో హాయిగా ఉంటుంది. నిమ్మరసం, నల్ల ఉప్పు, పుదీనా కలపడం వల్ల చెరకు రసం  రుచి మరింత ఇనుమడిస్తుంది...
సాధారణంగా తాంబూలం వేసుకోవడం అనేది మన సంప్రదాయంలో ఒక భాగం. కానీ, ఆ తాంబూలానికి కొన్ని ప్రత్యేకమైన ఆయుర్వేద మూలికలను జత చేస్తే, అది గుండెను రక్షించే ఒక అద్భుతమైన ఔషధంగా మారుతుందని..
వేసవి వాతావరణం శరీరాన్ని అలసటకు గురి చేయడమే కాకుండా, జీర్ణక్రియ , శక్తి పై కూడా ప్రభావం చూపుతుంది. ఆయుర్వేదం ప్రకారం, ఆరోగ్యకరమైన శరీరం , మనస్సును కాపాడుకోవడానికి వేసవి కాలంలో ఆహారంపై..
నేటి కాలంలో మారుతున్న ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి మరియు జీవనశైలి కారణంగా చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్య మలబద్ధకం..
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మనల్ని నిరంతరం వేధించే ప్రధాన శత్రువులు ఒత్తిడి మరియు ఆందోళన. వీటితో పాటు థైరాయిడ్..
బ్రేక్ ఫాస్ట్ లేదా అల్పాహారం నేటికాలపు జీవనశైలికి చాలా ముఖ్యంగా మారింది.  ఉదయాన్నే అల్పాహారం తప్పకుండా తినాలని వైద్యుల నుండి ఆహార నిపుణుల వరకు ప్రతి ఒక్కరూ చెబుతారు.  అయితే చాలామంది అల్పాహారంలో..
కాలంతో పాటు అన్ని అలవాట్లు అప్డేట్ అవుతూ ఉన్నాయి.  మొదట వేప పుల్లలతో పళ్లు తోమేవారు,  తర్వాత పేస్ట్ లు వచ్చాయి.  ఆ తరువాత పేస్ట్ లలో ఉప్పు, బొగ్గు, లవంగం వంటివి చేరాయి.  అవి కూడా అయ్యాక మౌత్ వాష్ లు వచ్చాయి....
ఆరోగ్యకరమైన శరీరానికి జింక్ చాలా అవసరం. జింక్ కణజాలాలను బాగుచేస్తుందని చెబుతారు. జింక్ ఒక యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తూ, కణాలను దెబ్బతినకుండా కాపాడటానికి సహాయపడుతుంది. చర్మం..
ఇనుప పాత్రలో వంట చేయడం ఆరోగ్యానికి మేలు చేస్తుందని చెబుతారు. ఎందుకంటే ఇనుప పాత్రలో వంట చేయడం వల్ల ఆ ఆహారాన్ని ఐరన్ ఖనిజం చేరుతుంది.  దీని వల్ల శరీరానికి ఐరన్ ఎలాంటి సప్లిమెంట్ ..
ఈ రోజుల్లో పిల్లల నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరు   ఎక్కువ సమయాన్ని మొబైల్, ల్యాప్‌టాప్ లేదా టాబ్లెట్ స్క్రీన్‌ల ముందు గడుపుతున్నారు. దీని ఫలితంగా, కంటి అలసట , చికాకు సర్వసాధారణమైపోయాయి...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.