Publish Date:Mar 13, 2026
హెచ్-1బీ వీసా రిజిస్ట్రేషన్ ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ గురువారం తన రిజిస్ట్రేషన్ పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ప్రక్రియ మార్చి 19 వరకు కొనసాగనుంది.హెచ్-1బీ వీసాలపై కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చిన తర్వాత జరుగుతున్న మొదటి రిజిస్ట్రేషన్లు ఇవే కావడం విశేషం.
ముఖ్యమైన మార్పులు ఇవే:
వేతనానికి ప్రాధాన్యం: లాటరీ విధానంలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇకపై ఎక్కువ వేతనం పొందే నిపుణులకు లాటరీలో అధిక ప్రాధాన్యం లభిస్తుంది.
కంపెనీలపై ప్రభావం : ఈ మార్పుల వల్ల కన్సల్టెన్సీల ద్వారా జరిగే నియామకాలపై కొంత ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. అయితే, సీనియర్ నిపుణులను నియమించుకునే పెద్ద కంపెనీలకు ఇది కలిసొచ్చే అంశం.
ఫీజు వివరాలు : ప్రతి రిజిస్ట్రేషన్‌కు కంపెనీలు 215 డాలర్లు ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ అభ్యర్థి ఎంపికైతే, వేతన ప్యాకేజీ ఇతర ఖర్చులతో కలిపి కంపెనీలు సుమారు లక్ష డాలర్ల వరకు వెచ్చించాల్సి ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
వీసాల కోటా:
హెచ్-1బీ వీసాలకు ఏటా భారీ డిమాండ్ ఉంటుంది. ప్రతి సంవత్సరం కేవలం 85,000 వీసాలను మాత్రమే యూఎస్ ప్రభుత్వం జారీ చేస్తుంది.వీటిలో 20,000 వీసాలు అమెరికా యూనివర్సిటీల్లో ఉన్నత విద్య (మాస్టర్స్ లేదా అంతకంటే ఎక్కువ) పూర్తి చేసిన అభ్యర్థులకు కేటాయిస్తారు.మిగిలిన 65,000 వీసాలు జనరల్ కేటగిరీ కింద అందరికీ అందుబాటులో ఉంటాయి
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/hb1-vesa-36-215446.html
మొయినాబాద్ ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి.
పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా విమానయాన రంగాన్ని అతలాకుతలం చేస్తున్నాయి.
శబరిమలలో మహిళల ప్రవేశానికి సంబంధించిన వివాదంపై సుప్రీంకోర్టులో జరుగుతున్న విచారణలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి.
హైదరాబాద్ నగరంలో ఫుడ్ సేఫ్టీపై మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది.
అసెంబ్లీకి అతి సమీపంలో ఉన్న ఆల్ ఇండియా రేడియో కార్యాలయానికి తొలుత బాంబు బెదరింపు వచ్చింది. దీనిపై ఆల్ ఇండియా రేడియో అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతోపోలీసులు ఆ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్నాయి. కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులను బయటకు పంపించారు.
హైదరాబాద్ నగరంలో కల్తీ దందాలు రోజురోజుకు పెరుగుతున్నాయి.
రాజధాని ప్రాంతమైన అమరావతిలో క్వాంటం వ్యాలీ ఏర్పాటుకు మూడు ప్రతిష్ఠాత్మక సంస్థలకు ఈ ఎస్ఐపీబీ సమావేశంలో మంజూరు చేయడం ఈ అయ్యాయి. ఈ అనుమతులతో అమరావతి కేవలం పరిపాలనా కేంద్రంగానే కాకుండా టెక్నాలజీ హబ్‌గా కూడా ఎదుగుతుంది.
హైదరాబాద్ బేగంపేటలో ఉన్న 145 సంవత్సరాల ప్రాచీన వారసత్వ కట్టడం చిరాన్ ఫోర్ట్ క్లబ్ చుట్టూ వివాదం రాజుకుంది.
తాడేపల్లిలోని ఆమె నివాసంతో పాటు విజయవాడ, గుంటూరు జిల్లాల్లోని ఇతర అనుమానిత ప్రాంతాల్లో ఏసీబీ సోదాలు నిర్వహించింది. ఈ సోదాలలో ఏసీబీ అధికారులు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఆమె పేరిట ఉన్న స్థిరాస్తులు, బ్యాంకు ఖాతాలు, బంగారు ఆభరణాలకు సంబంధించిన రికార్డులను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు.
ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ చిక్కుల్లో పడ్డాడు.
తీవ్ర ఆర్థిక సంక్షోభం, అంతర్జాతీయ పరిణామాల ప్రభావంతో ఏర్పడిన ఇంధన కొరత నేపథ్యంలో పాకిస్థాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ఏపీలో సౌర విద్యుత్ ఉత్పత్తి చేసే పూర్తి సామర్ధ్యాన్ని వినియోగించుకునేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని సీఎం చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఆధునికి సాంకేతిక యుద్దాల్లో కీలక పాత్ర పోషించ ఆత్మాహుతి డ్రోన్లు భారత్ ఆర్మీ అమ్ములపొదిలో చేరాయి.