యుద్ధం ముగిసిపోయినట్లేనా?

Publish Date:May 28, 2026

Advertisement

తెలుగువన్ ఎక్స్ క్లూజివ్

అగ్రరాజ్యాధినేత వ్యవహారతీరుపై తెలుగువన్ ఇంటర్వ్యూలో ప్రముఖ సామాజిక, రాజకీయ విశ్లేషకుడు కిలారు నాగార్జున

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు, ఆయన మారుస్తున్న మాటలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఒక నయా డిక్టేటర్ తరహాలో ఆయన వ్యవహరిస్తున్న తీరు గమనిస్తుంటే..  ప్రపంచాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టేలా ఉందని  ప్రముఖ సామాజిక, రాజకీయ విశ్లేషకుడు కిలారునాగార్జున అన్నారు. తెలుగువన్ తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన..   ఇరాన్ తో  ఉద్రిక్తతలు,  యుద్ధ వాతావరణం ప్రపంచ దేశాలను భయపెడుతోందన్నారు.

అయితే.. వ్యూహాత్మకంగా ఇరాన్ కీలకమైన హార్ముజ్ జలసంధిని తన అధీనంలో ఉంచుకుని అమెరికా పీక నొక్కడంతో ట్రంప్ కొంత వెనక్కి తగ్గారన్నారు. ఇరాన్ తో యుద్ధం వల్ల ఇప్పటివరకు అమెరికా సుమారు హాఫ్  ట్రిలియన్ డాలర్లు అంటే దాదాపు 45 నుంచి 50 లక్షల కోట్ల రూపాయలు నష్టపోయిందన్నారు.   యుద్ధం ముగిసిన తర్వాత ఏర్పడే అనంతర పరిణామాల వల్ల మరో  ట్రిలియన్ డాలర్లు అంటే దాదాపు 95 లక్షల కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లే ప్రమాదం పొంచి ఉందని విశ్లేషించారు. 

ఈ అంతర్జాతీయ ఉద్రిక్తతల ప్రభావం  అమెరికాపైనే కాకుండా  ప్రపంచ ఆర్థిక వ్యవస్థలపై తీవ్రంగా పడింది. సహజంగా ఆయిల్ నిల్వలు పుష్కలంగా ఉన్నప్పటికీ, అమెరికాలోనే చమురు ధరలు ఏకంగా 45 శాతం నుండి 50 శాతం వరకు పెరిగిపోవడం అక్కడ మధ్యతరగతి ప్రజల జీవితాలను అల్లకల్లోలం చేస్తోంది. లక్షలాది మంది అమెరికన్లు రోడ్లపైకి వచ్చి ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్నారు. మరోవైపు భారత్ విషయానికి వస్తే, భారత్‌లో ఇంధన ధరల పెరుగుదల కేవలం 4 శాతం నుండి 4.5 శాతం వరకే పరిమితం కావడం కొంత ఊరట కలిగిస్తున్న అంశం. అయినప్పటికీ, అంతర్జాతీయ చమురు సంక్షోభం మన దేశాన్ని కూడా ప్రభావితం చేస్తోంది.

రష్యాతో భారతదేశానికి ఉన్న పాత అనుబంధం, అక్కడి నుండి చౌకగా చమురు దిగుమతి చేసుకోవడంపై ట్రంప్ మొదట్లో తీవ్ర ఆంక్షలు విధించాలని చూశారు. రష్యా ఆయిల్ కొంటే చూస్తూ ఊరుకోనని హెచ్చరించిన ట్రంప్, ఆ తర్వాత భారత విదేశాంగ విధానం మరియు అంతర్జాతీయ ఒత్తిళ్లకు తలొగ్గి నెల రోజుల పాటు మినహాయింపు ఇచ్చిన సంగతిని గుర్తు చేస్తూ.. ఇప్పుడు ఆ  గడువును ఇప్పుడు మరో నెల రోజులు పొడిగించాల్సిన పరిస్థితికి ట్రంప్ వచ్చారంటేనే.. అమెరికా ఎంతగా తగ్గిందో అర్ధమౌతుందన్నారు.  భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ అమెరికా ద్వంద్వ నీతిని ఎండగడుతూ,  మా అవసరాలు మాకు ముఖ్యం, మమ్మల్ని ప్రశ్నించే ముందు యూరోపియన్ యూనియన్ సంగతి చూడండి అని గట్టిగా సమాధానం ఇవ్వడంతో ట్రంప్ నోరు మూతపడక తప్పలేదన్నారు.  

అయితే, అమెరికా అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న భారతీయులపై ట్రంప్ కక్షసాధింపు చర్యలు దిగజారుడుతనానికి నిదర్శనంగా నిలుస్తుయని కిలారు అన్నారు.  భారతీయులను  చీప్ లేబర్ అని సంబోధిస్తూ, వారికి హెచ్-1బి వీసాలు ఇవ్వకూడదని, కొత్త వీసాలపై నిషేధం విధించాలని ట్రంప్ ప్రయత్నిస్తున్నారన్నారు. ఒకవైపు భారత ప్రధాని మోదీని తన ఆప్తమిత్రుడు అని పొగుడుతూనే..  మరోవైపు ఇండియా ఒక డెడ్ ఎకానమీ అని, ఒప్పించడం చాలా కష్టమైన దేశమని ఉదయానికి ఒకలా, సాయంత్రానికి ఒకలా మాటలు మారుస్తూ ట్రంప్ మానసిక స్థిరత్వం కోల్పోయినట్లు ప్రవర్తిస్తున్నారని కిలారు చెప్పారు. రాబోయే రెండు మూడు నెలల్లో అంతర్జాతీయంగా ఈ సమస్యకు ఒక సామరస్యపూర్వక పరిష్కారం లభించకపోతే, ప్రపంచాన్ని ముంచెత్తబోయే భయంకరమైన ఆర్థిక మాంద్యం తీవ్ర నష్టాన్ని మిగులుస్తుందని విశ్లేషించారు. ఏది ఏమైనా ప్రస్తుత పరిస్థితుల్లో ట్రంప్ ఇంకా దూకుడుగా వెళ్లే పరిస్థితి లేదని కిలారు నాగార్జున చెప్పారు. 

By
en-us Political News

  
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ  తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి. 
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది.  సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును  దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి  కలల ప్రాజెక్ట్‌గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది.  ఈ నేపథ్యంలో తాను కేవలం  మంత్రి పదవిని  మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం  వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక  ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి..   తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ..  వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.  
 ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
 బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై  చార్జ్‌షీట్‌  విడుదల చేశారు.
మ్మెల్యేగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీకి ఆయన గైర్హాజరుపై రేవంత్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి హాజరుకాకుంటే కేసీఆర్  ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు.  తనను ఎన్నుకున్న నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
ఆయన పులివెందులపైనే ఎక్కువగా కాన్సట్రేట్ చేయడంతో ఆయనకు పులివెందులలో పట్టు జారుతోందన్న భయం పట్టుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అలాంటి భయమే లేకపోతే..  మాజీ సీఎంగా రాష్ట్రం మొత్తం తిరగాల్సిన ఆయన అది మానేసి  సొంత నియోజకవర్గానికే  ఎక్కువగా పరిమితం అవ్వరని అంటున్నారు.  
ప్రకాశం జిల్లాలో మరీ ముఖ్యంగా ఒంగోలులో  గట్టి పట్టు, రాజకీయ పలుకుబడి ఉన్న సీనియర్ నేత అయిన  బాలినేనికి, జనసేనలో ఏ మాత్రం ప్రాధాన్యత లభించడంలేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది.  పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న  నిర్ణయాలు, స్థానిక పరిస్థితులు కూడా ఆ ప్రచారానికి బలం చేకూర్చేవిగానే ఉంటున్నాయి. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.