అసెంబ్లీ ఎన్నికలకు ముందు గుజరాత్ కాంగ్రెస్’కు ఎదురుదెబ్బ.. హర్థిక్ పటేల్ గుడ్ బై
Publish Date:May 18, 2022
Advertisement
కాంగ్రెస్ పార్టీ రాజస్థాన్’లోని ఉదయపూర్ మూడు రోజుల రోజుల పాటు, నవ సంకల్ప చింతన్ శిబిర్ ‘ నిర్వహించి, మరో మూడు రోజులు అయినా గడవ లేదు, కానీ ఇంతలోనే, పిడుగు లాంటి వార్త ... గుజరాత్’ రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హార్దిక్ పటేల్, కాంగ్రెస్ పార్టీకీ, పార్టీ పదవికి రాజీనామా చేశారు. నిజమే, హార్దిక్ పటేల్ రాజీనామా నిజానికి అంత పిడుగులాంటి వార్త కాదు, ఎందుకంటే, గడచిన మూడు సంవత్సరాలలో హర్థిక్ పటేల్ కంటే పార్టీతో సుదీర్ఘ అనుబంధం ఉన్న, జ్యోతిరాదిత్య సిందియా వంటి అనేక మంది నాయకులు క్యూకట్టి పార్టీని వదిలి పోయారు. పోతూనే ఉన్నారు. అయినా, చింతన శిబిరంలో కానీ, అంతకు ముందు ఆ తర్వాత జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో కానీ, పార్టీతో తరతరాల అనుబంధం ఉన్న నాయకులు, ఎందుకు పార్టీ వదిలి పోతున్నారు? అనే కోణంలో కొద్దిపాటి చర్చకూడా జరగలేదు. అంతేకాదు, పోయే వాళ్ళంతా పోండని’ స్వయంగా రాహుల్ గాంధీనే తలుపులు తెరిచారు. అదొకటి అలాఉంటే హార్దిక్ పటేల్ కాంగ్రెస్ పార్టీని వదిలి పోవడం ఖాయమని, గుజరాత్ రాజకీయ వర్గాల్లో చాలా కాలంగా వినిపిస్తోంది. నిజానికి, చింతన్ శిబిర్’ జరుగతున్న సమయంలోనే హార్దిక్ పటేల్ ఒక టీవీ చానల్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో , రాష్ట్రంలో మరో ఆరు నెలలలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయనే విషయాన్ని కాంగ్రెస్ నాయకత్వం గుర్తించనే లేదని తీవ్ర విమర్శలు చేశారు. చివరి ప్రయత్నంగా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీని కలిసి, పరిస్థితి వివరిస్తానని, అప్పటికీ పార్టీ నాయకత్వంలో కదలిక రాక పొతే, పార్టీ వదిలి పోవడం మినహా మరో మార్గం లేదని చెప్పారు. ఆ తర్వాత, ఆయన సొనియా, రాహుల్ గాంధీలను కలిశారో లేదో కానీ, పార్టీకి అయితే రాజీనామా చేశారు. అదలా ఉంటే, అసెంబ్లీ ఎన్నికలకు ముందు, పాటీదార్ ఉద్యమం నుంచి ఎదిగొచ్చిన హర్థిక్ పటేల్ పార్టీకి రాజీనామా చేయడం, కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బగా పరిశీలకులు భావిస్తున్నారు. ప్రస్తుతం దేశంలో కాంగ్రెస్ పార్టీ ఉన్న పరిస్థితిలో, హర్థిక్ పటేల్ స్థాయి నాయకుడు పార్టీని వదిలి పోవడం, గట్టి ఎదురు దెబ్ అనడంలో ఎవరికీ ఎలాంటి అనుమానం అవసరం లేదు. నిజానికి, 2017 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమి అంచుల వరకు తీసుకుపోయిన ఖ్యాతి, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ కంటే, హార్దిక్ పటేల్ కే దక్కుతుంది. ఆ ఎన్నికల్లో బీజేపీ, అతి కష్టం మీద బయట పడింది. ఒకటి రెండు సీట్ల స్వల్ప మెజారిటీతో, అధికారాన్ని నిలుపుకుంది. ఇందుకు ప్రధాన కారణం, హర్థిక్ పటేల్ నాయకత్వంలో కొనసాగిన పాటీదార్ ఉద్యమం. గుజరాత్‌లో రాజకీయంగా ఎక్కువ ప్రభావం ఉన్న పాటీదార్ వర్గానికి నేత అయిన హర్దిక్ పటేల్.. బీజేపీని తీవ్రంగా వ్యతిరేకించారు. అదే సమయంలో తన మద్దతు కాంగ్రెస్‌కు ఇస్తున్నట్లు ప్రకటించారు. అయినప్పటికీ కాంగ్రెస్ ఆ ఎన్నికల్లో గెలవలేకపోయింది కానీ.. గుజరాత్ ముఖ్యమంత్రి నుంచి మోడీ దేశ ప్రధాని అయ్యాక జరిగిన మొదటి అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ అంచనాలను తారుమారు చేస్తూ, స్వల్ప మెజారిటీతో బీజేపీ గట్టెక్కింది.ఆ తర్వాత 2019 లోక్ సభ ఎన్నికలకు ముందు హార్దిక్ పటేల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే,పార్టీ ఆయనకు సముచిత స్థానం ఇవ్వక పోవడంతో ఎప్పటినుంచో అసంతృప్తిని వ్యక్తం చేస్తూ వచ్చిన ఆయన చివరాఖరుకు, పార్టీకి రాజీనామా చేయాలనే నిర్ణయానికి వచ్చారు. రాజీనామ చేశారు. ఈమధ్య కాలంలో ఆయన బీజేపీని, బీజేపీ నాయకత్వాని మెచ్చుకుంటూ చేసిన వ్యాఖ్యలను బట్టియా ఆయన బహుసా బీజేపీలో చేరడం ఖాయంగానే కనిపిస్తోందని అంటున్నారు. అదలా ఉంటే. హార్దిక్ పటేల్ రాజీనామాపై ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ‘అనధికార’ అధ్యక్షుడు, రాహుల్ గాంధీ పై నమ్మకం లేకనే హార్దిక్ రాజీనామా చేశారని ఒవైసీ అన్నారు. నిజం, అస్సాం ప్రస్తుత ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మమొదలు హార్దిక్ పటేల్ వరకు అనేక మంది సమర్ధులైన యువనాయకులు కాంగ్రెస్ పార్టీని వదలి బీజేపీగూటికి చేరడానికి,రాహుల్ గాంధీ ఇండిఫ్ఫెరెంట్’ యాటిట్యూడే’ కారణమని కాంగ్రెస్ సీనియర్ నేతలు, జీ 23 నాయకులు ఎప్పటినుంచో చెపుతూనే ఉన్నారు.
http://www.teluguone.com/news/content/harthk-patek-says-goodbye-to-congress-25-136095.html





