Publish Date:Apr 29, 2024
హరీష్ రావు.. బీఆర్ఎస్ లో అధిష్ఠానం పెద్దగా ఇష్టపడని కీలక నేత. పార్టీలో ఆల్ఈజ్ వెల్ పరిస్థితి ఉన్న సమయాలలో ఆయనకు ఎప్పుడూ పెద్ద ప్రాధాన్యత లభించలేదు. అదే పార్టీ ఇబ్బందుల్లో ఉన్నా, అసంతృప్తి నేతలను బుజ్జగించాలన్నా పార్టీ హైకమాండ్ కు ముందుగా గుర్తుకు వచ్చేది హరీష్ రావే. ఆఘమేఘాల మీద ఆయన మెడలో వీరతాళ్లేసేసి పార్టీని ఇబ్బందుల నుంచి గట్టెక్కించుందుకు తెరమీదకు తీసుకు వస్తుంటుంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్ల కాలంలోనూ ఇదే జరిగింది. ఇప్పుడు విపక్షంలో ఉన్నప్పుడు కూడా పార్టీ సమస్యల పరిష్కారం విషయంలో హరీష్ రావుపైనే ఆధారపడుతున్న పరిస్థితి ఉంది.
బీఆర్ఎస్ 2018 ఎన్నికలలో విజయం సాధించి రెండో సారి అధికారంలోకి వచ్చిన తరువాత కేసీఆర్ ఆయనను కేబినెట్ లోకి తీసుకోకుండా పక్కన పెట్టారు. కేటీఆర్ కు సీఎం పగ్గాలు అప్పగించే విషయంలో హరీష్ రావుతో ట్రబుల్స్ వస్తాయన్న అంచనాతోనే అప్పట్లో హరీష్ రావును పక్కన పెట్టారని కూడా అప్పట్లో గట్టిగా వినిపించింది. కారణాలేమైతేనేం మంత్రివర్గ విస్తరణలో ఆయనకు అవకాశం కల్పించక తప్పలేదు కేసీఆర్ కు. ఇప్పుడు బీఆర్ఎస్ విపక్షంలో ఉన్న సమయంలో కూడా హరీష్ రావు పార్టీకి బలం, బలహీనతగా మారిపోయారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అధికారంలో లేకపోవడంతో పార్టీలో గతంలోలా కేసీఆర్ మాట చెల్లు బాటు కావడం లేదంటున్నారు. ఇందుకు ఉదాహరణగా పార్టీ శాసనసభాపక్ష నేతగా కేటీఆర్ ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడానికి ఎమ్మెల్యేలు ససేమిరా అనడమేనని చెబుతున్నారు. అప్పట్లో హరీష్ రావును శాసనసభాపక్ష నేతను చేయాలని పలువురు ఎమ్మెల్యేలు గట్టిగా పట్టుబట్టినట్లు పార్టీ వర్గాలే చెప్పాయి. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో, అయిష్టంగానైనా కేసీఆర్ సీఎల్పీ నాయకుడిగా బాధ్యతలు చేపట్టారు. అయినా ఆ హోదాలో ఆయన అసెంబ్లీ సమావేశాలకు కూడా హాజరు కాలేదు అది వేరే సంగతి.
ఇప్పుడు కూడా కేసీఆర్, కేటీఆర్ కంటే హరీష్ రావే కాంగ్రెస్ పై విమర్శల విషయంలో, సవాళ్ల విషయంలో ఒకింత దూకుడు కనబరుస్తున్నారు. అటువంటి హరీష్ రావే తన మద్దతు దారులతో అంటే 20 మందికి పైగా ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ గూటికి చేరితే.. రాష్ట్రంలో ఇక బీఆర్ఎస్ ఉనికి మాత్రంగానైనా మిగులుతుందా? అయినా అసలు హరీష్ రావు ఏమిటి? కాంగ్రెస్ గూటికి చేరడమేమిటి? అనుకుంటున్నారా?
ఇటీవలి కాలంలో మంత్రులు కోమటరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు ఒకటి రెండు సందర్భాలలో పాతిక మంది వరకూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు. ఏ క్షణంలోనైనా వారు కాంగ్రెస్ గూటికి చేరవచ్చు అని చెప్పిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా బీజేపీ శాసనసభాపతి ఏలేటి మహేశ్వరరెడ్డి కూడా అదే ఆరోపణ చేశారు. ఎన్నికల తరువాత హరీష్ రావు 20 నుంచి 22 మంది ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారని ఆరోపించారు. మెదక్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రేవంత్ తో భేటీ వెనుక ఉన్నది హరీష్ రావేనని ఆరోపించారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు తమతో టచ్ లో ఉన్నారంటూ చెప్పిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్యా, తాజాగా బీజేపీఎల్పీ నాయకుడు ఏలేటి మహేశ్వరరెడ్డి హరీష్ మద్దతు దారులతో కలిసి కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకోవడానికి రెడీగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్యా దగ్గరదగ్గరగా ఉండటం గమనార్హం.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/harishrao-join-congress-25-174710.html
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్రబాబు ఫొటోలేదని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వర్మ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జనసేన నేత, మాజీ ఎమ్మెల్యే దొరబాబు జోక్యం చేసుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వర్మ దురుసు వ్యాఖ్యలపై పార్టీలో అంతర్గతంగా చర్చించిన అధిష్టానం.. వర్మ వ్యవహారాన్ని తప్పుబట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్‌కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్‌తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్‌కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.