ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత టీఆర్ఎస్‌ని నిట్టనిలువుగా చీల్చడానికి కాంగ్రెస్ పార్టీ వ్యూహం సిద్ధం చేసినట్టు సమాచారం. ప్రస్తుతం చాలామంది టీఆర్ఎస్‌కి పూర్తి మెజారిటీ వస్తుందని, కేసీఆర్ తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడని ప్రచారం చేస్తున్నారు. అయితే తెలంగాణలో హంగ్ రాబోతోందని , కాంగ్రెస్ పార్టీయే తెలంగాణలో అతి పెద్ద పార్టీగా ఆవిర్భవించే అవకాశం వుందని కాంగ్రెస్ పార్టీ బలంగా నమ్ముతోంది. తెలంగాణలో ప్రభుత్వం ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన మెజారిటీ సంపాదించడానికి టీఆర్ఎస్ పార్టీని నిలువునా చీల్చడానికి కాంగ్రెస్ ఆలోచిస్తోంది. ప్రజా ప్రతినిధుల మీద ‘ఆకర్ష’ మంత్రాన్ని ప్రయోగించడంలో కాంగ్రెస్ పార్టీకి సుదీర్ఘమైన అనుభవం వుంది. ఇప్పుడీ మంత్రాన్ని ఈ ఎన్నికలలో ఎన్నికవబోతున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద ప్రయోగించడానికి కాంగ్రెస్ రంగం సిద్ధం చేసింది. టీఆర్ఎస్ నుంచి బయటకి వచ్చే ఎమ్మెల్యేలకు ఒక నాయకుడు వుండాలి. ఆ నాయకుడికి ముఖ్యమంత్రి పదవి ఆఫర్ చేయాలి. అప్పుడే టీఆర్ఎస్‌ని చీల్చడానికి వీలవుతుంది. ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీని చీల్చడానికి ఉపయోగపడే నాయకుడిగా కేసీఆర్ మేనల్లుడు హరీష్‌రావును కాంగ్రెస్ అధిష్ఠానం పరిశీలిస్తోంది. టీఆర్ఎస్‌లో హరీష్ రావు, కేటీఆర్ మధ్య విభేదాలు ఎప్పటి నుంచో పెరుగుతున్నాయి. టీఆర్ఎస్‌లో ఎప్పటికైనా కేసీఆర్ తర్వాతి స్థానం కేటీఆర్‌దేనని హరీష్ రావుకి స్పష్టంగా తెలుసు. టీఆర్ఎస్‌లో వుండగా తాను తెలంగాణకు ముఖ్యమంత్రి కావడం అనేది ఊహల్లో తప్ప వాస్తవంలో అసాధ్యమని కూడా తెలుసు. గతంలో ఓసారి పార్టీలో కేటీఆర్‌తో వున్న విభేదాలకు చిరాకెత్తిన హరీష్ రావు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ప్రయత్నాలు చేశారు. అయితే వైఎస్సార్ మరణంతో ఆ ప్రయత్నాలకు ఫుల్ స్టాప్ పడింది. మళ్ళీ ఇప్పుడు ఆయన్ని కాంగ్రెస్ పార్టీ వైపు ఆకర్షించడానికి, ముఖ్యమంత్రి పదవి ఆఫర్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/harish-rao-39-33296.html
దేశరాజకీయాల్లో ప్రతిపక్ష ఇండియా కూటమి అత్యంత కీలకమైన అడుగులు వేస్తోంది.
రాజ్యసభ ఎంపీ అభ్యర్థులుగా తెలుగు దేశం పార్టీ తరుపున సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ లు నామినేషన్ లు దాఖలు చేశారు.
కేవలం తన కోటరీ మాటలు నమ్మి ప్రజా క్షేత్రానికి దూరం కావడం వల్లే ఘోర పరాజయాన్ని చవిచూశారు. అయితే 2024 ఎన్నికలలో విజయం సాధించి అధికారం చేపట్టిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నిత్వం ప్రజలకు చేరువగానే ఉంటోంది. ఇక తాజాగా ఈ నెల 9 నుంచి 15 వరకూ ప్రజాబాట కార్యక్రమాలను నిర్వహించనుంది.
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పై తన విమర్శల మోతాదు పెంచారు. ఒక భూమి విషయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పెరు లాగి మీడియా దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నించారు. ఆ క్రమంలో కల్వకుంట్ల కవిత ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాలకు సంబంధించి అధికార తెలుగుదేశం పార్టీ (టీడీపీ) తమ అభ్యర్థుల ఎంపికను అధికారికంగా పూర్తి చేసింది.
ఈ గ్లోబల్ ఎక్స్‌పోజర్, కమ్యూనికేషన్ స్కిల్స్ నేడు ఆయనను జాతీయ స్థాయి రాజకీయాలకు, ముఖ్యంగా రాజ్యసభ కు సమర్థుడైన అభ్యర్థిగా నిలబెడుతున్నాయి. 2019 ఎన్నికలలో తెలుగుదేశం ఓటమి తరువాత టీడీపీ తీవ్ర సంక్షోభంలో ఉన్న తరుణంలో.. సాంప్రదాయ మీడియా కంటే డిజిటల్ మీడియా ద్వారా అధికార పక్షాన్ని ఎదుర్కోవడం ముఖ్యమని పార్టీ గుర్తించింది
ప్రస్తుత జాతీయ రాజకీయాల పరిస్థితులు, పార్టీ భవిష్యత్ ను పరిగణనలోకి తీసుకుని చింతకాయల విజయ్ రాజ్యసభకు పంపడమే సముచితమని ఆయన నిర్ణయించారు.
ప్రస్తుతం కేంద్రంలో తెలుగుదేశం పార్టీ అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తోంది. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న తరుణంలో పార్లమెంట్‌లో పార్టీ గళాన్ని బలంగా వినిపించగల యువ, విద్యావంతులైన నాయకత్వం అవసరమని చంద్రబాబు భావించినట్లు కనిపిస్తోంది.
అన్నామలై ఇప్పుడు నేరుగా సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో చేతులు కలపబోతున్నారనే వార్త దావానలంలా వ్యాపిస్తోంది. వీరిద్దరూ కలిసి తమిళనాడులో ఒక సరికొత్త ప్రాంతీయ పార్టీని స్థాపించేందుకు సన్నాహాలు చేస్తున్నారనే వదంతులు తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
అలాగే అంతర్జాతీయ వాణిజ్యాన్ని ఊహించని రేంజ్‌లో పెంచడానికి ఈ ప్రాజెక్ట్ దేశానికి ఎంతో రక్షణ, ఆర్థిక ప్రయోజనకరమని కేంద్ర ప్రభుత్వం బలంగా చెప్తోంది. అయితే ఈ మెగా ప్రాజెక్టుపై లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తూ, ఇది దేశ చరిత్రలోనే అతి పెద్ద స్కామ్ అంటూ సంచలన ఆరోపణలు చేశారు.
తెలంగాణలో జనసేన పోటీ చేస్తుందన్న పవన్ కల్యాణ్ ప్రకటనపై స్పందించిన ప్రకాశ్ రాజ్ సింగిల్ గానా, పొత్తుతోనా అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు.
గతంలో ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రప్రదేశ్ నుండి గానీ, అంతకుముందు రెండుసార్లు గెలిచిన జార్ఖండ్ నుండి గానీ, లేదా ఆయన సొంత రాష్ట్రమైన గుజరాత్ నుండి గానీ ఈసారి అభ్యర్థిత్వం లభించలేదు. దేశంలోనే అత్యంత శక్తిమంతమైన రిలయన్స్ కార్పొరేట్ లాబీయింగ్ పప్పులు మారిన రాజకీయ సమీకరణాల ముందు ఉడకలేదు.
పవన్ రాజకీయ అవగాహనారాహిత్యానికి ఆయన వ్యాఖ్యలే తార్కానమన్నారు. ప్రపంచ పరిణామాలు ఏదిశగా నడుస్తున్నాయో కూడా ఆయనకు అర్థం కావడం లేదన్న వీ శ్రీనివాసరావు. . తమిళనాడులో సినీ నటుడు విజయ్ గెలుపు తర్వాత పవన్ కల్యాణ్‌పై ఒత్తిడి తీవ్రంగా ఉండడంతో ఆయన నిస్పృహనకు లోనవుతూ.. దీనివల్ల ఆయన ఏదేదో మాట్లాడుతున్నారన్నారు.
తమిళనాట విజయ్ సునామీ ప్రకంపనలు సద్దుమణగక ముందే, తమిళనాట మరో సీనియర్ సూపర్ స్టార్ రజినీకాంత్ పేరు పొలిటికల్ స్క్రీన్ పైకి రావడం పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది.