హరిద్వార్‌లో తొక్కిసలాట.. ఆరుగురు భక్తులు మృతి
Publish Date:Jul 27, 2025
Advertisement
యూపీలోని హరిద్వార్ మానసా దేవి ఆలయంలో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ విషాద ఘటనల్లో ఆరుగురు భక్తులు మృతి చెందారు. మరికొందరికి గాయాలయ్యానట్లు తెలుస్తోంది. శ్రావణ మాసం సందర్భంగా ఆదివారం ఆలయానికి భక్తులు పోటెత్తారు. పెద్ద సంఖ్యలు భక్తులు రావడంతో క్యూలైన్ లో తోపులాట చోటుచేసుకుందని తెలుస్తోంది. ప్రమాదం గురించి సమాచారం అందడంతో ఎమర్జెన్సీ బృందాలు హుటాహుటిన ఆలయానికి చేరుకున్నాయి. గాయపడిన భక్తులను దగ్గర్లోని ఆసుపత్రులకు తరలించాయి.ఈ ఘటనలో గాయపడిన భక్తులలో కొందరి పరిస్థితి సీరియస్ గా ఉందని డాక్టర్లు తెలిపారు. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మానసా దేవి ఆలయంలో తొక్కిసలాట జరిగి ఆరుగురు చనిపోయిన విషయాన్ని గర్వాల్ డివిజనల్ కమిషనర్ వినయ్ శంకర్ పాండే ధ్రువీకరించారు. విషయం తెలిసిన వెంటనే ఆలయం వద్దకు బయలుదేరానని, ఘటనా స్థలాన్ని పరిశీలించాక ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తామని కమిషనర్ పేర్కొన్నారు
http://www.teluguone.com/news/content/haridwar-39-202844.html





